OTT Movie : ఇస్లామిక్ మిథాలజీలోని దయ్యాల పాసెషన్, బ్లాక్ మ్యాజిక్ థీమ్‌లతో ఒక హారర్ సినిమా ప్రేక్షకుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఇది రియల్ ఈవెంట్స్ నుండి ప్రేరణ పొందిందని చెబుతారు. ఇది తుర్కిష్ హారర్‌లలో బెస్ట్ సినిమాలలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా రిలిజియస్ హారర్‌తో ప్రేక్షకులను థియేటర్లలో నుంచి బయటికి పరుగులు పెట్టిస్తోంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
కూబ్రా ఒక సాధారణ అమ్మాయి, కానీ ఆమె శరీరంలో జిన్ (దయ్యం) ప్రవేశించి పాసెషన్ చేస్తుంది. వివాహం సమయంలో, ఆమె తన ఫియాన్సేను కత్తితో పొడిచి చంపేస్తుంది. అంతా కుటుంబం ముందే జరుగుతుంది. ఈ దారుణ సంఘటన తర్వాత, కూబ్రా అరెస్ట్ అవుతుంది. ఆమెకు మానసిక సమస్యలు ఉన్నట్లు భావిస్తారు. కానీ ఆమె స్నేహితురాలు ఎబ్రు అనే సైకియాట్రిస్ట్, ఇది మానసిక సమస్య కాదు, జిన్ పాసెషన్ అని అనుమానిస్తుంది. ఎబ్రు, ఆమె ప్రేమికుడు ఫారుక్ , ఒక ఎక్సార్సిస్ట్ కూబ్రాకి నయం చేయడానికిప్రయత్నిస్తారు. వీళ్ళు కూబ్రా ఇంటికి వెళ్లి, ఆమె బెడ్‌రూమ్‌లో ఎక్సార్సిజం చేస్తారు. జిన్ ఆమె శరీరాన్ని ఉపయోగించి భయంకరమైన మలుపులు తిరుగుతుంది. వింత సౌండ్స్‌లు వస్తాయి. ఎక్సార్సిజం సమయంలో ఇంటి ప్రత్యేక టాయిలెట్ కింద బ్లాక్ మ్యాజిక్ టూల్స్ దాచి ఉన్నాయని తెలుస్తుంది. ఫారుక్, ఎబ్రు ఆ టూల్స్‌ను కనుగొంటారు.
ఇక కథలో మరిన్ని ట్విస్ట్‌లు వస్తాయి. కూబ్రా పాసెషన్ ఆమె కుటుంబంలో బ్లాక్ మ్యాజిక్ రిట్యువల్స్ వల్ల వచ్చిందని తెలుస్తుంది. జిన్ ఆమె ద్వారా ఇతరులను కూడా ప్రభావితం చేస్తుంది. ఫారుక్ మరో ఎక్సార్సిజం చేస్తాడు. కానీ జిన్ ఆమె శరీరాన్ని వదలకపోగా, ఈ దెయ్యం హారర్ మరింత పెరుగుతుంది. క్లైమాక్స్‌లో కూబ్రాను కాపాడటానికి ఎబ్రు, ఫారుక్ పూర్తి ఎక్సార్సిజం చేస్తారు. చివరికి కూబ్రాను విడిచి దెయ్యం వెళ్లిపోతుందా ? ఈ ఎక్సార్సిజం వల్ల మరిన్ని సమస్యలు వస్తాయా ? ఈ బ్లాక్ మ్యాజిక్ చేసింది ఎవరు ? అనే ప్రశ్నలకు సమాధానాలను ఈ సినిమాని చూసి తెలుసుకోండి.
డబ్బే: ది పాసెషన్” 2013లో విడుదలైన తుర్కిష్ ఫౌండ్ ఫుటేజ హారర్ సినిమా. దీనిని హసన్ కరాకాదాగ్ డైరెక్ట్ చేశారు. ఇది డబ్బే సిరీస్‌లో నాల్గవ చిత్రం. ఇందులో ఎల్చిన్ అతమ్‌గూచ్ (కుబ్రా), ఓర్‌హాన్ గెంసర్ (హోజా), సుల్తాన్ కోరోగ్లు కిలిచ్ (ఎబ్రు), ఓగుజ్‌హాన్ కోచాక్లి (కుబ్రా ఫయాన్సే)నటించారు. 2 గంటల 13 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమా, IMDbలో 6.8/10 రేటింగ్ పొందింది. ఇది 2013 ఆగస్ట్ 1న తుర్కీలో విడుదలై, నెట్‌ఫ్లిక్స్‌లో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also : మర్డర్ కేసులో ఇరుక్కునే మెంటలోడు… ఆ తల్లి చేసే అడ్వెంచర్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే మావా