England vs South Africa : సాధారణంగా క్రికెట్ లో రకరకాల సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఎప్పుడూ ఏ బ్యాట్స్ మెన్ ఫామ్ లోకి వచ్చి రెచ్చిపోతాడో తెలియదు. ఎప్పుడు ఏ బ్యాటర్ ఫామ్ కోల్పోతాడో కూడా ఊహించడం కష్టమే. అలాగే బౌలింగ్ విషయం కూడా అంతే. అయితే తాజాగా ఇంగ్లాండ్ బ్యాటర్లు రెచ్చిపోయారు. సౌతాఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో టీ-20లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 304 2 పరుగులు చేసింది. తొలిసారిగా ఇంగ్లాండ్ జట్టు 300 పైగా స్కోర్ సాధించి టీ-20ల్లో రికార్డు సృష్టించింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో సాల్ట్ 141, బట్లర్ 83, బ్రూక్ 41 పరుగులతో విధ్వంసం సృష్టించారు. సౌతాఫ్రికా బౌలర్లలో జాన్సెన్ 60, రబాడా 70, విలియమ్స్ 62 , ఫోర్టుయిన్ 52, మఫాకా 41 పరుగులు సమర్పించుకున్నారు.
Also Read : Surya kumar yadav : అదృష్టం అంటే సూర్యదే… నలుగురు కెప్టెన్స్ అతను చెబితే ఫాలో కావాల్సిందే
మరోవైపు ఫుల్ మెంబర్ టీమ్ టీ-20ల్లో ఇదే హయ్యస్ట్ స్కోర్. అంతకు ముందు ఈ రికార్డు టీమిండియా పేరిట ఉండేది. 297/6.. 2024లో బంగ్లాదేశ్ పై టీమిండియా సాధించింది. తాజాగా టీ-20 హిస్టరీని క్రియేట్ చేసింది ఇంగ్లాండ్ జట్టు. వాస్తవానికి వన్డేల్లో 304 మెరుగైన స్కోర్. కానీ ఇంగ్లాండ్ జట్టు టీ-20 మ్యాచ్ ల్లో సౌతాఫ్రికా లాంటి పెద్ద జట్టుపై ఈ స్కోర్ చేసి ఔరా అనిపించింది. సాల్ట్, బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఆ జట్టు 304 పరుగులు చేసింది. ముఖ్యంగా సాల్ట్, బట్లర్ తొలి వికెట్ కి 47 బంతుల్లో 126 పరుగులు జోడించారు. ఇక ఆ తరువాత సాల్ట్.. బెతెల్(26), బ్రూక్(41) అండతో జట్టు స్కోరును 300 దాటించాడు. 39 బంతుల్లోనే సెంచరీ చేశాడు సాల్ట్. టీ-20 ల్లో ఇది మూడో అత్యధిక స్కోర్. గత ఏడాది జింబాబ్వే గాంబియా పై 344/ 4 తో ప్రపంచ రికార్డును నెలకొల్పింది. నేపాల్ మంగోలియా పై రెండో స్థానంలో ఉంది. టెస్ట్ దేశాలు సాధించిన అత్యధిక టీ-20 స్కోర్ మాత్రం ఇదే కావడం విశేషం.
158 పరుగులకే కుప్పకూలిన సౌతాఫ్రికా
గతంలో బంగ్లాదేశ్ పై టీమిండియా 297 పరుగులు చేయగా.. ఆ రికార్డును ఇంగ్లాండ్ తాజాగా బ్రేక్ చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత ఇంగ్లాండ్ 304 పరుగులు చేయగా.. 305 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా 158 పరుగులకే కుప్పకూలింది. అంటే 146 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్ విజయం చేసింది. అంతర్జాతీయ టీ-20ల్లో భారీ మార్జిన్ తో గెలిచిన జట్టుగా ఇంగ్లాండ్ రికార్డు సృష్టించింది. ఫోర్టుయిన్ 32,రబాడ 09, మాఫాక డకౌట్ అయ్యాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో అర్చర్ 3, సామ్ కర్రన్ 2, లియామ్ డాసన్ 2, అదిల్ రషీద్ 1, విల్ జాక్స్ 2 వికెట్లు తీశారు. అత్యధికంగా అదిల్ రషీద్ 4 ఓవర్లు వేసి 48 పరుగులు సమర్పించుకున్నాడు.ఇక సౌతాఫ్రికా బౌలర్లలో జాన్సెన్ 60, రబాడా 70, విలియమ్స్ 62 , ఫోర్టుయిన్ 52, మఫాకా 41 పరుగులు సమర్పించుకున్నారు. వన్డేల్లో మాత్రం ఇంగ్లాండ్ జట్టు సిరీస్ కోల్పోయింది.