Harbhajan Singh: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చివరి దశకు వచ్చింది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే ప్లే ఆఫ్స్ జట్లు కూడా ఖరారు అయ్యాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ అలాగే రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ కు దూసుకువెళ్లాయి. ఇలాంటి క్రమంలో మహేంద్ర సింగ్ ధోనిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు హర్భజన్ సింగ్. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిపోయిన తర్వాత మహేంద్ర సింగ్ ధోనికి ( MS Dhoni ) కోపం కట్టలు తెంచుకుందని, ఈ క్రమంలో టీవీని (MS Dhoni Broke the TV ) కూడా బద్దలు కొట్టినట్లు షాకింగ్ నిజాలను బయటపెట్టారు. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న హర్భజన్ సింగ్, ఈ విషయాన్ని బహిర్గతం చేశారు. దీంతో హర్భజన్ సింగ్ (HARBHAJAN SINGH) చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో చెన్నై సూపర్ కింగ్స్ అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ అంటే ప్రపంచ దేశాలు ఆత్రుతగా చూస్తాయి. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అన్నట్లుగానే ఈ రెండు జట్లు తలపడతాయి. బెంగళూరులో విరాట్ కోహ్లీ ఉంటే.. చెన్నైలో మహేంద్ర సింగ్ ధోని ఉంటాడు. ఇక ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగితే అభిమానుల మధ్య కూడా సోషల్ మీడియా వేదికగా పెద్ద వార్ జరుగుతుంది. అయితే 2024 మే 18 వ తేదీన బెంగళూరు వర్సెస్ చెన్నై మధ్య మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా బెంగళూరు చేతిలో దారుణంగా ఓడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్. ఈ దెబ్బకు ప్లే ఆఫ్స్ నుంచి కూడా నిష్క్రమించింది చెన్నై సూపర్ కింగ్స్. ