Cricketers Jersey:భారత క్రికెటర్ల జెర్సీపై త్వరలో కొత్త బ్రాండ్ కనిపించబోతోంది. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ నుంచే జెర్సీ బ్రాండ్ మారవచ్చనే ప్రచారం జరుగుతోంది. గతంలో, నాలుగేళ్ల కాలానికి రూ.370 కోట్ల భారీ మొత్తానికి బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకున్న మొబైల్ స్పోర్ట్స్ లీగ్-ఎంపీఎల్… టీమిండియా జెర్సీ స్పాన్సర్‌గా వ్యవహరించింది. అయితే… తమ హక్కులను మరో సంస్థకు బదలాయించుకునేందుకు అనుమతి ఇవ్వాలని గత డిసెంబర్లో బీసీసీఐని కోరింది. దాంతో… ఈ మార్చి వరకు టీమిండియా జెర్సీ స్పాన్సర్‌గా వ్యవహించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది… కేవల్ కిరణ్ క్లాతింగ్ లిమిటెడ్-కేకేసీఎల్. తమ పాపులర్ బ్రాండ్ అయిన కిల్లర్ జీన్స్ లోగోను ప్రస్తుతం టీమిండియా జెర్సీపై ప్రదర్శిస్తోంది… కేకేసీఎల్.
కేకేసీఎల్‌తో ఒప్పందం పూర్తయ్యాక… ప్రముఖ యూరప్ బ్రాండ్ అయిన అడిడాస్‌తో చేతులు కలిపేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు సమాచారం. జూన్ 1 నుంచి టీమిండియా జెర్సీ స్పాన్సర్‌గా వ్యవహరించేదుకు బీసీసీఐతో అడిడాస్ అగ్రిమెంట్ చేసుకోబోతోందని చెబుతున్నారు. అయితే… ఎంత మొత్తానికి ఈ ఒప్పందం కుదరబోతోంది అన్నది ఇంకా బయటికి రాలేదు. నాలుగేళ్ల కిందటే రూ.370 కోట్లకు ఒప్పందం జరిగింది కాబట్టి… ఈసారి అది రూ.500 కోట్లకు పైగానే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. జూన్ 7 నుంచి జరగబోయే వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో రోహిత్ సేన అడిడాస్ జెర్సీలో కనిపిస్తుందని అంటున్నారు. గతంలో ఇంగ్లండ్ క్రికెట్ జట్టుతో పాటు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు జెర్సీ స్పాన్సర్‌గా వ్యవహరించింది… అడిడాస్.
ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్‌లతోనూ అడిడాస్‌కు ఒప్పందం ఉంది. ఇప్పుడు నాటింగ్‌హాంషైర్, సౌత్ ఈస్ట్ స్టార్స్, సర్రే జట్లకు జెర్సీ స్పాన్సర్‌గా ఉన్న అడిడాస్.. త్వరలోనే టీమిండియా జెర్సీ స్పాన్సర్‌గా కనిపించబోతోంది.
Bumrah:బుమ్రాపై భగ్గుమంటున్న ఫ్యాన్స్
IPL: ఐపీఎల్ ప్రసారాలు ఫ్రీ ఫ్రీ ఫ్రీ.. పండగ చేస్కోండి..