BigTV English

David Warner : నవ్వుతూ బతకాలిరా ! తమ్ముడూ.. చివరి టెస్టులో డేవిడ్ వార్నర్ మాట..

David Warner : నవ్వుతూ బతకాలిరా ! తమ్ముడూ.. చివరి టెస్టులో డేవిడ్ వార్నర్ మాట..

David Warner : అందరూ ఎల్లవేళలా నవ్వుతూ ఉండాలని భావిస్తాను. అందుకనే ఎప్పుడూ నా చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆహ్లాదంగా ఉంచేలా ప్రయత్నించేవాడిని, అందుకోసమే నవ్వేవాడిని, నవ్వించేవాడిని..


ఈ మాటలు అన్నది మరెవరో కాదు. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్. పాకిస్తాన్ తో జరిగిన చివరి మూడో టెస్ట్ మ్యాచ్ లో (57) ఆఫ్ సెంచరీ చేసి, జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అలా కెరీర్ కి  ఘనంగా వీడ్కోలు పలికాడు. టెస్టు కెరీర్‌లో చివరి సారి బ్యాటింగ్‌కు క్రీజులో వెళుతున్నప్పుడు స్టేడియంకి వచ్చినవారందరూ లేచి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. పాకిస్థాన్ ప్లేయర్లు సైతం.. గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు.

ఈ సందర్భంగా వార్నర్ మాట్లాడుతూ ఏడాదిన్నర నుంచి ఆస్ట్రేలియా క్రికెట్ కు మంచి జరుగుతోంది. వన్డే వరల్డ్ కప్, ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్, పాక్ తో టెస్ట్ సిరీస్ అన్నింటా విజయం దక్కింది. అలాగే యాషెస్ సిరీస్ డ్రా చేశాం ..ఇలా ప్రతీ చోటా నేను భాగస్వామినయ్యానని తెలిపాడు.


ఇలాంటి గొప్ప జట్టుతో, గొప్ప క్రికెటర్లతో ప్రయాణం సాగించడం చాలా ఆనందంగా ఉందని అన్నాడు. దశాబ్దానికి పైగా క్రికెట్ ఆడాను. ఇప్పటివరకు నా వెన్నంటి నిలిచిన.. అభిమానులకు ఎంత చెప్పినా తక్కువేనని అన్నాడు. ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని తెలిపాడు. ఇదే నా అభిమతమని అన్నాడు. 

ఇదే పాలసీని ఇన్నాళ్లూ పాటించానని, ఇదే నా విజయ రహస్యమని నవ్వుతూ తెలిపాడు. తన భార్య కాండిస్ కి థ్యాంక్స్ చెప్పాడు. ఇన్నాళ్లూ తను దగ్గర లేకపోయినా, క్రికెట్ షెడ్యూల్ తో బిజిబిజీగా గడిపినా పిల్లలను కంటికి రెప్పలా చూసుకుందని తెలిపాడు.

మ్యాచ్ అనంతరం డేవిడ్ వార్నర్ కు ఘనంగా వీడ్కోలు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వార్నర్ భావోద్వేగానికి గురయ్యాడు. కుటుంబంతో కలిసి కాసేపు మైదానంలో గడిపాడు. పాకిస్థాన్ ఆటగాళ్లు సంతకం చేసిన జెర్సీని పాక్ జట్టు కెప్టెన్ షాన్ మసూద్.. డేవిడ్ వార్నర్‌కు బహుమతిగా ఇచ్చాడు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×