అంగారక గ్రహం మీద ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నట్లు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. నాసా క్యూరియాసిటీ రోవర్ తాజాగా మరిన్ని కొత్త విషయాలను కనిపెట్టింది. తాజాగా పంపిన ఫోటోల్లో డైనోసార్ ఎగ్స్ కనిపించాయి. పురాతన గూళ్ళను పోలి ఉండే రాతి నిర్మాణాలతో నిండిన ప్రదేశంలో వీటిని గుర్తించింది. గెడిజ్ వల్లిస్ రిడ్జ్ లోని మౌంట్ షార్ప్ వాలులలో ఉన్న బాక్స్ వర్క్స్ అని పిలువబడే ప్రాంతాన్ని రోవర్ ప్రస్తుతం అధ్యయనం చేస్తోంది. క్యూరియాసిటీ ఇంతకు ముందు పంపిన ఫోటోలతో పోల్చితే భిన్నంగా ఈ సైట్ లో విరిగిన, సిరలతో నిండిన రాళ్లు కనిపించాయి. ఈ రాళ్ళు అంగారక గ్రహం మీద వందల మిలియన్ల సంవత్సరాల క్రితం నీటి ప్రవాహాన్ని కలిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
నీటితో ఉన్న గ్రహం పొడిగా ఎలా మారింది?
అంగారక గ్రహం అత్యంత తీవ్రమైన పర్యావరణ మార్పులకు ఈ రాళ్లు ఉదాహారణగా నిలుస్తున్నాయని పరిశోధకులు భావిస్తున్నారు. గ్రహం మీద ఉన్న పొరలు, వాతావరణ ప్రభావాలను పరిశీలిస్తూ, ఒకప్పుడు నీటితో నిండి ఉన్న అంగారక గ్రహం పొడిగా ఎలా మారింది? అనే విషయాన్ని పరిశోధిస్తున్నారు. తాజాగా ఫోటోల్లో కొన్ని గుబురుగా, సమూహంగా ఆకారంలో ఉన్న శిలలు కనిపించాయి. ఇవి సంవత్సరాలుగా పేరుకుపోయిన ఖనిజాలను సూచిస్తున్నట్లు వెల్లడించారు.
శాస్త్రవేత్తలు ఈ నిర్మాణాలను ఎలా పరిశీలిస్తున్నారు?
క్యూరియాసిటీ పనోరమాల కోసం మాస్ట్ క్యామ్, రసాయనాలను పరిశోధించడానికి కెమ్ క్యామ్ ను ఉపయోగిస్తున్నారు. అక్కడ కనిపించే బాక్సీ అల్లికలు హైడ్రోథర్మల్ కార్యకలాపాలతో ముడిపడి ఉన్న భూమిపై నిర్మాణాలను పోలి ఉన్నాయి. ఇటువంటి నిర్మాణాల ఉష్ణోగ్రత, Ph, ద్రవ చరిత్ర గురించి వివరాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. అసమాన రాళ్ళు, నిటారుగా ఉన్న వాలు కారణంగా గుట్టపైకి ఎక్కేందుకు రోవర్ ఇబ్బంది పడుతున్నట్లు నాసా గుర్తించింది. ఈ ప్రాంతంలో డ్రిల్లింగ్ అసాధ్యం. కానీ. క్యూరియాసిటీ బృందం ఉపరితలంపై ఉన్న రాళ్లను అధ్యయనం చేయడానికి ఇమేజింగ్ సాధనాలు, MAHLI , APXS లాంటి కాంటాక్ట్ పరికరాలను ఉపయోగిస్తోంది.
Read Also: గోల్డెన్ నర్స్ షార్క్.. ఫస్ట్ టైమ్ కనిపించింది బ్రో!
క్యూరియాసిటీ మిషన్ నెక్ట్స్ ఏం చేయబోతోంది?
రోవర్ ప్రస్తుతం శిఖరంపై ఉంది. అక్కడి రాళ్లను, పగుళ్లను మ్యాపింగ్ చేస్తుంది. విశ్లేషిస్తుంది. ఆ తర్వాత ఇది ఇది కుకెనాన్ వైపు కదులుతుంది. ఇది మరిన్ని పొరల అవుట్ క్రాప్ లను కలిగి ఉంటుంది. ప్రతి అడుగు పైకి వెళ్తుంటే, పురాతన అంగారక గ్రహం ఎలా ఉద్భవించిందో శాస్త్రవేత్తలు గుర్తించే అవకాశం ఉంటుంది. ఈ ఆవిష్కరణలు గతంలో అంగారక గ్రహం మీద ఉన్న జీవ సంచారం గురించి పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ రాళ్లు ఒకప్పుడు ద్రవాలుగా ఉన్నాయా? అనే ప్రశ్నలను రేకెత్తిస్తుంది. వీటికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు రావాలంటే ఈ రాళ్లపై పూర్తి స్థాయిలో పరిశోధనలు కొనసాగాల్సిన అవసరం లుంది. క్యూరియాసిటీ వాటిని వెలికితీసే ప్రయత్నం చేస్తోంది.
Read Also: అయోధ్య-కాశీ పుణ్యక్షేత్ర యాత్ర.. IRCTC అదిరిపోయే ప్యాకేజీ!