E-Paper
Advertisement

ధోని ఒక్క‌సారి నోరు విప్పితే, వాళ్ల జీవితాలే రోడ్డున ప‌డ‌తాయి

ధోని ఒక్క‌సారి నోరు విప్పితే, వాళ్ల జీవితాలే రోడ్డున ప‌డ‌తాయి
Advertisement

Munaf Patel On Ms Dhoni:  టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని (Ms Dhoni) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2007 సమయంలో టీమిండియా కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న మహేంద్రుడు.. మూడు ఐసీసీ ట్రోఫీలు అందించాడు. దిక్కు తోచని స్థితిలో ఉన్న టీమిండియా జట్టును.. వరల్డ్ నెంబర్ వ‌న్ చేశాడు. ఒకప్పటి ఆస్ట్రేలియా జట్టును సైతం, వాళ్ల గడ్డపై మట్టి కరిపించాడు. అబ్బో చెప్పుకుంటూ పోతే ఎన్నో విజయాలు ధోని సాధించి పెట్టాడు. అయితే అలాంటి మహేంద్ర సింగ్ ధోనీ పై రిటైర్మెంట్ ప్రకటించిన చాలామంది మాజీ క్రికెటర్లు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ధోని పై ఆరోపణలు చేస్తున్నారు. అయితే అలాంటి వాళ్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ మునాఫ్ పటేల్ (Munaf Patel). చాలా మంది మహేంద్రసింగ్ ధోనిని ఉద్దేశించి విమర్శలు చేస్తున్నారని ఆగ్రహించారు. కానీ ఒక్కసారి ధోని నోరు విప్పితే… రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్లు రోడ్డున పడడం గ్యారంటీ అని వార్నింగ్ ఇచ్చారు. కానీ ధోని అలా చేయకుండా సైలెంట్ గా ఉంటున్నాడని పేర్కొన్నారు. కానీ ఏదో ఒక రోజు ధోని, వాళ్లందరి భరతం పడతాడని హెచ్చరించారు. దీంతో మునాఫ్ ప‌టేల్ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ గా మారాయి.

Also Read: Irfan Pathan Comments On Team India Head Coach  చెత్త వెధ‌వ‌లను గంభీర్ తీసుకొచ్చాడు..అందుకే ల‌క్ష్మ‌ణ్ ను వెంట‌నే కోచ్ గా నియామకం చేయండి

ధోని ఒక్క‌సారి నోరు విప్పితే, వాళ్ల జీవితాలే రోడ్డున ప‌డ‌తాయి

Advertisement

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పై రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్లు చాలామంది కారు కూతలు కూస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి క్రమంలో ధోనీపై మునాఫ్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఇర్ఫాన్ పఠాన్ ను ఉద్దేశించి ఫైర్ అయ్యారు. హుక్కా కొడితేనే, టీమిండియాలో అవకాశాలు ధోని ఇచ్చేవాడని ఇర్ఫాన్ అనవసరంగా తప్పుడు కూతలు కూసారని ఆగ్రహించారు. అందులో ఎలాంటి వాస్తవం లేదని తెలిపారు. ధోని తన రూములో ఏదైనా చేసుకోవచ్చు… కానీ మరొకరిని బలవంతం పెట్టేవాడు కాదని తెలిపారు.

కుర్ర క్రికెటర్లకు… టాలెంట్ ఉన్న వాళ్లకు మాత్రమే అవకాశం ఇచ్చాడని స్పష్టం చేశారు. రిటైర్మెంట్ ప్రకటించక ముందు జట్టులో ధోని కెప్టెన్ గా ఉన్నప్పుడు మాత్రం ఈ వెధవలు ఎవరూ మాట్లాడలేదని ఆగ్రహించారు. ప్రతి ఒక్కడు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత… ధోని పై విషం కట్టడం మొదలుపెట్టారని ఫైర్ అయ్యారు. అయితే వీటన్నిటిని మహేంద్రసింగ్ ధోని చాలా ఓర్పుగా వింటున్నాడని తెలిపారు. ఏదో ఒక రోజు ధోని కూడా నోరు విప్పుతాడని… అప్పుడు రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ల బండారం బయటపడుతుందని గౌతమ్ గంభీర్ ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. దీంతో ధోనిపై మునాఫ్ పటేల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Advertisement

 

 

Also Read:  Munaf Patel On Dhoni Hookah Party: నోరు ఉన్న ప్ర‌తీ వెధ‌వా
మాట్లాడ‌ట‌మే..ధోనీ ‘హుక్కా’ సీక్రెట్ పై మునాఫ్ సంచ‌ల‌నం

 

 

Related News

సారా టెండూల్క‌ర్ తో బాబ‌ర్ ఆజం రిలేష‌న్‌? వివాద‌స్ప‌ద పోస్ట్ వైర‌ల్

గంభీర్ పోస్టుకు ఎసరు పెట్టిన బ్రెండన్ మెక్‌కల్లమ్..?

బ్రెండన్ మెక్‌కల్లమ్ పై వేటు…ఇంగ్లాండ్ కోచ్ గా టీమిండియా క్రికెట‌ర్ ?

చెత్త వెధ‌వ‌లను గంభీర్ తీసుకొచ్చాడు..అందుకే ల‌క్ష్మ‌ణ్ ను వెంట‌నే కోచ్ గా నియామకం చేయండి

ఇది రివెంజ్ టైమ్..ఇంగ్లాండ్ ప్లేయ‌ర్ల ప్యాంట్లు త‌డిచిపోవాలి

ఇంకా అయిపోలేదు..వన్డేల్లో కూడా వైట్ వాష్ చేస్తాం

న‌న్ను కాద‌నుకున్నారు…ఇక అనుభ‌వించండి, గంభీర్ కు సూర్య కౌంట‌ర్ !

Big Stories

Advertisement
×