E-Paper
Advertisement

నా కళ్ళెదుటే మా నాన్న ప్రాధేయపడ్డారు.. కంటతడి పెట్టిస్తున్న భాగ్యశ్రీ కామెంట్స్!

నా కళ్ళెదుటే మా నాన్న ప్రాధేయపడ్డారు.. కంటతడి పెట్టిస్తున్న భాగ్యశ్రీ కామెంట్స్!
Advertisement

Bhagyashri: భాగ్యశ్రీ బోర్సే.. అద్భుతమైన నటనతో.. సరైన అవకాశం లభిస్తే తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధమని నిరూపించింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా నటించిన సినిమాలో భారతి పాత్ర పోషించి, అందరి దృష్టిని ఆకట్టుకుంది. ముఖ్యంగా భాగ్యశ్రీ అందంతోనే కాదు నటనతో కూడా అదరగొట్టెయ్యగలదు అని మరొకసారి నిరూపించింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొని ఎన్నో విషయాలను పంచుకున్న ఈమె.. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో కూడా పలు విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

నా కళ్ళెదుటే మా నాన్న ప్రాధేయపడ్డారు – భాగ్యశ్రీ

అందులో భాగంగానే జూలై 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన లెనిన్ సినిమా మూడు రోజుల్లోనే రూ.60 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి, రూ.100 కోట్ల దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో తనకు మంచి పేరు తీసుకొచ్చిన ఈ చిత్రానికి, ఈ చిత్రంలో అవకాశం కల్పించిన డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఇక ప్రస్తుతం సినిమా సక్సెస్ తో ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా తన చిన్ననాటి జ్ఞాపకాలను, కష్టాలను గుర్తు చేసుకొని అందరికి కంటతడి పెట్టించింది. ముఖ్యంగా తన కళ్లెదుటే తన తండ్రి ప్రాధేయపడడం, డబ్బు కోసం తాము పడిన తిప్పలు అన్నింటిని కూడా చెప్పుకొచ్చింది.

నేనేమీ స్టార్ కిడ్ కాదు – భాగ్యశ్రీ

Advertisement

ఇకపోతే లెనిన్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా తన చిన్ననాటి కష్టాలను ఒక ఇంటర్వ్యూలో గుర్తుచేసుకొని భావోద్వేగానికి గురైంది భాగ్యశ్రీ . ఆమె మాట్లాడుతూ.. “నేను స్టార్ కిడ్ ను కాదు.. మేమేమీ డబ్బున్న వాళ్ళం కాదు.. దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను. ఇద్దరు కూతుర్ల పోషణ కోసం మా నాన్న వేరొకరిని ఉద్యోగం అడుగుతూ ప్రాధేయ పడడం నా కళ్లారా చూసాను “అంటూ భావోద్వేగానికి లోనయ్యింది భాగ్యశ్రీ. తన చిన్ననాటి రోజుల్లో తమ పోషణకు తమ తండ్రి ఎన్ని కష్టాలు పడ్డారో చెప్పి.. ప్రతి మధ్యతరగతి కుటుంబానికి కనెక్ట్ అయ్యేలా తన బాధలను చెప్పుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది భాగ్యశ్రీ. ఇకపోతే దేవుడి దయ దలచి ఇప్పుడు ఆర్థికంగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం భాగ్యశ్రీ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

భాగ్యశ్రీ బోర్సే కెరియర్..

భాగ్యశ్రీ కెరియర్ విషయానికి వస్తే.. యారియాన్ 2 అనే చిత్రం ద్వారా హిందీ పరిశ్రమకు పరిచయమైన ఈమె.. ఆ తర్వాత రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇక చివరిగా రామ్ పోతినేనీతో ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా చేసింది. కానీ ఈ సినిమా ఈమెకు పెద్దగా వర్కౌట్ కాలేదు. కానీ ఈ సినిమా హీరో రామ్ తో ప్రేమలో పడినట్లు వార్తలు రాగా.. లెనిన్ సినిమా ప్రమోషన్స్ లో తాను నటించిన హీరోలందరికి పెళ్లయిందని, మిగిలింది ఒకే ఒక్కరు అతనితోనే అంటూ కామెంట్ చేసింది
ఇకపోతే ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా సమయం నుండే వీరిద్దరి మధ్య ప్రేమ నడుస్తోందని, ఇక అందుకు తగ్గట్టుగానే రామ్ తో తన పెళ్లి అన్నట్టుగా ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చింది అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

Advertisement

ALSO READ: సమంత ‘మా ఇంటి బంగారం’ అఫీషియల్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్!

Related News

విజయ్ లా పాలిటిక్స్ లోకి జూనియర్ ఎన్టీఆర్? జూలై 18న రాబోతున్న ఆ ‘ట్విస్ట్’ ఏంటి?

ఎక్కడ చూసినా ‘బాసింగ బలాలు’ మ్యాజిక్కే..నాలుగు వారాల్లోనే ఊహించని రికార్డు!

లెనిన్ ని ఆకాశానికి ఎత్తేసిన చిరు …ఇక కలెక్షన్ల వేట షురూ అయ్యేనా ?

Rashmika Mandanna : ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. రష్మిక సినిమాలకు గుడ్ బై చెప్తుందా..?

సాయి పల్లవికి పోటీగా బాలయ్య కూతురు.. ‘సారంగదరియా’ పాటకు తేజస్విని ఊరమాస్ స్టెప్పులు!

తిరుపతినైనా ఎదిరిస్తా.. నిన్ను మాత్రం వదలను మంగ.. ‘శ్రీనివాస మంగాపురం’ ట్రైలర్!

పవన్ కళ్యాణ్ కి శస్త్రచికిత్స పూర్తి.. వైద్యులు ఏమన్నారంటే?

Big Stories

Advertisement
×