భారతీయులందరికీ ఆధార్ తప్పనిసరి చేసింది భారత ప్రభుత్వం. ప్రభుత్వ, ప్రైవేట్ సేవలకు కూడా ఇప్పుడు ఆధార్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పుట్టిన ప్రతి బిడ్డకు ఆధార్ అందిస్తోంది. అయితే, ఆధార్ కార్డును అప్ డేట్ చేసుకోవాలంటే కాస్త లెన్తీ ప్రాసెస్ ఉంది. ముందుగా ఆధార్ సెంటర్ కు వెళ్లాలి. అక్కడి ఫామ్ తీసుకుని ఫిల్ చేసి, సంబంధిత ధృవీకరణ పత్రాలను అందించి అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ కు ఆధార్ సెంటర్ లో ఉన్న రద్దీని బట్టి గంట నుంచి ఇంక ఎక్కువ సమయం కూడా పట్టే అవకాశం ఉంది. అయితే, ఇకపై ఈ ఇబ్బందులకు ఫుల్ స్టాప్ పడనుంది. ఇకపై ఇంటి దగ్గరి నుంచి ఈజీగా ఆధార్ అప్ డేట్ చేసుకునే అవకాశం కల్పించబోతోంది UIDAI. ఇంతకీ ఏం చేయబోతోందంటే..
త్వరలో ఆధార్ యాప్ ను అందుబాటులోకి తీసుకురాబోతోంది UIDAI. దీని ద్వారా ఆధార్ లోని అడ్రస్ ను అప్ డేట్ చేయడంతో పాటు ఆధార్ కార్డులను డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ మోబైల్ నెంబర్ మార్చాలంటే కచ్చితంగా ఆధార్ సెంటర్ కు వెళ్లక తప్పదు అంటుంది UIDAI. అన్ని సేవలకు ఆధార్ తప్పనిసరి అయిన నేపథ్యంలో ఈ యాప్ ద్వారా ఈజీగా పని పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుత m-ఆధార్ యాప్ అడ్రస్ ఛేంజ్ చేసుకోవడం, ఆధార్ డౌన్ లోడ్ చేసుకోవడం, PVC కార్డ్ డౌన్ లోడ్ ను అనుమతిస్తుంది.
Read Also: రీఛార్జ్ చేసుకోండి.. 2% డిస్కౌంట్ పొందండి, కస్టమర్లకు BSNL క్రేజీ ఆఫర్!
కొత్తగా అందుబాటులోకి రాబోతున్న ఆధార్ యాప్ ద్వారా మొబైల్ నంబర్ అప్ డేట్ అనేది సాధ్యం కాదు. ఒకవేళ మోబైల్ నెంబర్ అప్ డేట్ చేసుకోవాలంటే సమీపంలోని ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించాలి. అప్ డేట్ ఫారమ్ ను నింపి, మీ బయోమెట్రిక్ అందించాల్సి ఉంటుంది. అవసరమైన డాక్యుమెంట్స్ అందించాలి. ధృవీకరణ తర్వాత, మీ కొత్త నంబర్ సాధారణంగా వారం రోజుల్లోగా లింక్ చేయబడుతుంది.
UIDAI కొత్త ఆధార్ యాప్ మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే దీనిని పరీక్షించారు. తుది పరీక్షలు జరుపుకుంటుంది. డిసెంబర్ 2025 నాటికి అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఆధార్ సంబంధిత పనులను సులభతరం చేయడం, వినియోగదారులకు యాప్ అనుభవాన్ని మెరుగుపరచడం దీని లక్ష్యం. మొత్తంగా ఈ యాప్ అందుబాటులోకి వస్తే, సమయం, డబ్బు ఆదా కావడంతో పాటు ఈజీగా ఇంటి నుంచే పని పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది.
Read Also: ఓ వైపు దసరా సేల్స్, మరోవైపు జీఎస్టీ తగ్గింపు.. అమ్మకాల్లో దుమ్మురేపిన మారుతి సుజుకి!