OTT Movie : ఓటీటీలో వెబ్ సిరీస్ లో కొత్త ట్రెండ్ ను సృష్టిస్తున్నాయి. ఇంత వరకు వెబ్ సిరీస్ లు ఎపిసోడ్స్ రూపంలో డైరెక్ట్ స్ట్రీమింగ్ కి వచ్చేవి. అయితే ఇది వరకే రిలీజ్ అయిన ఒక తెలుగు వెబ్ సిరీస్ ను సినిమాగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు బాహుబలి లాంటి సినిమాని ఒకే పార్ట్ గా థియేటర్లలోకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే పద్దతిలో ఒక తెలుగు బో*ల్డ్ సిరీస్, ఒకే సినిమాగా వచ్చింది. అది కూడా ఈ రోజు నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ కథ ముగ్గరు అమ్మాయిల చుట్టూ తిరుగుతుంది. అయితే ఇది పెద్దలు చూడాల్సిన సినిమా. కొన్ని సీన్స్ ఫ్యామిలీతో కలసి చూసే విధంగా ఉండవు. ఈ సిరీస్ పేరు ఏమిటి ? సినిమాగా ఏ ఓటీటీలోకి వచ్చింది ? అనే వివరాల్లోకి వెళ్తే …
ఈ వెబ్ సిరీస్ పేరు ‘3 రోజెస్’ (3 Roses). 2021లో వచ్చిన సీజన్ 1, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో ఫేమ్ తెచ్చుకుంది. మ్యాగ్గీ దర్శకత్వంలో ఈశా రెబ్బా, పాయల్ రాజ్‌పుట్, పూర్ణ ఇందులో నటించారు. ఇది 4 ఎపిసోడ్ లతో 2021 నవంబర్ 12న Aha ఓటీటీలో విడుదల అయింది. ఐయండిబిలో దీనికి 5.1/10 రేటింగ్ ఉంది. ఇప్పుడు ఈ సిరీస్, Aha ఓటీటీలో అక్టోబర్ 23 నుంచి సినిమాగా రిలీజ్ అయింది. ‘3 రోజెస్’ సీజన్ 2 కూడా తొందర్లోనే వచ్చేందుకు సిద్దంగా ఉంది.
Read Also : ఏం సీన్లు గురూ… చలికాలంలోనూ చెమటలు పట్టించే స్టోరీ… పెద్దలకు మాత్రమే మావా
కథలోకి వెళ్తే
రితు, జాన్వి, ఇందు అనే ముగ్గురు స్నేహితులతో ఈ కథ మొదలవుతుంది. వీళ్లు 20 ఏళ్ల వయస్సులో హైదరాబాద్‌లో జీవితాలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. రితు (ఈశా రెబ్బా) ఒక స్పిరిటెడ్ అమ్మాయి. జాన్వి (పాయల్ రాజ్‌పుట్) కెరీర్‌పై ఫోకస్ చేస్తుంది. ఇందు (పూర్ణ) ఒక ఫ్యామిలీ అమ్మాయిగా ఉంటుంది. సరదాగా జీవితం గడుపుతున్న సమయంలో, వాళ్ల కుటుంబాలు పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తాయి. అయితే వీళ్ళు స్వతంత్ర జీవితం ఇష్టపడతారు. పెళ్లి ఏర్పాట్లను ఆపడానికి ప్రయత్నిస్తారు. దీనికోసం రితు, జాన్వి, ఇందు ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు. చివరికి వీళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్ ని ఎంచు కుంటారు ? అసలు వీళ్ళకి పెళ్ళి అవుతుందా ? ఫ్యామిలీ తో ఎలాంటి ఇబ్బందుల్ని ఫేస్ చేస్తారు ? అనే విషయాలను, ఈ సినిమాని చూసి తెలుసుకోండి.