E-Paper
Advertisement

మనుషులను బంగారంగా మార్చే శాపం… ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగు సినిమా

మనుషులను బంగారంగా మార్చే శాపం… ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగు సినిమా
Advertisement

Musical Fantasy Comedy Drama on OTT : భూమిపై చేయకూడని పనులు చేస్తూ మన నాశనాన్ని మనమే కొనితెచ్చుకుంటున్నాము. ప్రకృతి విలయతాండవం చేస్తే ఎలా ఉంటుందో మనం చాలా సినిమాల్లో ఇప్పటికే చూశాం. కానీ అది ఈ మ్యూజికల్ వండర్ లా మాత్రం ఉండి ఉండదు. సినిమా మొత్తం శాపం, మైనింగ్, చెట్టు, ఆ చెట్టును పూజించే అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఇదంతా వినడానికి హాలీవుడ్ సినిమాలాగే ఉన్నా, ఇది తెలుగు సినిమానే. ఆ సినిమా పేరే ‘సింగ్ గీతం’ (Sing Geetham). పాటలతో మాట్లాడే వింత ఊరు చుట్టూ ఈ సినిమా స్టోరీ తిరుగుతుంది. 2026లో విడుదలైన ఈ క్రేజీ థ్రిల్లర్ ఏ ఓటీటీలో విడుదల కానుంది ? స్టోరీ ఏంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

కథ అంతా ‘కుబేరపురం’ అనే మైనింగ్ గ్రామం చుట్టూ తిరుగుతుంది. కార్పొరేట్ అత్యాశ వల్ల ఆ గ్రామంలో ప్రకృతి మొత్తం నాశనమైపోతుంది. ఆ ఊరిలో చివరిగా మిగిలిన ఏకైక పవిత్రమైన చెట్టును గౌరి అనే అమ్మాయి తన తల్లిలా చూసుకుంటూ, ఆ చెట్టు దగ్గరే నివసిస్తూ ఉంటుంది. ఆ చెట్టు ఆమెతో సంగీతం ద్వారా మాట్లాడుతుంది. ఆమె జీవితం చెట్టుతోనే ముడిపడి ఉంటుంది. మరోవైపు జైలు నుండి విడుదలవుతాడు ప్రతాప్ అనే మన హీరో. తన తండ్రికి వారసత్వంగా వచ్చిన భూమి ఈ ఊరిలోనే ఉందని తెలుసుకుని అదే ఊరికి వస్తాడు. అక్కడ అతను గౌరిని చూసి ప్రేమలో పడతాడు.

Advertisement

అయితే ఆ ఊరిలో ఉన్న బంగారు గనులను తవ్వడం కోసం ఒక క్రూరమైన బిజినెస్‌ వుమెన్ ఆ చివరి చెట్టును కూడా కొట్టేయాలని చూస్తుంది. ప్రతాప్ ఆ చెట్టును కాపాడటానికి ప్రయత్నిస్తాడు. కానీ అత్యాశతో ఆ చెట్టును కూల్చేస్తారు. దాంతో ఆ ప్రకృతికి ఆగ్రహం వచ్చి ఆ ఊరిపై మిస్టీరియస్ శాపం పడుతుంది. ఆ శాపం వల్ల ఊరి ప్రజలందరూ సాధారణంగా మాట్లాడే శక్తిని కోల్పోతారు. తమ నోటి నుండి వచ్చే ప్రతి మాటను, భావాన్ని కేవలం పాటల ద్వారా మాత్రమే వ్యక్తపరచాల్సి వస్తుంది. ఇక్కడి నుంచి సినిమా పూర్తిగా మ్యూజికల్‌గా మారుతుంది. ప్రతి సంభాషణ, భావం పాటల ద్వారానే వ్యక్తమవుతుంది.

ఈ వింత శాపం వల్ల ఊరి ప్రజల జీవితాలు పూర్తిగా మారిపోతాయి. ప్రతాప్, గౌరి ఈ శాపం నుంచి ఊరిని విముక్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ ప్రయాణంలో ప్రకృతిని గౌరవించడం ఎంత ముఖ్యమో, మనుషుల అత్యాశ ఎంత హానికరమో ఊరి ప్రజలందరూ నేర్చుకుంటారు. సంగీతం ద్వారా వ్యక్తమయ్యే భావాలు, పాటలు, డాన్స్ సీన్స్ సినిమాను హృదయానికి హత్తుకునేలా చేస్తాయి. మరి ఇంతకీ ఈ శాపం నుంచి ఊరి ప్రజలంతా ఎలా విముక్తి పొందారు ? అసలు అక్కడ మనుషులు బంగారంగా మారడానికి కారణం ఏంటి ? చివరికి వచ్చే క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటి ? అన్నది తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే.

Advertisement

Aslo Read : చంద్రుడిని పేల్చేసే బోన్ చిల్లింగ్ సై-ఫై థ్రిల్లర్… క్లైమాక్స్ ట్విస్ట్ పీక్స్ అంతే

ఓటీటీలో ట్రెండింగ్ లో…

‘సింగ్ గీతం’ సినిమా కేవలం కామెడీ డ్రామా కాదు. ఇదొక అద్భుతమైన మ్యూజికల్ ఫాంటసీ. దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ సినిమాకు బ్యాక్‌బోన్‌గా నిలిచింది. ఈ చిత్రం చూస్తుంటే మనం ప్రకృతిని ఎంత గౌరవించాలో, సంగీతం ఎంత శక్తివంతమైన భాష అనేది అర్థమవుతుంది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతున్న వినూత్న మ్యూజికల్ ఫాంటసీ కామెడీ డ్రామా ఈ సినిమా. ‘పుష్పక విమానం’, ‘ఆదిత్య 369’ వంటి క్లాసిక్స్‌ను అందించిన 94 ఏళ్ల లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దాదాపు 40 ఏళ్లుగా తన గుండెల్లో దాచుకున్న డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. నాగ్ అశ్విన్ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ ప్రయోగాత్మక చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

Tags

Related News

This Week OTT Releases : ఈ వారం ఓటీటీ సినిమాలు.. మా ఇంటి బంగారం టు ది డెవిల్ డోంట్ మిస్…

అవుటర్ స్పేస్ లో అనాథలు… ఒక్కో యాక్షన్ సీక్వెన్స్ కు గూస్ బంప్స్

చంద్రుడిని పేల్చేసే బోన్ చిల్లింగ్ సై-ఫై థ్రిల్లర్… క్లైమాక్స్ ట్విస్ట్ పీక్స్ అంతే

ఇక్కడ బ్రతకాలంటే పక్కనే ఉన్నోడిని చంపాల్సిందే… క్రేజీ కొరియన్ ఫాంటసీ థ్రిల్లర్

కాంక్రీట్ గోడలో యువతి శవం… పుట్టిన ప్రతీ ఆడపిల్లను క్రూరంగా చంపే ముఠా

అలాంటి అమ్మాయిల రూపంలో లక్ష్మీదేవి… మోస్ట్ అండర్రేటెడ్ మాస్టర్ పీస్

సమంత ‘మా ఇంటి బంగారం’ అఫీషియల్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్!

Big Stories

Advertisement
×