BigTV English

Pakistan : పాక్ సెమీస్.. అదంత వీజీ కాదు!

Pakistan : పాక్ సెమీస్.. అదంత వీజీ కాదు!

Pakistan : క్రికెట్ లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ తెలీదు. టెక్నికల్ గా చూస్తే పాక్ కి సెమీస్ ఆశలు ఇంకా ఉన్నాయి. కాకపోతే అదంత వీజీ కాదని అంటున్నారు. ఎందుకంటే మిగిలిన జట్ట గెలుపు ఓటములపై అది ఆధారపడి ఉంది. ఈరోజుకి ఇప్పటికి పాక్ లైటు మిణుకుమిణుకు మంటూ వెలుగుతోంది. రేపు వేరే జట్ల విజయాలు అటూ ఇటైతే అదింకా వెలుగుతుంది. లేదంటే చటుక్కున ఆరిపోతుంది.


 శ్రీలంక అనూహ్యంగా ఆఫ్గాన్ చేతిలో ఓడిపోవడం పాక్ కి కలిసి వచ్చిందని అంటున్నారు. ఒకవేళ  శ్రీలంకేగానీ గెలిచి ఉంటే, 5వ ప్లేస్ లో ఉండేది. అప్పుడు పాక్  6వ స్థానానికి పరిమితమయ్యేది. అయితే  మరోవైపు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ రెండు కూడా 8 పాయింట్లతోనే ఉన్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ మిగిలిన రెండు మ్యాచ్ ల్లో గెలుపొందితే 10 పాయింట్లతో  ఉంటుంది. అయితే బంగ్లా మ్యాచ్ లో భారీ రన్ రేట్ తరహాలోనే గెలవాల్సి  ఉంటుంది.

పాకిస్తాన్ తన తర్వాత రెండు మ్యాచ్ లు న్యూజిలాండ్, ఇంగ్లండ్ మీద ఆడాల్సి ఉంది. ఇంగ్లండ్ ఎలాగూ చేతులెత్తేసింది కాబట్టి, వారిపై గెలవడం సులువుగానే కనిపిస్తోంది. ఎటొచ్చి న్యూజిలాండ్ తోనే చిక్కొచ్చింది. ఎందుకంటే ఇది న్యూజిలాండ్ కి కూడా పరీక్షా సమయమే.


ఒకవేళ కివీస్ సరిగ్గా ఆడకపోతే..ఆ  స్థానంలోకి పాక్ వచ్చి చేరుతుంది. ఇప్పుడు కివీస్ కి 8 పాయింట్లు ఉన్నాయి. పాక్ కి 6 ఉన్నాయి. తమ మీద పాక్ గెలిస్తే, 8 పాయింట్లతో కివీస్ తో సమానమవుతుంది.
అప్పుడు ఇంగ్లండ్ మీద ఈజీగా కొట్టిందంటే 10 పాయింట్లతో పాక్ ముందుకెళుతుంది. అప్పుడు న్యూజిలాండ్ తర్వాత మ్యాచ్ ల్లో గెలవక తప్పని పరిస్థితులు ఎదురవుతాయి. అదే పాక్ పై గెలిస్తే సెమీస్ దారులు తమకే తెరుచుకుని ఉంటాయి. పాక్ దారులు శాశ్వతంగా మూసుకుపోతాయి.

అయితే పాక్ సెమీస్ చేరాలంటే న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో ఒకటి త్యాగం చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఆ ప్లేస్ లోకి పాక్ వెళుతుంది. మరి ఆ రెండు కూడా హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఎందుకంటే వారిద్దరి మధ్య జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 388 భారీ స్కోరు దగ్గరికి అవలీలగా కివీస్ వచ్చేసింది. అందువల్ల పాకిస్తాన్ ఆశలు నెరవేరడం అంత వీజీ కాదని అంటున్నారు. ఇకపోతే బంగ్లాదేశ్ సెమీస్ నుంచి అధికారికంగా తప్పుకున్నట్టయ్యింది.

Related News

5 Balls Won Match: 5 బంతుల్లో ముగిసిన మ్యాచ్…7 గురు డకౌట్… 23 పరుగులకే ఆలౌట్

Mohamed Siraj : సేమ్ టు సేమ్ డిట్టు దించేశారు… మహమ్మద్ సిరాజ్ కూడా కుళ్ళుకోవాల్సిందే

Travis head – SRH Fan : ఆస్ట్రేలియా గడ్డపై SRH ఫ్యాన్స్ రచ్చ చూడండి.. హెడ్ ను అడ్డంగా పట్టుకొని

IPL 2026 : SRH కోసం మరోసారి రంగంలోకి రజినీకాంత్?

World cup 2027: గిల్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ.. ఇంత దారుణమా?

Yash Dayal: RCB బౌలర్ దయాల్ కు ఎదురుదెబ్బ.. ఐపీఎల్ 2026 నుంచి ఔట్?

Big Stories

×