BigTV English

French open Final 2024: మహిళల సింగిల్స్‌, ఫైనల్లో ఇగా వర్సెస్ ఫౌలినీ!

French open Final 2024: మహిళల సింగిల్స్‌, ఫైనల్లో ఇగా వర్సెస్ ఫౌలినీ!

French Open Final 2024: ఫ్రెంచ్ మహిళ సింగిల్స్ ఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. ఫైనల్‌‌లో పోలెండ్ బ్యూటీ ఇగా స్వెటక్-ఇటలీకి చెందిన పౌలీనితో అమితుమీ తేల్చుకోనుంది. మరి మట్టి కోర్టులో ఫైనల్ విజేత ఎవరనేది ఆసక్తికరంగా మారింది.


సెమీస్‌లో పోలెండ్ బ్యూటీ ఇగా స్వైటెక్, అమెరికాకు చెందిన కొకోగ్రాఫ్‌ను ఓడించింది. ఆది నుంచి ఇరువురు మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. తొలిసెట్‌ను సునాయాశంగా గెలుచుకున్న ఇగా, ప్రత్యర్థి నుంచి రెండో సెట్‌లో కాస్త ప్రతిఘటన ఎదురైంది. అయినా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. చివరకు తన అనుభవాన్ని రంగరించి విజయం సాధించింది. దీంతో రెండు సెట్లను 6-2, 6-4 తేడాతో ఓడించి ఫైనల్ కు చేరింది. స్వైటెక్ ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు చేరడం గత ఐదేళ్లలో ఇది నాలుగోసారి.

మరో సెమీస్ మ్యాచ్‌లో రష్యా టీనేజీ అమ్మాయి ఆండ్రీవా జోరుకు కళ్లెం వేసింది ఇటలీకి చెందిన ఫౌలీని. వీరిద్దరి మధ్య నువ్వానేనా అన్నరీతిలో సాగుతుందని అభిమానులు భావించినప్పటికీ ఆండ్రీవా ఏమాత్రం ప్రతిఘటించ లేకపోయింది. తొలిసెట్‌లో అతి కష్టంమీద గెలుచుకున్న ఫౌలీని, రెండో సెట్‌లో ప్రత్యర్థికి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. అసలు పాయింట్ ఇవ్వకుండానే విజయం సాధిస్తుందని అభిమానులు భావించినప్పటికీ కేవలం ఒక్క పాయింట్ మాత్రమే ఇచ్చింది. దీంతో ఫౌలీని 6-3, 6-1 తేడాతో ఆండ్రీవాపై గెలిచి ఫైనల్‌కు చేరింది.


Also Read: సూపర్ ఓవర్ లో పాక్ ఓటమి.. యూఎస్‌ఏ సంచలన విజయం

Tags

Related News

IND Vs PAK : ఆసియా కప్ ఫైనల్.. ఫ్రీ లైవ్ ఎక్కడ చూడాలంటే..ఇక‌పై డీడీ స్పోర్ట్స్‌లోనూ?

IND Vs PAK : అర్శ్‌దీప్ సింగ్ పై బ్యాన్‌…స‌రికొత్త కుట్ర‌ల‌కు తెగించిన‌ పాకిస్థాన్..!

IPL 2026: ఐపీఎల్ 2026లో కొత్త రూల్.. షాక్ లో ప్లేయర్లు… ఇకపై అక్కడ ఒక మ్యాచ్ ఆడాల్సిందే

IND Vs PAK : టీమిండియాతో ఫైన‌ల్‌..ఓపెన‌ర్ గా షాహీన్ అఫ్రిదీ..పాక్ అదిరిపోయే ప్లాన్‌

IND VS PAK Final: ఇండియాను వ‌ణికిస్తున్న పాత రికార్డులు..అదే జ‌రిగితే పాకిస్థాన్ ఛాంపియ‌న్ కావ‌డం పక్కా ?

IND Vs PAK : నోరు జారిన షోయబ్ అక్తర్.. అభిషేక్ బచ్చన్ ను సీన్ లోకి లాగి

IND VS PAK, Final: ట్రోఫీ ఇవ్వ‌నున్న‌ నఖ్వీ.. వాడిస్తే మేం తీసుకోబోమంటున్న టీమిండియా..!

IND Vs PAK : ‘షేక్ హ్యాండ్’ వివాదం పై పాకిస్తాన్ కెప్టెన్ మ‌రోసారి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

Big Stories

×