Suryakumar Yadav: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ( Asia Cup 2025) నేపథ్యంలో టీమిండియా వన్డే కెప్టెన్ శుభమన్ గిల్ పై ( Shubman Gill ) టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ( Suryakumar Yadav ) కుట్రలు పన్నినట్లు తాజాగా ఓ నివేదిక బయటపడింది. టీమిండియా నుంచి తొలగించేందుకు సూర్య కుమార్ యాదవ్ అన్ని రకాల ప్రయత్నాలు చేశాడట. టీమిండియా టి20 జట్టులోకి గిల్ వస్తే, తన కెప్టెన్సీ పోతుందని ఆత్మరక్షణలో పడ్డారట సూర్య కుమార్ యాదవ్. అందుకే ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సమయంలో టీం ఇండియాను సెలెక్ట్ చేసేటప్పుడు గిల్ ను ఎంపిక చేయకూడదని, సెలెక్టర్ల ముందు సూర్య కుమార్ యాదవ్ వింత వాదన తీసుకువచ్చారట.
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సమయంలో టీమిండియా సెలక్షన్ జరిగిన సంగతి తెలిసిందే. అజిత్ అగార్కర్ సమక్షంలోని సెలక్షన్ కమిటీ జట్టును ఫైనల్ చేసింది. టి20 ఫార్మాట్ లో ఈ ఆసియా కప్ 2025 టోర్నమెంట్ జరిగిన నేపథ్యంలో సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరించాడు. దీంతో ఏ ప్లేయర్ ను సెలెక్ట్ చేయాలన్న దానిపైన సూర్య కుమార్ యాదవ్ సూచనలు తీసుకుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఈ సందర్భంగా ఓ షాకింగ్ నిజం బయటపడిందట. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ కోసం వెళ్లే టీమ్ ఇండియా జట్టులో గిల్ ఉండకూడదని కండిషన్ పెట్టాడట సూర్య కుమార్ యాదవ్. అతడు వన్డే అలాగే టెస్టుల్లో బాగా రాణిస్తాడు.. టి20 లకు పనికిరాడు.. అతని ప్లేస్ లో శ్రేయాస్ అయ్యర్, కే ఎల్ రాహుల్ లేదా యశస్వి జైష్వాల్ లాంటి ప్లేయర్లను సెలెక్ట్ చేస్తే బాగుంటుందని సూచనలు చేశారట.
గిల్ ను జట్టులోకి తీసుకుంటే అస్సలు బాగోదని, అది వర్కౌట్ కాని పని అని తేల్చి చెప్పారట. అయితే ఈ విషయంలో గౌతమ్ గంభీర్ చాలా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఖచ్చితంగా టీమిండియా జట్టులో గిల్ ఉండాల్సిందేనని గౌతమ్ గంభీర్ తేల్చి చెప్పారట. అంతేకాదు అతనికి వైస్ కెప్టెన్సీ కూడా ఇచ్చేలా గౌతమ్ గంభీర్ చక్రం తిప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో సూర్య కుమార్ యాదవ్ ప్రతిపాదనలు పక్కకు పెట్టిన భారత క్రికెట్ నియంత్రణ మండలి, గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్ సూచనలను మాత్రమే పరిగణలోకి తీసుకుందట. కాగా ఈ ఆసియా కప్ 2025 టోర్నమెంటులో గిల్ అత్యంత దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే.
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో టీమిండియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్స్ లో ఇండియా వర్సెస్ పాక్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది టీమిండియా.
Also Read: Team India -Divorce: విడాకులు తీసుకున్న మరో టీమిండియా ప్లేయర్…భార్య లేకుండానే దీపావళి వేడుకలు
🚨 Surya Wanted Gill Out of Asia Cup
T20I captain Suryakumar Yadav wanted Shubman Gill out of the Asia Cup squad but he was included as he’s Gautam Gambhir’s favourite and Gambhir pushed his selection.
Sad to see the coach pushing undeserving players based on his bias. pic.twitter.com/BiPyjiEMzn
— ADITYA (@Wxtreme10) October 21, 2025