Abhimanyu Easwaran : సాధారణంగా క్రికెట్ లో ఎప్పుడూ ఏం జరుగుతుందో చెప్పలేం. ముఖ్యంగా ఎప్పుడూ ఏ ఆటగాడు రాణిస్తాడో.. ఏ ఆటగాడు ఫామ్ లో కనబరుస్తాడో ప్రత్యేకంగా మనం ఊహించలేము. ఉదాహరణకు ఇవాళ అభిషేక్ శర్మ ఫామ్ లో ఉంటే… రేపు సూర్యకుమార్, మరోసారి శుబ్ మన్ గిల్ ఇలా ఎవ్వరో ఒకరూ ఫామ్ కనబరుస్తుంటారు. కానీ కొంత మంది ఫామ్ కనబరిచినప్పటికీ వాళ్లకు అవకాశాలు దక్కడం లేదు. అలాంటి ఆటగాళ్లు చాలా మందే ఉన్నారు. వారిలో అభిమన్యు ఈశ్వరన్ ఒకరు. వాస్తవానికి అభిమన్యు ఈశ్వరన్ క్రికెట్ లో చాలా అద్భుతంగా రాణిస్తున్నాడు. అయినప్పటికీ అతనికి టీమిండియా తరపున మాత్రం అవకాశాలు రావడంలేదు. ఇంత ఫామ్ లో కొనసాగుతున్నా.. ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.
Also Read : Asia Cup 2025 : టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పై విమర్శలు…గంభీర్ పై సంజూ సీరియస్?
ముఖ్యంగా దేశవాళీ క్రికెట్ లో 25 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు చేసిన అద్భుతమైన ఆటగాడు. దేశీయ క్రికెట్ లో 37 సెంచరీలు, 48.70 సగటుతో 7841 పరుగులు చేసిన అభిమన్యు ఈశ్వరన్ టీమిండియా టెస్ట్ కోసం ప్లేయింగ్ ఎలెవన్ ప్రవేశించాలని ఎంతో ఆశపడుతున్నాడు. కానీ వెస్టిండీస్ సిరీస్ కోసం సెలెక్ట్ చేసిన 15 ఆటగాళ్ల జాబితాలో అభిమన్యు ఈశ్వరన్ పేరు లేకపోవడంతో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురవుతున్నారు. అతను ఆరంగేట్రం చేస్తాడని ఆశించారు. మరోవైపు టీమిండియా క్రికెటర్ కరుణ్ నాయర్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ లేదా అభిమన్యు ని సెలెక్ట్ చేస్తారని అంతా భావించారు. కానీ అలాంటిది ఏమి జరుగలేదు.
Also Read : Team India : వెస్టిండీస్ సిరీస్‌కు భారత జట్టు ఎంపిక..వైస్ కెప్టెన్ గా జడేజా..షెడ్యూల్ ఇదే
కరుణ్ నాయర్ ఔట్..!
మరోవైపు టీమిండియా బ్యాట్స్ మెన్ కరుణ్ నాయర్ 2016లో చెన్నైలో ఇంగ్లాండ్ తో జరిగిన ఐదో టెస్ట్ లో అద్భుతమైన ట్రిపుల్ సెంచరీ సాధించాడు. వీరేంద్ర సెహ్వాగ్ తరువాత ఈ ఘనత సాధించిన రెండో భారతీయ బ్యాట్స్ మెన్ గా చరిత్రలో నిలిచాడు. కానీ అతను ఇప్పుడు తన ఫామ్ ను నిలబెట్టుకోవడంలో విఫలం చెందాడు. ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ కి ఎంపిక చేసినప్పటికీ అతను ఫామ్ కనబరచకపోవడంతో వెస్టిండీస్ జట్టుతో జరిగే టెస్ట్ సిరీస్ కి కరుణ్ నాయర్ ను ఎంపిక చేయలేదు. అయితే కరుణ్ నాయర్ స్థానంలో అభిమన్యు ఈశ్వరన్ సెలెక్ట్ అవుతాడని భావించినప్పటికీ అలాంటిదేమి జరుగలేదు. దాదాపు 8 సంవత్సరాల తిరిగి ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కి వచ్చినప్పటికీ అతను ఫామ్ కనబరచలేదు. దీంతో వెస్టిండిస్ టెస్ట్ కి అతనిపై వేటు తప్పలేదు. కేవలం అభిమన్యు ఈశ్వరన్, శ్రేయస్ అయ్యర్ మాత్రమే కాదు.. టీమిండియా టాలెంట్ ఉండి.. అద్భుతంగా క్రికెట్ ఆడే ఆటగాళ్లు చాలా మందే ఉన్నారు. అయినప్పటికీ అద్భుతమైన ఫామ్ లో ఉన్న అభిమన్యు ఈశ్వరన్, శ్రేయస్ అయ్యర్ వంటి మెరుగైన ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వాల్సింది అని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు.