BigTV English

Shubman Gill – Ridhima Pandit: పెళ్లా? గిల్లా?.. అదేం లేదు.. వివరణ ఇచ్చిన నటి

Shubman Gill – Ridhima Pandit: పెళ్లా? గిల్లా?.. అదేం లేదు.. వివరణ ఇచ్చిన నటి

Ridhima Pandit Reacts To Reports Of ‘Wedding Rumours With Shubman Gill: గిల్…అదేనండీ బాబూ శుభ్ మన్ గిల్.. మనవాడు నిజంగానే ప్లే బోయ్ లా ఉన్నాడు. నిప్పు లేకుండా భలే వార్తలు వచ్చేస్తున్నాయి. మొదట బాలీవుడ్ ఫేమస్ హీరోయిన్ సారా అలీ ఖాన్ తో కలిసి రెస్టారెంట్లకు వెళ్లాడు. కలిసి ఫొటోలకు ఫోజులిచ్చాడు. అంతా బాగానే ఉంది. కానీ ఎందుకో ఆ బంధం తెగిపోయింది. సారా అలీఖాన్ డైరక్టుగా.. అలాంటిదేమీ లేదని తెగేసి చెప్పింది.


ఆ తర్వాత మనవాడు.. ఏకంగా లెజండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ తో ఫ్రెండ్ షిప్ చేశాడు. కొన్ని రోజులు ఆ ఫొటోలు నెట్టింట హల్చల్ చేశాయి. ఇద్దరి పేర్లు సారా కావాడంతో అందరూ కన్ ఫ్యూజ్ అయ్యారు. తర్వాత సచిన్ కుమార్తె.. గిల్ ఆడే మ్యాచ్ లకు హాజరయ్యేది. తనకు సపోర్ట్ చేసేది. తను క్రీజులో ఉన్నంతవరకు ఉత్సాహంగా ఉండేది. తను అవుట్ అయితే బాధపడేది. ఇది కొంతకాలం సాగింది.

తర్వాత వాళ్లిద్దరూ బ్రేకప్ చెప్పుకోలేదు. ప్యాకప్ చెప్పుకోలేదు. కానీ మళ్లీ కలవలేదు. తర్వాత గిల్ చాలా మ్యాచ్ లు ఆడాడు. కానీ సారా ఎప్పుడూ హాజరు కాలేదు. ఇప్పుడు ఈ రెండు ఘటనల తర్వాత తాజాగా సుప్రసిద్ధ బుల్లి తెర యువ నటి రిధిమా పండిట్ తనంతట తానుగా స్పందించింది. దాంతో వ్యవహారం
మళ్లీ నెట్టింట రచ్చరచ్చగా మారింది.


ఇంతకీ తనేమంటుంది అంటే.. పొద్దున్న లేస్తే చాలు.. నాకు అందరూ శుభాకాంక్షల మెసేజ్ లు పంపిస్తున్నారు. ఎందుకని చూస్తే.. క్రికెటర్ గిల్ తో నాకు త్వరలో పెళ్లి జరగనుందని వాటి వల్ల తెలిసింది. నిజానికి నేనిప్పటి వరకు గిల్ ను కలవలేదని చెప్పింది. మా ఇద్దరి మధ్య డేటింగ్ ఉందనేది శుద్ధ అబద్ధమని తెలిపింది. అలాంటివి ఏమైనా ఉంటే, మీడియా కన్నా ముందు సోషల్ మీడియాకి చెబుతానని తెలిపింది.

Also Read: టీమ్ ఇండియాదే ఆధిపత్యం.. బంగ్లాదేశ్ ఘోర ఓటమి

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెబుతూ కొందరు కావాలనే ఒక కథను అల్లి సోషల్ మీడియాలో వైరల్ చేశారని రిధిమా పండిట్ పేర్కొంది. ప్రస్తుతానికి నేను సింగిల్ అంటూ ఒక పోస్ట్ అయితే పెట్టింది. ఇంతకు ముందు కూడా రిధిమా పండిత్ తో గిల్ డేటింగ్ వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ప్రస్తుతం బాలీవుడ్ టీవీ షో.. ‘ బహు హమారీ రజనీకాంత్’ లో సీరియల్ ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. బిగ్ బాస్ లో ఇంకా ఖత్రోంకి ఖలాడీ తదితర రియాల్టీ షోస్ లో కూడా పేరు తెచ్చుకుంది. అలా యూత్ లో ఒక వర్గానికి తనొక ఇంప్రెషన్ గా మారింది.

కొందరు ఏమంటారంటే.. నిప్పు లేనిదే పొగరాదు.. ఒక్క శుభ్ మన్ గిల్ మాత్రమే ఎందుకు దొరికాడు? ఇంకా చాలామంది పెళ్లికాని యువ క్రికెటర్లు ఉన్నారు కదా.. అంటే ఈ వార్తల్లో ఎంతో కొంత నిజం ఉన్నట్టే అని కుంబబద్దలు కొడుతున్నారు. రిధిమా పండిత్ చెప్పిన మాటలని నమ్మం కాక నమ్మం అని అంటున్నారు.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×