Southwest Airlines: అమెరికాకు చెందిన ప్రముఖ సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ హైదరాబాద్‌లో గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సచివాలయంలో సౌత్‌వెస్ట్ ప్రతినిధి బృందంతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సమావేశం సౌత్ వేస్ట్ ఎయిర్ లైన్స్ ఈ ప్రకటన చేసింది. ఈ సమావేశంలో సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ లారెన్ వుడ్స్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ టామ్ మెరిట్, లీగల్ కౌన్సెల్ హెడ్ జాసన్ షయింగ్, HEX అడ్వైజరీ గ్రూప్ నుండి సార్థక్ బ్రహ్మ పాల్గొన్నారు.
సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి స్వాగతించారు. కంపెనీ వ్యాపార వ్యూహంలో భాగంగా హైదరాబాద్‌లో గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని అభినందించారు. హైదరాబాద్ అభివృద్ధిని హైలైట్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వ సహాయ సహకారాలను వారికి వివరించారు. తెలంగాణ రైజింగ్ 2047 భాగంగా 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థను, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థను సాధించడం లక్ష్యంగా పనిచేస్తున్నామని సీఎం వివరించారు. హైదరాబాద్ అభివృద్ధి, ఐటీ రంగంలో ఉన్న వృద్ధి అవకాశాలను సీఎం తెలిపారు.
Also Read: Indiramma Housing Scheme: ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు.. ఇకపై పట్టణాల్లో కూడా ఆ స్కీమ్