BigTV English

French open 2024 Sabalenka, Djokovic next round: ఫ్రెంచ్ ఓపెన్ టాప్ సీడ్ జోరు, నాలుగు గంటల మ్యాచ్… జకోవిచ్ అతి కష్టంమీద…

French open 2024 Sabalenka, Djokovic next round: ఫ్రెంచ్ ఓపెన్ టాప్ సీడ్ జోరు, నాలుగు గంటల మ్యాచ్… జకోవిచ్ అతి కష్టంమీద…

French open 2024 Sabalenka, Djokovic next round: ఫ్రెండ్ ఓపెన్ ఆసక్తిభరితంగా కొనసాగుతోంది. ముఖ్యంగా పురుషులు, మహిళల సింగల్స్ విభావంగా టాప్ సీడ్ ఆటగాళ్లు తదుపరి రౌండ్‌లోకి అడుగు పెట్టారు.


తాజాగా మహిళల సింగల్స్ విభాగంలో బెలారస్‌కు చెంది రెండోసీడ్ సబలెంక ప్రీ క్వార్టర్స్‌లోకి దూసు కెళ్లింది. స్పెయిన్‌కి చెందిన బదోసాపై సంచలన విజయం సాధించింది. తొలి సెట్ నుంచే సబలెంకకు బదోసా నుంచి గట్టి పోటీ ఎదురైంది. నువ్వానేనా అన్నట్లు ఇరువురు ఆటగాళ్లు తలపడ్డారు. చివరకు తొలి గేమ్ టైబ్రేక్ దారి తీసింది.

ఇందులో అతికష్టం మీద విజయం సాధించింది. దీంతో రెండో సెట్ ఇరువురు ఆటగాళ్లకు కీలకమైంది. అయితే బదోసా చేసిన తప్పిదాలు ఆమెని వెంటాడారు. దీంతో ప్రత్యర్థికి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదు బెలారస్ బ్యూటీ. కేవలం ఒక్క పాయింట్ మాత్రమే ఇచ్చింది. ఏడుసార్లు ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసిన సబలెంక, 28 సారి గెలిచింది. చివరకు 7-5, 6-1 వరుస సెట్లలో విజయం సాధించింది.


ఇక పురుషుల సింగల్స్ విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్ నవోక్ జకోవిచ్ అతికష్టం మీద మూడో రౌండ్లో గెలిచాడు. జకోవిచ్‌ను ఓడించినంత పని చేశాడు ఇటలీకి చెందిన 22 ఏళ్ల లోరెంజో ముసెట్టి. దాదాపు నాలుగు గంటలపాటు ఇరువురు ఆటగాళ్లు హోరాహోరీగా పోరాడారు. తొలిసెట్ నుంచే ఇరువురు ఆటగాళ్లు నువ్వానేనా అన్నరీతిలో తలపడ్డారు.

తొలిసెట్‌ను అతి కష్టంమీద గెలుచుకున్న జకోవిచ్, సెకండ్ సెట్లో ప్రతిఘటన ఎదురైంది. మూడో సెట్‌ లోనూ అదే దూకుడు కనబరిచాడు ముసెట్టి. ఇక జకోవిచ్ పనైపోయిందని అందరూ భావించారు. ప్రేక్షకులు దాదాపుగా జకోవిచ్‌ గెలవడం కష్టమనే అంచనాలు వచ్చేశారు. ఆ తర్వాత విజృంభించిన జనోవిచ్, నాలుగో సెట్‌ను 6-3 తేడాతో గెలుపొందాడు. దీంతో ఇదో సెట్ ఇద్దరికి కీలకమైంది. ప్రత్యర్థికి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా జీరోలో పెట్టి విజయం సాధించింది. ఐదు సెట్ల మ్యాచ్‌ను 7-5, 6-7 (6-8), 2-6, 6-3, 6-0 తేడాతో గెలిచి తదుపరి రౌండ్‌కు అర్హంత సాధించాడు జకోవిచ్.

ALSO READ:  టీమ్ ఇండియాదే ఆధిపత్యం.. బంగ్లాదేశ్ ఘోర ఓటమి

కాకపోతే ముసెట్టి అనవసర తప్పిదాలకు పాల్పడ్డాడు. ఏస్‌లు కూడా సరిగ్గా సంధించలేదు. ఫస్ట్ సర్వీస్ విభాగంలో కాస్త వెనుకబడ్డాడు. బ్రేక్ పాయింట్ విషయంలోనూ దూకుడు తగ్గింది. కాకపోతే టైబ్రేక్‌లో మాత్రమే కాస్త మెరుగనిపించాడు. రాత్రి 11 గంటలకు మొదలైన మ్యాచ్, తెల్లవారుజామున మూడు గంటలవరకు సాగింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో రోజర్ ఫెదరర్ తర్వాత అంత సమయం తీసుకున్న మ్యాచ్ ఇదే కావడం గమనార్హం.

 

 

Tags

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×