BigTV English

USA Vs PAK Highlights: సూపర్ ఓవర్ లో పాక్ ఓటమి.. యూఎస్‌ఏ సంచలన విజయం!

USA Vs PAK Highlights: సూపర్ ఓవర్ లో పాక్ ఓటమి.. యూఎస్‌ఏ సంచలన విజయం!

T20 World Cup 2024 – United States Won the Super Over by 5 Runs: టీ 20 ప్రపంచకప్ మ్యాచ్ లు చప్పగా సాగుతున్నాయి. పిచ్ లు బాగా లేదు.. ఇలాంటి కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో అసలైన మజా ఇచ్చిన మ్యాచ్ పాకిస్తాన్ వర్సెస్ యూఎస్ఏ మధ్య జరిగింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన మ్యాచ్.. సూపర్ ఓవర్ వరకు వెళ్లింది. విజయం కోసం రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఈ మెగా టోర్నమెంటులో ఇది రెండో సూపర్ ఓవర్ మ్యాచ్ గా నిలిచింది.

చివరికి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. పాకిస్తాన్ ని ఓడించి యూఎస్ ఏ సంచలన విజయం సాధించింది. అందరికి నోటమాట రాకుండా చేసింది. రాత్రి ఒంటిగంటన్నర వరకు సాగిన మ్యాచ్ ని అందరూ కళ్లప్పగించి, టీవీలకు, మొబైల్ ఫోన్లకు అతుక్కుపోయి చూశారు.

యూఎస్ ఏకు సూపర్ ఓవర్ లో అద్భుతంగా బౌలింగ్ చేసి కీలక విజయాన్ని అందించింది మరెవరో కాదు.. ప్రవాస భారతీయుడు.. ఒకనాడు ఇండియా తరఫున అండర్ 19లో ఆడిన సౌరభ్ నేత్రవల్కర్ కావడం విశేషం.

Also Read: IND vs PAK: క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఆ మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్ ?

వివరాల్లోకి వెళితే.. డల్లాస్ లోని గ్రాండ్ ప్రైరీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన యూఎస్ఏ మొదట బౌలింగు తీసుకుంది. దీంతో బ్యాటింగుకి వచ్చిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో అమెరికా 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి సరిగ్గా 159 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు వెళ్లింది.

ఈ నేపథ్యంలో మొదట బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ సూపర్ ఓవర్ లో ఒక వికెట్ నష్టానికి 18 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ ఒక ఓవర్ లో ఒక వికెట్ నష్టానికి 13 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. దీంతో అమెరికాలో సంబరాలు అంబరాన్ని అంటాయి.

Also Read: IND vs PAK: పాకిస్తాన్‌తో కీలక మ్యాచ్.. ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. హిట్ మ్యాన్‌కు గాయం

ఇకపోతే.. 160 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన యూఎస్ఏకి సరైన ఆరంభం దక్కలేదు. ఓపెనర్ స్టీవెన్ టేలర్ (12) త్వరగా అయిపోయాడు. అయితే మరో ఓపెనర్ కెప్టెన్ మోనాంక్ పటేల్ 38 బంతుల్లో 1 సిక్సర్, 7 ఫోర్ల సాయంతో 50 పరుగులు చేసి విజయానికి పునాదులు వేశాడు. తర్వాత ఫస్ట్ డౌన్ వచ్చిన ఆండ్రిస్ గౌస్ కూడా 26 బంతుల్లో 1 సిక్స్, 5 ఫోర్ల సాయంతో 35 పరుగులు చేసి మ్యాచ్ చేజారిపోకుండా చూశాడు.

ఈ క్రమంలో సెకండ్ డౌన్ వచ్చిన ఆరోన్ జోన్స్ జట్టుకి వెన్నుముకగా నిలిచాడు. అమెరికా గెలవడంలో తను కీలకపాత్ర పోషించాడు. 26 బంతుల్లో 2 సిక్స్ లు, 2 ఫోర్ల సాయంతో 36 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. చివర్లో నితీష్ కుమార్ ఆఖరి బంతిని ఫోర్ కొట్టి మ్యాచ్ ని టై చేశాడు. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు వెళ్లింది. అలా 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.

Also Read: ధోనీ రికార్డ్ బ్రేక్.. సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ

ఇకపోతే  సూపర్ ఓవర్ ఆడేందుకు మొదట యూఎస్ఏ నుంచి ఆరోన్ జోన్స్, హర్మీత్ సింగ్ వచ్చారు. పాకిస్తాన్ బౌలర్ మహ్మద్ అమీర్ వచ్చాడు. ఈ ఓవర్ లో తను మూడు వైడ్స్ వేశాడు. అలా మొత్తానికి ఒక ఓవర్ లో 18 పరుగులు వచ్చాయి. ఇందులో జోన్స్ (11) చేశాడు. మిగిలినవన్నీ ఎక్స్ ట్రాస్ రూపంలో వచ్చాయి. హర్మీత్ సింగ్ కి స్ట్రయికింగ్ రాలేదు.

