BigTV English

FIFA: స్పెయిన్‌ సూపర్ షో

FIFA: స్పెయిన్‌ సూపర్ షో

FIFA : ఫిఫా వరల్డ్‌కప్‌లో మరో ఎదురులేని విజయం నమోదైంది. మాజీ ఛాంపియన్ స్పెయిన్… కోస్టారికాపై 7–0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. ఒక వరల్డ్‌కప్‌లో స్పెయిన్ ఏడు గోల్స్ చేయడం ఇదే తొలిసారి కాగా… వరల్డ్‌కప్‌ చరిత్రలోనూ ఆ జట్టుకు ఇదే అతిపెద్ద విజయం. ఈ గెలుపుతో, టైటిల్‌ ఫేవరెట్స్‌గా భావిస్తున్న జట్లలో తమదీ ఒక జట్టు అని స్పెయిన్‌ ప్రత్యర్థులందరికీ హెచ్చరికలు పంపింది.


గ్రూప్‌-ఇలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో 2010 వరల్డ్‌కప్‌ విజేత స్పెయిన్‌ను కోస్టారికా ఏ మాత్రం ఎదుర్కోలేకపోయింది. కోస్టారికాపై స్పెయిన్‌ సంపూర్ణ ఆధిపత్యం చలాయించింది. ఆట మొత్తం సమయంలో బంతి 82 శాతం స్పెయిన్‌ ఆధీనంలో ఉండటం… ఆ జట్టు ఆధిపత్యానికి నిదర్శనం. ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌ లక్ష్యంగా స్పెయిన్‌ ఎనిమిది షాట్‌లు కొట్టగా… కోస్టారికా ఒక్కసారి కూడా స్పెయిన్‌ గోల్‌పోస్ట్‌ లక్ష్యంగా షాట్‌ కొట్టలేకపోయింది. స్పెయిన్‌ ఆటగాళ్లు ఏకంగా 1,043 పాస్‌లు పూర్తి చేశారు. ప్రపంచకప్‌ చరిత్రలో ఏ జట్టు కూడా ఒక మ్యాచ్‌లో ఇన్ని పాస్‌లు పూర్తి చేయలేదు. కోస్టారికా ఆటగాళ్లు మాత్రం 231 పాస్‌లతో సరిపెట్టుకున్నారు.

అంతేకాదు… ప్రపంచకప్‌ మ్యాచ్‌లో తొలి అర్ధభాగంలో స్పెయిన్‌ మూడు గోల్స్‌ చేయడం 1934 తర్వాత ఇదే తొలిసారి. 1934లో బ్రెజిల్‌పై తొలి అర్ధభాగంలో స్పెయిన్‌ మూడు గోల్స్‌ సాధించింది. కోస్టారికాపై డానీ ఓల్మో 11వ నిమిషంలో, మార్కో అసెన్‌సియో 21వ నిమిషంలో గోల్స్ వేయగా… ఫెరాన్‌ టోరెస్‌ 31వ నిమిషం గోల్ వేశాడు. దాంతో తొలి అర్ధభాగం ముగిసే సరికే స్పెయిన్ 3-0 గోల్స్ తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. రెండో ఆర్ధభాగంలో స్పెయిన్ ఆటగాళ్లు మరింత దూకుడుగా ఆడారు. 54వ నిమిషంలో ఫెరాన్ టోరెన్ మరో గోల్ చేశాడు. 74వ నిమిషంలో గావి, 90వ నిమిషంలో కార్లోస్‌ సోలెర్‌, 92వ నిమిషంలో అల్వారో మొరాటా ఒక్కో గోల్‌ చేశారు. దాంతో ఆట ముగిసే సమయానికి 7-0 గోల్స్ తేడాతో ఆధిక్యంలో నిలిచిన స్పెయిన్… కోస్టారికాపై ఘన విజయం సాధించింది.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×