E-Paper
Advertisement

హార్దిక్ పాండ్యా 10 ఓవర్లు వేయలేడు…బాంబ్ పేల్చిన గంభీర్

హార్దిక్ పాండ్యా 10 ఓవర్లు వేయలేడు…బాంబ్ పేల్చిన గంభీర్
Advertisement

Gambhir Insulated Hardik Pandya: టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ ఇప్పట్లో కష్టమేననే ప్రచారం జోరందుకుంది. 2027 వన్డే వరల్డ్ కప్ ప్లాన్ లోనూ హార్దిక్ పాండ్యా లేడనే సంకేతాలు ఇచ్చింది బీసీసీఐ. ఈ నెల చివరలో ప్రారంభం కాబోయే వెస్టిండీస్ వన్డే సిరీస్ నేపథ్యంలో టీమిండియా జట్టును ప్రకటించింది. అయితే, ఇందులో హార్దిక్ పాండ్యాను పక్కకు పెట్టిన బీసీసీఐ, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డిని తీసుకుంది. అటు విండీస్ తో జరిగే 5 టీ20ల సిరీస్ నేపథ్యంలోనూ హార్దిక్ పాండ్యాను పరిగణలోకి తీసుకోలేదు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా కెరీర్ కు ఎండ్ కార్డ్ పడిందని, టీమిండియా ఫ్యూచర్ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డినే అంటూ చర్చ జరుగుతోంది.

హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయడం కష్టమే

హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీపై స్వయంగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. హార్దిక్ పాండ్యా ఫిట్ నెస్ సరిగ్గా లేదని, వన్డేల్లో 10 ఓవర్లు వేయడం కష్టమేనంటూ గంభీర్ కామెంట్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. 4 ఓవర్ల కంటే ఎక్కువ వేసే పరిస్థితిలో అతడు లేనట్లు వ్యాఖ్యానించారని తెలుస్తోంది. కానీ, జాతీయ జట్టులోకి తిరిగి రావాలంటే.. టీమిండియా-ఏ తరఫున ఆడాలని గంభీర్ సూచనలు చేశారట. అక్కడ పూర్తి ఫిట్ నెస్ నిరూపించుకుంటే, 2027 వన్డే వరల్డ్ కప్ ఆడే జట్టులోకి వచ్చే అవకాశం ఉంటుందని కుండ బద్దలు కొట్టి చెప్పారని ప్రచారం జోరుగా సాగుతోంది. మరి ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

Advertisement

 

హార్దిక్ పాండ్యాను ఎందుకు పక్కన బెడుతున్నారంటే ?

 

Advertisement

టీ20 వరల్డ్ కప్ 2026 తర్వాత హార్దిక్ పాండ్యా ఇప్పటి వరకు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు. ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై తరఫున ఆడినప్పటికీ..పేలవ ప్రదర్శన కనబరిచాడు. కెప్టెన్ గానూ విఫలమైయ్యాడు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యాను వదిలించుకునేందుకే అంబానీ ఫ్యామిలీ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. దానికి తోడు ఐపీఎల్ 2026 నుంచే వెన్నునొప్పితో పాండ్యా బాధపడుతున్నాడు. ఈ నోప్పి కారణంగానే, నెట్స్ లోనూ మనోడు బౌలింగ్ చేయలేక ఇబ్బంది పడుతున్నట్లు మాజీ క్రికెటర్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యా కంటే నితీష్ బెటర్ అని బీసీసీఐ భావిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రతీ సిరీస్ కు తెలుగు కుర్రాడు నితీష్ నే పరిగణలోకి తీసుకుంటున్నట్టు సమాచారం. అటు వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటోన్న నితీష్, అదరగొడుతున్నాడు. నిన్నటి వరకు సాగిన ఆఫ్ఘానిస్తాన్ వర్సెస్ టీమిండియా మూడు టీ20ల సిరీస్ లోనూ తెలుగు కుర్రాడు నితీష్ అదరగొట్టేశాడు. ఈ క్రమంలోనే విండీస్ తో జరిగే టీ20లు, వన్డేలకు అతన్ని సెలక్ట్ చేసింది బీసీసీఐ. వచ్చే వన్డే వరల్డ్ కప్ 2027 లోనూ తెలుగు కుర్రాడు నితీష్ కు ఛాన్స్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి భవిష్యత్తులో నితీష్ కుమార్ రెడ్డి పట్ల బీసీసీఐ పెద్దలు ఎలా వ్యవహరిస్తారో చూడాలి.

 

Related News

బ‌ల‌హీన‌మైన ఆఫ్ఘనిస్తాన్ పై గెలిచి హీరోలుగా బిల్డ‌ప్ ఇస్తున్నారు

మాకు షేక్ హ్యాండ్ ఇవ్వ‌డం చేత‌కాదు, కానీ ఆఫ్ఘానిస్తాన్ కెప్టెన్ తో సంసార‌మే మొద‌లు పెట్టారు

అందుకే నా కొడుకు ఓం నమః శివాయ సెల‌బ్రేష‌న్స్ చేశాడు..అభిషేక్ శర్మ తండ్రి సంచ‌ల‌నం

వైభ‌వ్ సూర్య‌వంశీ మ‌గాడు కాదు, వాడు తేడా అంటూ ట్రోల్స్‌..!

అస‌లు అభిషేక్ శ‌ర్మకు సిగ్గుందా.. మైదానంలో హిందూ మ‌తాన్ని ప్ర‌చారం చేస్తారా ?

శ్రేయ‌స్ అయ్య‌ర్ గొప్ప మ‌న‌సు…గెలిచిన ట్రోఫీని కూడా ఆఫ్ఘానిస్తాన్ కే ఇచ్చేశాడు!

ఆఫ్ఘనిస్తాన్ వైట్ వాష్.. టీమిండియాదే సిరీస్‌, అభిషేక్ శ‌ర్మ సెల‌బ్రేష‌న్స్ వైర‌ల్

Big Stories

Advertisement
×