తర్వాత 19 పరుగుల లక్ష్యంతో సూపర్ ఓవర్ ఆడేందుకు పాకిస్తాన్ నుంచి హిట్టర్లు ఇఫ్తికర్ అహ్మద్, ఫకర్ జమన్ వచ్చారు. అయితే ప్రవాస భారతీయుడు సౌరభ్ నేత్రవల్కర్ బౌలింగుకి వచ్చాడు. మూడో బాల్ కి ఇఫ్తికర్ (4) ని అవుట్ చేశాడు.

తర్వాత షాబాద్ ఖాన్ వచ్చి 3 పరుగులే చేశాడు. అయితే ఇక్కడ కూడా ఎక్స్ ట్రాల రూపంలో 6 పరుగులు వచ్చాయి.  మొత్తానికి ఒక ఓవర్ లో పాకిస్తాన్ 13 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 5 పరుగుల తేడాతో సూపర్ ఓవర్ లో అమెరికా విజయం సాధించింది.

Also Read: SL vs BAN Highlights T20 World Cup 2024: శ్రీలంకను ఓడించిన బంగ్లాదేశ్..

పాకిస్తాన్ బౌలింగులో మహ్మద్ అమీర్ 1, నజీమ్ షా 1, హరిస్ రౌఫ్ 1 వికెట్ తీశారు.

అంతకుముందు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఆటగాళ్లకు యూఎస్ ఏ బౌలర్లు చుక్కలు చూపించారు. మ్యాచ్ ప్రారంభమైన వెంటనే ఓపెనర్, ప్రమాదకర రిజ్వాన్ (9) ను …నేత్రావల్కర్ అవుట్ చేశాడు. తర్వాత వచ్చిన ఉస్మాన్ ఖాన్ (3), ఫకర్ జమాన్ (11) ఎక్కువ సేపు నిలవలేదు.

కెప్టెన్ బాబర్ అజామ్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. 43 బంతుల్లో 2 సిక్స్ లు, 3 ఫోర్ల సాయంతో 44 పరుగులు చేశాడు. తనకి సపోర్టుగా షాదాబ్ ఖాన్ నిలిచాడు. 25 బంతుల్లో 3 సిక్సర్లు, 1 ఫోర్ సాయంతో 40 పరుగులు చేశాడు. చివర్లో ఇఫ్తికర్ (18), షహీన్ ఆఫ్రిది (23 నాటౌట్) ధనాధన్ ఆడటంతో పాకిస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.

Also Read: AFG vs NZ T20 World Cup 2024 Highligts: ఆఫ్గాన్ గన్ బౌలింగ్ .. కివీస్ 84 పరుగుల తేడాతో ఓటమి

అమెరికా బౌలింగులో ప్రదీప్ కెంజిగే 3, నేత్రావల్కర్ 2, అలీఖాన్ 1, జసదీప్ సింగ్ 1 వికెట్ పడగొట్టారు.

తర్వాత షాబాద్ ఖాన్ వచ్చి 3 పరుగులే చేశాడు. అయితే ఇక్కడ కూడా ఎక్స్ ట్రాల రూపంలో 6 పరుగులు వచ్చాయి.  మొత్తానికి ఒక ఓవర్ లో పాకిస్తాన్ 13 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 5 పరుగుల తేడాతో సూపర్ ఓవర్ లో అమెరికా విజయం సాధించింది.

పాకిస్తాన్ బౌలింగులో మహ్మద్ అమీర్ 1, నజీమ్ షా 1, హరిస్ రౌఫ్ 1 వికెట్ తీశారు.

అంతకుముందు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఆటగాళ్లకు యూఎస్ ఏ బౌలర్లు చుక్కలు చూపించారు. మ్యాచ్ ప్రారంభమైన వెంటనే ఓపెనర్, ప్రమాదకర రిజ్వాన్ (9) ను …నేత్రావల్కర్ అవుట్ చేశాడు. తర్వాత వచ్చిన ఉస్మాన్ ఖాన్ (3), ఫకర్ జమాన్ (11) ఎక్కువ సేపు నిలవలేదు.

Also Read: Babar Azam Breaks Virat Kohli’s Record: కొహ్లీ రికార్డుని దాటేసిన.. బాబర్ అజామ్

కెప్టెన్ బాబర్ అజామ్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. 43 బంతుల్లో 2 సిక్స్ లు, 3 ఫోర్ల సాయంతో 44 పరుగులు చేశాడు. తనకి సపోర్టుగా షాదాబ్ ఖాన్ నిలిచాడు. 25 బంతుల్లో 3 సిక్సర్లు, 1 ఫోర్ సాయంతో 40 పరుగులు చేశాడు. చివర్లో ఇఫ్తికర్ (18), షహీన్ ఆఫ్రిది (23 నాటౌట్) ధనాధన్ ఆడటంతో పాకిస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.

అమెరికా బౌలింగులో ప్రదీప్ కెంజిగే 3, నేత్రావల్కర్ 2, అలీఖాన్ 1, జసదీప్ సింగ్ 1 వికెట్ పడగొట్టారు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×