Big Stories

IPL: ఐపీఎల్‌ ప్రసారాలు ఫ్రీ ఫ్రీ ఫ్రీ.. పండగ చేస్కోండి..

IPL: ఐపీఎల్‌ను మించిన ఎంజాయ్‌మెంట్ మరెందులోనూ ఉండదు కొందరికి. పనంతా వదిలేసి మరీ మ్యాచ్‌లు చూస్తుంటారు. ఆఫీస్‌లో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా.. బాల్ టు బాల్ అప్‌డేట్ అవుతుంటారు. ఇక ఐపీఎల్ చూడాలంటే ఎంతోకొంత ఖర్చు చేయాల్సిందే. టీవీ ఛానెల్స్‌లో అయితే డబ్బులు కట్టాల్సిందే. హాట్‌స్టార్‌కూ ఎంతోకొంత చెల్లించాల్సిందే. అయినా, ఐపీఎల్ క్రేజ్ కానీ, డిమాండ్ గానీ మామూలుగా ఉండదు. అలాంటిది.. ఇకపై ఐపీఎల్ ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ.. అని తెలిస్తే! మనోళ్లకి పండగే పండగ.

- Advertisement -

అవును, ఇకపై ఐపీఎల్‌ను ఫ్రీగా చూడొచ్చు. ఇంకా అధికారికి ప్రకటన రాకున్నా.. దాదాపు కన్ఫామ్డ్ న్యూస్ ఇది. IPL 2023 డిజిటల్‌ ప్రసార హక్కులను 2.7 బిలియన్‌ డాలర్లకు సొంతం చేసుకుంది రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన వయాకామ్‌ 18 మీడియా. అసలే రిలయన్స్ సంస్థ. దాని మార్కెటింగ్ స్ట్రాటజీలు మామూలుగా ఉంటాయా? అందుకే, ఐపీఎల్‌ను జియో సినిమా(Jio Cinema) యాప్‌ ద్వారా వీక్షకులకు ఉచితంగా ఐపీఎల్‌ మ్యాచ్‌లను వీక్షించే అవకాశం కల్పించబోతోందని తెలుస్తోంది.

- Advertisement -

తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌, మరాఠీ, గుజరాతీ, బెంగాళీ తదితర మొత్తం 12 భారతీయ భాషల్లో కామెంటరీ ఉంటుందట. మ్యాచ్‌, ఆటగాళ్ల గణాంకాలతో పాటు హీట్‌ మ్యాప్‌, పిచ్‌పై విశ్లేషణ వంటి వివరాలను సైతం మ్యాచ్‌ మధ్యలో తెరపై మనం ఎంచుకున్న భాషలో కనిపిస్తాయని చెబుతున్నారు. ఐపీఎల్ మ్యాచ్‌లు అన్నింటినీ 4K రెజల్యూషన్‌ (అల్ట్రాహెచ్‌డీ) లో ప్రసారం చేయనున్నట్టు సమాచారం. మల్టీక్యామ్‌ టెక్నాలజీతో వివిధ కోణాల్లో మ్యాచ్‌ను వీక్షించే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు.

వీక్షకుల చందాలతో కాకుండా.. వాణిజ్య ప్రకటనల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా వయాకామ్‌ 18.. ఐపీఎల్ మ్యాచ్‌లను ఉచితంగా ప్రసారం చేయాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు. దాదాపు 50 కోట్ల మంది ఐపీఎల్‌ను వీక్షించే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ఆ మేరకు కమర్షియల్ యాడ్స్ రూపంలో భారీ మొత్తాన్ని ఆర్జించవచ్చనేది రిలయన్స్ ఐడియా. మరోవైపు 5జీ నెట్‌వర్క్ డిమాండ్ కూడా పెరుగుతుందని.. ఆ మేరకు కూడా జియో లాభపడొచ్చని అంటున్నారు. ప్రస్తుతానికైతే ఇదంతా అనధికారిక సమాచారం మాత్రమే. త్వరలోనే అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వస్తుందని అంటున్నారు. ఇంకేం.. జియో కస్టమర్స్‌కు జిల్ జిల్ జిగా.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News