Gold SIP Investment: బంగారం ధరలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే 10 గ్రా. బంగారం ధర రూ.1,17,000 చేరుకుంది. మరో ఏడాదిలో గోల్డ్ ధర రూ.2 లక్షలకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారుల్లో బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు.
గోల్డ్ SIPలో క్రమం తప్పకుండా చిన్న మొత్తాలలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుంది. బంగారం రేటు పెరిగినప్పుడు ప్రయోజనాలు పొందవచ్చు. వివిధ బ్యాంకులు గోల్డ్SIP లు అందిస్తున్నాయి.
ఎస్బీఐ గోల్డ్ SIP ద్వారా బంగారంలో డిజిటల్‌గా పెట్టుబడి పెట్టవచ్చు. సాధారణంగా నెలకు రూ.1,000 లేదా రూ.2,000 నుంచి ఈ SIP ప్రారంభమవుతుంది. బంగారాన్ని కొనుగోలు చేయడానికి బదులుగా, పెట్టుబడిదారులు గోల్డ్ మార్కెట్ విలువకు సమానమైన యూనిట్లను కొనుగోలు చేయవచ్చు. ఈ పెట్టుబడి బంగారం ధరలతో పెరుగుతుంది.
ఒకరు నెలకు సుమారు రూ.4,000.. 15-20 సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే సాధారణ వృద్ధి రేటుతో దాదాపు రూ.80 లక్షలకు పైగా రిటర్స్న్ పొందవచ్చు. ఈ మొత్తంలో పెట్టుబడి, బంగారం విలువ వృద్ధి రేటు కలిసి ఉంటాయి.
ఎస్బీఐ గోల్డ్ SIP కాలిక్యులేటర్ లో పెట్టుబడిదారులు తమ రాబడిని అంచనా వేయవచ్చు. ఇందులో విభిన్న కాల వ్యవధులకు పెట్టుబడులను సరిపోల్చుకోవచ్చు. తద్వారా పెట్టుబడిదారులు తమ పెట్టుబడికి ఉత్తమ మార్గాన్ని నిర్ణయించుకోవచ్చు.
ఎస్బీఐ గోల్డ్ SIPలో 20 సంవత్సరాలు నెలకు రూ.4,000 పెట్టుబడి పెడితే.. బంగారం ఏటా 8 నుండి 10% పెరుగుతుందని భావిస్తే.. పెట్టుబడి రూ.80 లక్షలకు పెరగవచ్చు. ఇది ఇందులో కాంపౌండింగ్ ఎలా పనిచేస్తుందో, క్రమబద్ధమైన పెట్టుబడి, దీర్ఘకాలంలో ఫలితాలను తెలుసుకోవచ్చు. పెట్టుబడిదారులు తమ ఆర్థిక లక్ష్యాలను బట్టి నెలలవారీ పెట్టుబడి లేదా కాలపరిమితిని కూడా మార్చవచ్చు.
Also Read: హైదరాబాద్ లో అద్దె ఇల్లు కావాలా? ఏ ఏరియాల్లో రెంట్ తక్కువ అంటే?
భారతదేశంలో బంగారం ఎల్లప్పుడూ సురక్షితమైన పెట్టుబడి. గోల్డ్ SIP ద్వారా పెట్టుబడిదారులు సులభంగా బంగారంపై పెట్టుబడి పెట్టొచ్చు. చిన్న మొత్తంలో బంగారంపై క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టవచ్చు.