BigTV English

France: ఫ్రాన్స్‌ ఫస్ట్ విక్టరీ

France: ఫ్రాన్స్‌ ఫస్ట్ విక్టరీ

ఫిఫా వరల్డ్‌కప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఫ్రాన్స్ శుభారంభం చేసింది. ఆస్ట్రేలియాపై 4–1 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. ఫ్రాన్స్‌ ఆటగాడు ఒలివియర్‌ జిరూడ్‌ రెండు గోల్స్‌ కొట్టగా… అడ్రియన్‌ రాబియోట్‌, ఎంబాపె చెరో గోల్ వేశారు. ఇక ఆస్ట్రేలియా తరఫున ఏకైక గోల్‌ను క్రెయిగ్‌ గుడ్‌విన్‌ సాధించాడు.


వరుసగా ఐదో వరల్డ్‌కప్‌లో ఆడుతున్న ఆస్ట్రేలియా… ఆట తొమ్మిదో నిమిషంలోనే గోల్ కొట్టింది. లెకీ అందించిన పాస్‌ను క్రెయిగ్‌ గుడ్‌విన్‌ గోల్ పోస్టులోకి పంపడంతో… ఆస్ట్రేలియా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. దాంతో మరో సంచలన ఫలితం తప్పదేమో అని అనుకున్నారు… ఫ్యాన్స్. కానీ వెంటనే తేరుకున్న ఫ్రాన్స్‌ ఆటగాళ్లు సమన్వయంతో ఆడుతూ ఆస్ట్రేలియాపై పైచేయి సాధించారు. ఐదు నిమిషాల వ్యవధిలోనే రెండు గోల్స్‌ వేసి… 2–1 ఆధిక్యంలోకి దూసుకెళ్లారు.

ఆట 27వ నిమిషంలో థియో హెర్నాండెజ్‌ కొట్టిన షాట్‌ను అందుకున్న ఆడ్రియన్‌ రాబియోట్‌… ఆస్ట్రేలియా గోల్‌కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ హెడర్‌ షాట్‌తో గోల్ చేశాడు. ఇక 32వ నిమిషంలో ఎడమ వైపు నుంచి రాబియోట్‌ అందించిన పాస్‌ను ఒలివియర్‌ జిరూడ్‌ గోల్‌ పోస్ట్‌లో వేశాడు. తొలి అర్ధభాగం ముగిసేసరికి ఫ్రాన్స్‌ 2–1 ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధభాగంలోనూ ఆస్ట్రేలియాకు ఫ్రాన్స్‌ ఛాన్స్ ఇవ్వలేదు. మళ్లీ మూడు నిమిషాల వ్యవధిలోనే రెండు గోల్స్‌ కొట్టి… ఆస్ట్రేలియా కోలుకునే అవకాశం లేకుండా చేసింది. చివరికి 4-1 గోల్స్ తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది… ఫ్రాన్స్. ఈ గెలుపుతో ఫ్రాన్స్‌ జట్టుకు మూడు పాయింట్లు లభించాయి. ఆస్ట్రేలియాపై రెండు గోల్స్‌ చేసిన ఒలివియర్‌ జిరూడ్‌… 51 గోల్స్ తో ఫ్రాన్స్‌ తరఫున అత్యధిక గోల్స్‌ చేసిన ప్లేయర్‌గా థియరీ హెన్రీ రికార్డును సమం చేశాడు. ఫిఫా చరిత్రలో ఒక జట్టు వరుసగా రెండు వరల్డ్‌కప్‌లలో విజేతగా నిలిచి 60 ఏళ్లు కావడంతో… బ్రెజిల్‌ పేరుతో ఉన్న ఆ రికార్డును డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ కూడా అందుకోవాలని… ఆ జట్టు అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×