BigTV English

England Coach McCullum: ఆటలో ఓడారు.. స్ట్రాటజీలో గెలిచారు..’ ఇంగ్లాండ్ కోచ్ వ్యాఖ్యలు

England Coach McCullum: ఆటలో ఓడారు.. స్ట్రాటజీలో గెలిచారు..’ ఇంగ్లాండ్ కోచ్ వ్యాఖ్యలు

England Coach McCullum: ఓటమిపాలయినా కూడా టీమ్‌ను ప్రోత్సహించే మనసు.. సీనియర్ ఆటగాళ్లకు, కోచ్‌కు ఉండాలి. తర్వాత మ్యాచ్ గెలుస్తామనే నమ్మకం కలిగించాలి. అలా అని ఓటమి గురించి బాధపడకూడదు అని చెప్పకూడదు. అదే కసితో తర్వాత ఆటల్లో సత్తా చాటాలని చెప్పాలి. కానీ ఇంగ్లాండ్ కోచ్ మాత్రం దీనికి కాస్త భిన్నంగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్ మ్యాచ్‌లో తన టీమ్ ఓడిపోయినందుకు కోచ్ రియాక్షన్ అందరినీ ఆశ్చర్యపరిచింది.


ఎడ్గ్‌బాస్టన్‌లో జరిగిన ఓపెనింగ్ టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఇంగ్లాండ్ రెండు వికెట్ల తేడాతో ఓడిపోయింది. 2015 నుండి యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియాకు, ఇంగ్లాండ్‌కు మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈసారైనా మొదటి సిరీస్‌లో ఆస్ట్రేలియాపై పైచేయి సాధించాలని ఇంగ్లాండ్ అనుకున్నా కూడా అది జరగలేదు. ఇంగ్లాండ్ ఓడిపోయినా కూడా తన టీమ్ పర్ఫార్మెన్స్ తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని, వారి స్ట్రాటజీలు బాగున్నాయని, ఓటమి వల్ల ఏమీ నిరాశపడడం లేదని కోచ్ మెక్ కల్లమ్ తెలిపాడు.

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా దాదాపుగా ఓడిపోతుంది అని ప్రేక్షకులు అనుకున్నారు. కెప్టెన్ ప్యాట్ కుమ్మిన్స్, నాథన్ లయాన్ కలిసి 9వ వికెట్ దగ్గర 55 రన్నుల పార్ట్‌నర్‌షిప్ చేసి టీమ్‌ను విజయం వైపు నడిపించారు. రిజల్ట్ గురించి పక్కన పెడితే.. తనకు మ్యాచ్ చాలా సంతోషాన్ని ఇచ్చిందంటూ ఇంగ్లాండ్ కోచ్ మెక్ కల్లమ్ అన్నాడు. ఇది టెస్ట్ మ్యాచ్‌లాగా అనిపించలేదని, బాక్సింగ్ సంగ్రామం లాగా అనిపించిందని, ఎవరి స్ట్రాటజీలు వారు బాగా ఉపయోగించారని తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు.


క్రికెట్ ఆడే విషయంలో ఎవరి స్టైల్ వారికి ఉంటుందని, ఇంగ్లాండ్ టీమ్ స్టైల్ వేరు, ఆస్ట్రేలియా టీమ్ స్టైల్ వేరని మెక్ కల్లమ్ తెలిపారు. ఈ మ్యాచ్‌లో ఉపయోగించిన స్ట్రాటజీనే సిరీస్ మొత్తం ఉపయోగించి కచ్చితంగా తమ టీమ్ గెలుపు సాధిస్తుందని అన్నాడు. ఓటమిపాలయినా కూడా మెక్ కెల్లెన్ కాన్ఫిడెన్స్‌కు ఇంగ్లాండ్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మరికొందరు మాత్రం ఓటమి రుచి చూసిన తర్వాత కూడా ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికి రాదని విమర్శిస్తున్నారు.

Related News

Murli vijay : ఆస్ట్రేలియా క్రికెటర్ కూతురితో విజయ్ సీక్రెట్ రిలేషన్.. సముద్రాలు దాటి!

Rinku Singh: పాపం రింకూ… తన బ్యాట్ కు రాఖీ కట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడుగా

Babar Azam : 712 రోజులు అయింది.. కానీ మాత్రం ఒక్క సెంచరీ చేయలేకపోయాడు… అత్యంత ప్రమాదంలో బాబర్

Virender Sehwag: డైపర్ వేసుకొని సచిన్ సెంచరీ కొట్టాడు.. సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్

Watch Video : ఇదెక్కడి క్రికెట్ రా.. ఇలా ఆడితే అస్సలు రన్ అవుట్ కాబోరు

Sanju Samson : సంజూ అరాచకం.. వరుసగా 6,6,6,6,6,6

Big Stories

×