CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రెండు రోజులలో.. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున్న సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. వర్షాల తీవ్రత, ప్రవాహాల తీవ్రత, ప్రజల భద్రత కోసం రాష్ట్రంలో అన్ని అధికారులు, పోలీసు బృందాలు, సంబంధిత శాఖలు జాగ్రతగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి స్పష్టంగా పేర్కొన్నారు.
వాతావరణ విభాగం నివేదికలు
వాతావరణ సమాచారం ప్రకారం.. రాబోయే 48 గంటల్లో ఒక మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. ఈ పరిస్తితిని దృష్టిలో ఉంచుకొని సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు, అధికారులకు నోటీసులు పంపారు.
ముఖ్యమంత్రి సూచనలు
అన్ని జిల్లాల కలెక్టర్లు సంబంధిత అధికారులు పరిస్థితిని నిరంతరం మానిటర్ చేయాలి. వాతావరణ మార్పులను వెంటనే గుర్తించి, ఆ రిపోర్ట్ ఆధారంగా చర్యలు చేపట్టాలి. ప్రతి జిల్లా హై అలెర్ట్‌లో ఉండాలని, ఆత్మీయ సహకార చర్యలను అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను.. ముందుగానే ఖాళీ చేయించి, పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు.
అన్ని ముఖ్య రహదారులు, జంక్షన్లు పరిశీలనలో ఉంచి, వరద నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి, ట్రాఫిక్‌ను ముందస్తు గా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కరెంట్ సరఫరా అంతరాయం లేకుండా ఉండేలా, వేలాడే వైర్లను తొలగించడం వంటి చర్యలు తక్షణం తీసుకోవాలి. ప్రాణహానీ రాకుండా అన్ని అవశ్యక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఆపరేషన్ అప్‌డేట్స్
హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ, హైడ్రా, అలాగే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండేలా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో తక్షణమే స్పందన కోసం అన్ని బృందాలు సిద్ధంగా ఉండాలి.
Also Read: మంత్రి కొండా సురేఖతో.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ భేటీ..
ప్రజలకు సూచనలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు కూడా సూచనలు చేశారు. వర్షకాలంలో వరద ప్రవాహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.