Surya kumar yadav : ఆసియా కప్ 2025 మ్యాచ్ లు ప్రస్తుతం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే టీమిండియా కి కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే..? సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్, శుబ్ మన్ గిల్, అక్షర్ పటేల్ ఆడుతున్న విషయం తెలిసిందే.అయితే ఐపీఎల్ లో మాత్రం హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో సూర్యకుమార్ యాదవ్ ఆడుతున్నాడు. అలాగే ముంబై ఇండియన్స్ కి హార్దిక్ పాండ్యా కెప్టెన్, రాజస్థాన్ రాయల్స్ కి సంజు శాంసన్ కెప్టెన్, గుజరాత్ టైటాన్స్ కి శుబ్ మన్ గిల్, ఢిల్లీ క్యాపిటల్స్ కి అక్షర్ పటేల్ కెప్టెన్లు గా వ్యవహరిస్తున్నారు. అయితే అదృష్టం అంటే సూర్యకుమార్ యాదవ్ దే అని చెప్పాలి.
Also Read : Pak vs Oman : బ్యాటింగ్ లో కాస్త తడబడ్డ ఒమన్.. ఆసియా కప్ లో పాక్ తొలి విజయం
ఈ నలుగురు కెప్టెన్లు కూడా సూర్యకుమార్ యాదవ్ చెప్పినట్టు వినాలి. ఎందుకంటే టీమిండియా టీ-20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కాబట్టి.. అందుకే సూర్యకుమార్ యాదవ్ కి మంచి క్రేజ్ వచ్చేసింది. ముంబై ఇండియన్స్ తరపున ఆడినప్పటి నుంచి సూర్యకి క్రేజ్ మామూలుగా లేదు. సూర్య ఆధ్వర్యంలో ఆసియా కప్ 2025లో అందరూ అండర్ స్కై ఆడుతున్నారు. ఆసియా కప్ లో భారత్ తొలి మ్యాచ్ లో యూఏఈని చిత్తు చేసిన విషయం తెలిసిందే. కేవలం 4.3 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ 13.1 ఓవర్లలో ఆలౌట్ అయింది. కేవలం ఇద్దరూ బ్యాటర్లు షరూఫ్ (22), వసీం(19) మినహా మిగతా బ్యాటర్లెవ్వరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు.
అయితే యూఏఈ బ్యాటర్ జునైద్ సిద్ధిఖీ అనే బ్యాటర్ రనౌట్ అయినప్పటికీ.. సూర్యకుమార్ దానిని వెనక్కి తీసుకున్నాడు. అది పొరపాటున జరిగిందంటూ అలా చేయడంతో.. కొందరూ మాజీ క్రికెటర్లు పాకిస్తాన్ మ్యాచ్ తో కూడా ఇలా చేస్తారా..? ప్రశ్నించారు. మరికొందరూ మాత్రం సూర్యను అభినందిస్తున్నారు. ఐపీఎల్ లో ఏ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించకుండా నేరుగా టీమిండియా టీ-20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరించడం హర్షించదగ్గ విషయం అనే చెప్పాలి. వాస్తవానికి సూర్యకుమార్ కెప్టెన్సీ లో ఇప్పటివరకు టీమిండియా 23 టీ-20 మ్యాచ్ లు ఆడితే కేవలం 4 మ్యాచ్ ల్లో మాత్రమే ఓటమి పాలైంది. మిగతా అన్ని మ్యాచ్ ల్లో టీమిండియా విజయం సాధించడం విశేషం. మరోవైపు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో తొలి సారి పాకిస్తాన్ తలపడనుంది టీమిండియా. ఈ మ్యాచ్ పై ఉత్కంఠ నెలకొంది. ఇరు జట్లుబలంగానే కనిపిస్తున్నాయి. మరోవైపు ఆసియా కప్ లో పాకిస్తాన్ తో జరిగే హై ఓల్టేజ్ మ్యాచ్ లో దూకుడు లేకుండా ఆటడటం కష్టం అని టీమిండియా టీ-20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ముఖ్యంగా మనం గెలవాలంటే దూకుడు కచ్చితంగా ఉండాల్సిందే.. లేదంటే కష్టం అని ఇటీవల వెల్లడించారు సూర్య.