Hanuma Vihari : టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (Team India vs. England) మధ్య టి20 సిరీస్ మొన్నటితో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ లో 4-0 తేడాతో కైవసం చేసుకుంది ఇంగ్లాండ్. ఇప్పటికే ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్ అయిన టీమిండియా… ఇప్పుడు ఇంగ్లాండ్ చేతిలో కూడా టి20 సిరీస్ లో వైట్ వాష్ కావలసి వచ్చింది. ఈ క్రమంలో గౌతమ్ గంభీర్ పదవిపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అతని వల్లే టీమ్ ఇండియా సర్వనాశనం అయిందని క్రికెట్ అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై ( head coach Gautam Gambhir) హనుమ విహారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన శిష్యులకే అవకాశాలు ఇచ్చి, టీమిండియాను నాశనం చేస్తున్నాడని గంభీర్ పై హనుమ విహారి (Hanuma Vihari ) సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read: Munaf Patel On Dhoni Hookah Party: నోరు ఉన్న ప్రతీ వెధవా
మాట్లాడటమే..ధోనీ ‘హుక్కా’ సీక్రెట్ పై మునాఫ్ సంచలనం
ఐర్లాండ్ అలాగే ఇంగ్లాండ్ చేతిలో టి20 సిరీస్ టీమ్ ఇండియా కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐసిసి టి20 ర్యాంకింగ్స్ లో కూడా టీమిండియా దిగజారి రెండో స్థానానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా వైఫల్యాన్ని గుర్తు చేస్తూ గంభీర్ ను టార్గెట్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ఇప్పటికే చాలా మంది గంభీర్ ను వ్యతిరేకించగా… తాజాగా హనుమ విహారి కూడా తన స్టైల్లో రియాక్ట్ అయ్యారు. గంభీర్ తనకు నచ్చిన వాళ్లను మాత్రమే టీమిండియా తరఫున ఆడిస్తున్నాడని ఆగ్రహించారు. టాలెంట్ ఉన్న.. లేకపోయినా, అవేవీ పట్టించుకోకుండా… తనకు శిష్యులుగా ఉన్నవాళ్లు జట్టులో ఉండేలా చూసుకుంటున్నాడని ఫైర్ అయ్యారు. వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా, తిలక్ వర్మ, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది క్రికెటర్లే ఉన్నారు.
వీళ్లను మాత్రమే అన్ని ఫార్మాట్స్ లో ఆడిస్తున్నాడని ఆగ్రహించారు. భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, కృనాల్ పాండ్యా, రసిక్ సలాం లాంటి క్రికెటర్లు అద్భుతంగా రాణించినప్పటికీ.. వాళ్లను కాదని పంజాబ్ కింగ్స్ లేదా గుజరాత్ టైటాన్స్ జట్టులో ఉన్న ప్లేయర్లకు మాత్రమే అవకాశాలు ఇచ్చి కుట్రకు తెర లేపుతున్నాడని ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే ఐర్లాండ్ అలాగే ఇంగ్లాండ్ చేతిలో టీమ్ ఇండియా చిత్తు అయిందని అసలు వాస్తవాలను బయట పెట్టారు. గౌతమ్ గంభీర్ ఇలాగే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే టీమిండియాను కాపాడడం కష్టమేనన్నారు. అతడు ఉన్నన్ని రోజులు టీమిండియా రిజల్ట్ ఇలాగే ఉంటుందని హెచ్చరించారు విహారి.
గౌతమ్ గంభీర్ స్థానంలో కొత్త కోచ్ ను నియామకం చేయాలని క్రికెట్ ఫ్యాన్స్ కూడా మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. టాలెంట్ ఉన్న వాళ్లకు అవకాశాలు రావడంలేదని… దీని అంతటికి గంభీర్ కారణమని ఫైర్ అవుతున్నారు. వెంటనే గంభీర్ ను పక్కకు పెట్టి , వివిఎస్ లక్ష్మణ్ లేదా ఇతర వ్యక్తులను హెడ్ కోచ్ గా నియామకం చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. మహేంద్ర సింగ్ ధోనీకి అవకాశం ఇస్తే బాగుంటుందని శ్రీశాంత్ లాంటి క్రికెటర్లు కూడా డిమాండ్ చేస్తున్నారు.