E-Paper
Advertisement

రూ.1999లకే అదిరిపోయే స్మార్ట్‌వాచ్..ఇన్ఫినిక్స్ Xవ్యాచ్ H5 ప్రో ఫీచర్లు అదుర్స్!

రూ.1999లకే అదిరిపోయే స్మార్ట్‌వాచ్..ఇన్ఫినిక్స్ Xవ్యాచ్ H5 ప్రో ఫీచర్లు అదుర్స్!
Advertisement

Infinix Xwatch H5 Pro smartwatch: బడ్జెట్ ధరలో బెస్ట్ ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ అందించడంలో ఇన్ఫినిక్స్ బ్రాండ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. తాజాగా ఈ కంపెనీ మార్కెట్లోకి తెచ్చిన ‘ఇన్ఫినిక్స్ Xవ్యాచ్ H5 ప్రో’ స్మార్ట్‌వాచ్ టెక్ లవర్స్‌ను విశేషంగా ఆకర్షిస్తోంది. సాధారణంగా రూ.2,000 లోపు ధరలో ఇన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉండే .. వాచ్ దొరకడం చాలా అరుదు. అయితే .. ఈ వాచ్ కేవలం రూ.1999 ధరకే అందుబాటులో ఉంది. మరి ఈ బడ్జెట్ స్మార్ట్‌వాచ్ అందించే ఫీచర్లు , పనితీరు ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

అద్భుతమైన డిస్‌ప్లే,డిజైన్:

ఈ వాచ్ మెయిన్ హైలైట్ దీని డిస్‌ప్లే అని చెప్పాలి. ఇందులో.. 2.06 ఇంచుల పెద్ద సైజు అమోలెడ్ స్క్రీన్‌ను అందించారు. ఈ ధరలో.. అమోలెడ్ డిస్‌ప్లే రావడం నిజంగా గ్రేట్ ఫీచర్. అంతే కాకుండా 1000 నిట్స్ పీక్ బ్రైట్‌ నెస్ ఉండటం వల్ల ఎండలో కూడా స్క్రీన్ పై ఉన్న అక్షరాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. వాచ్ లుక్ చాలా ప్రీమియంగా ఉండి, చేతికి పెట్టుకున్నప్పుడు ఖరీదైన వాచ్‌లా అనిపిస్తుంది.

హెల్త్ , ఫిట్‌నెస్ ట్రాకింగ్:

Advertisement

ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టే వారి కోసం.. ఈ వాచ్‌లో 24/7 AI-పవర్డ్ హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు ఉన్నాయి. రియల్ టైమ్ హార్ట్ రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్, స్లీప్ క్వాలిటీ, కేలరీల గణనను ఇది కచ్చితంగా ట్రాక్ చేస్తుంది. అలాగే వివిధ రకాల స్పోర్ట్స్ మోడ్స్ ఉండటం వల్ల రన్నింగ్, జిమ్ , వర్కవుట్లు చేసేవారికి ఇది చాలా బాగా ఉపయోగ పడుతుంది.

బ్యాటరీ బ్యాకప్ ,కాలింగ్ ఫీచర్:

ఈ వాచ్‌లో మరో గొప్ప విషయం ఏటంటే దీని బ్యాటరీ లైఫ్. సాధారణ మోడ్‌లో వాడితే.. ఇది సింగిల్ ఛార్జ్‌తో ఎక్కువ కాలం పాటు బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుంది. హెవీ యూసేజ్ ఉన్నప్పటికీ రోజంతా.. ఎలాంటి టెన్షన్ లేకుండా వాడవచ్చు. అలాగే బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ సపోర్ట్ ఉండటం వల్ల.. ఫోన్ తీయకుండానే వాచ్ ద్వారా నేరుగా మాట్లాడొచ్చు. దీనిలోని మైక్ , స్పీకర్ క్వాలిటీ చాలా స్పష్టంగా ఉంటుంది.

Advertisement

Also Read: ల్యాప్ టాప్ కొనే ఆలోచన ఉందా? ఇప్పుడే..కొనడం బెటర్

బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్:

మార్కెట్లో లభించే ఇతర బ్రాండ్ల స్మార్ట్‌వాచ్‌లతో పోలిస్తే.. కేవలం రూ.1999 ధరకే ఇన్ని అద్భుతమైన ఫీచర్లు ఇస్తుండటం నిజంగా అద్భుతం. స్టూడెంట్స్ , తక్కువ బడ్జెట్‌లో మంచి స్మార్ట్‌ వాచ్ కోరుకునే ఉద్యోగులకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా ఇది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది.

మొత్తానికి.. ఇన్ఫినిక్స్ Xవ్యాచ్ H5 ప్రో అనేది తక్కువ ధరలో.. ఎక్కువ ఫీచర్లు ఆశించే వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన సూపర్ గ్యాడ్జెట్. అమోలెడ్ డిస్‌ప్లే, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ, హెల్త్ ట్రాకింగ్ వంటి అన్నీ ఉన్న ఈ వాచ్, రూ. 2వేల లోపు బడ్జెట్‌లో నంబర్ వన్ ఆప్షన్‌గా నిలుస్తోంది!

Related News

ఊరమాస్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ..కోడాక్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ అదిరిపోయే ఫీచర్లు ఇవే!

పాకెట్ సైజులో పవర్ బ్యాంక్..నాయిస్ నుంచి అదిరిపోయే మోడల్!

లాంగ్ రోడ్ ట్రిప్‌లో పెట్రోల్ ఖర్చులు తగ్గించాలనుకుంటే.. ఈ 5 గాడ్జెట్లు వెంట పెట్టుకోండి!

ఒంటరి ప్రయాణంలో దారి తప్పినా, ఆపదలో ఉన్నా.. ఈ యాప్స్ క్షణాల్లో ఆదుకుంటాయి!

ఇదేం డిజైన్ భయ్యా! మార్కెట్‌ను షేక్ చేస్తున్న సోనీ ఇయర్‌బడ్స్

శాంసంగ్ నుంచి మరో అద్భుతం..గెలాక్సీ వాచ్ అల్ట్రా 2 పూర్తి రివ్యూ !

స్టోర్ల ముందు క్యూ కట్టాల్సిన పనిలేదు.. నిమిషాల్లో మీ చేతికి కొత్త iPhone 18 Pro, ఎలాగంటే?

Big Stories

Advertisement
×