McCullum Vs Gambhir: టీమ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య రేపటి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య టి20 సిరీస్ షురూ అయింది. ఇందులో టీమిండియా వైట్ వాష్ అయింది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ పై అధికారం తీర్చుకునేందుకు…గిల్ సేన సిద్ధం అవుతోంది. ఇలాంటి నేపథ్యంలో ఇంగ్లాండ్ క్రికెట్ జట్టులో భారీ కుదుపు నెలకొంది. ఆ జట్టుకు సంబంధించిన కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ ( Brendon McCullum )… టెస్ట్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు ఇంగ్లీష్ క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన చేసింది. బ్రెండన్ మెక్‌కల్లమ్ తప్పుకున్న నేపథ్యంలో గంభీర్ పోస్టుకు ఎసరు వచ్చినట్లు సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. బ్రెండన్ మెక్‌కల్లమ్ తరహాలోనే గంభీర్ (Gambhir) పదవి తొలగించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
బజ్ బాల్ కాన్సెప్ట్ తో టెస్ట్ క్రికెట్ లో సమూల మార్పులు చేసేందుకు ఇంగ్లాండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ చేసిన ప్రయత్నాలు అంతా ఇంతా కాదు. అయితే ఈ కాన్సెప్ట్ కొన్ని సిరీస్ లలో సక్సెస్ కాగా… యాషెస్ లాంటి సిరీస్ లలో విఫలమైంది. ఈ క్రమంలో టెస్టుల్లో ఇంగ్లాండ్ చెత్త ప్రదర్శన కూడా కనబరిచింది. టి20 లో అలాగే వన్డేలో బ్రెండన్ మెక్‌కల్లమ్ కు నెగిటివ్ మార్కులు పడలేదు కానీ… టెస్టుల్లో అతని ప్రతిభ సరిగ్గా లేదని ట్రోలింగ్స్ మాత్రం వచ్చాయి. ఈ క్రమంలోనే టెస్ట్ బాధ్యతల అతడిని తప్పిస్తూ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది.
టెస్ట్ బాధ్యతల నుంచి బ్రెండన్ మెక్‌కల్లమ్ ను ఇంగ్లాండు క్రికెట్ బోర్డు తొలగించింది. ఈ క్రమంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పోస్ట్ కు ఎసరు వచ్చింది. టెస్టుల్లో సరిగ్గా ప్రదర్శన లేని నేపథ్యంలో బ్రెండన్ మెక్‌కల్లమ్ పై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు, వేటు వేసిన నేపథ్యంలో గౌతమ్ గంభీర్ పై బీసీసీఐ ఎందుకు ? చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. రెండు టి20 సిరీస్ లలో టీమిండియా వైట్ వాష్ అయిందని… అలాగే చెత్త సెలక్షన్ చేసినందుకు గౌతమ్ గంభీర్ ను తప్పించాల్సిందేనని డిమాండ్లు వినిపిస్తున్నాయి. వెంటనే గౌతమ్ గంభీర్ పై వేటు వేయాలని కూడా మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. వీవీఎస్ లక్ష్మణ్, మహేంద్ర సింగ్ ధోని ఇద్దరిలో ఎవరో ఒకరిని టీమిండియా హెడ్ కోచ్ గా నియామకం చేయాలని కూడా కోరుతున్నారు అభిమానులు. మొత్తానికి బ్రెండన్ మెక్‌కల్లమ్ కారణంగా గౌతమ్ గంభీర్ పోస్ట్ కు ఎసరు వచ్చినట్లు సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
Also Read: Munaf Patel On Dhoni Hookah Party: నోరు ఉన్న ప్రతీ వెధవా
మాట్లాడటమే..ధోనీ ‘హుక్కా’ సీక్రెట్ పై మునాఫ్ సంచలనం