IND VS AUS, 2ND ODI: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia vs India, 2nd ODI ) మధ్య ఇవాళ ఆడిలైడ్ వేదికగా ( Adelaide Oval, Adelaide ) మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ రెండో వన్డేలో రెండు జట్లు కూడా అద్భుతంగా ప్రదర్శన కనబరిచాయి. కానీ చివరి వరకు పోరాడిన టీమిండియా ఓడిపోగా… మిడిల్ ఆర్డర్ అద్భుతంగా రాణించడంతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. టీమిండియా పై ఏకంగా రెండు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ జంట రెచ్చిపోయింది. బెడ్రూంలో చేయాల్సిన పనులు అడిలైడ్ స్టేడియంలోనే చేసేసింది. తన భర్తకు ఓ లేడీ కిస్ పెట్టి, అడ్డంగా దొరికిపోయింది. ఈ సంఘటన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ వేదికగా ( Adelaide Oval, Adelaide ) జరిగిన వన్డే మ్యాచ్ సందర్భంగా ఓ ముదురు జంట రెచ్చిపోయింది. రోహిత్ శర్మ ( Rohit Sharma ) బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆస్ట్రేలియాకు చెందిన భార్యాభర్తలిద్దరూ పెగ్గు వేస్తూ, స్టేడియంలోనే రొమాన్స్ చేసుకుంటూ కనిపించారు. అంతేకాదు అందరి సమక్షంలోనే తన భర్తకు, ఆ లేడీ లిప్ కిస్ కూడా పెట్టింది. ఆ తర్వాత గ్లాసులో ఉన్న మద్యం తాగి హగ్గు కూడా ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ గా మారాయి. అయితే వీటిని చూసిన క్రికెట్ అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. వీళ్లు ఇద్దరూ నిజంగానే భార్య భర్తలా? లేక లవర్సా ? భర్తకు తెలియకుండా ప్రియుడితో ఈ స్టేడియానికి వచ్చిందా ? అంటూ రకరకాల డౌట్స్ తెరపైకి తీసుకువచ్చి చేస్తూ క్రికెట్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
పెర్త్ అలాగే అడిలైడ్ వేదికగా జరిగిన రెండు వన్డేల్లో టీం ఇండియా దారుణంగా ఓడిపోయింది. ఖచ్చితంగా గెలవాల్సిన ఇవాల్టి మ్యాచ్ లో కూడా గిల్ సేన పెద్దగా రాణించలేదు. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా గడ్డపై వన్డే సిరీస్ కోల్పోవాల్సి వచ్చింది టీమిండియా. 2-0 తేడాతో టీమిండియా దారుణంగా ఓడిపోయింది. దీంతో వన్డే సిరీస్ ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఇక మూడవ వన్డే ఈ నెల 25వ తేదీన సిడ్ని వేదికగా జరగనుంది. ఇందులో ఆయన టీమిండియా గెలిస్తే పరువు దక్కుతుంది. లేకపోతే గిల్ సారాధ్యంలోని టీం ఇండియా పరువు పోవడం గ్యారెంటీ అంటున్నారు. ఇక ఈ వన్డే సిరీస్ పూర్తయిన తర్వాత అక్టోబర్ 29వ తేదీ నుంచి ఈ రెండు జట్ల మధ్య 5 టీ20 ల సిరీస్ ప్రారంభం కానుంది.
?igsh=M2E3d2w4aTRzc3h0
My cameraman's got a better love story than Twilight! 🤣 Caught this sweet moment at the India-Australia ODI. Guess some fans are having extra "joy" in the stands! 😉🍻🏏 .#INDvsAUS #IndianCricket pic.twitter.com/Dfq1tutoqU
— Indresh kumar (@TheIndreshGaur) October 23, 2025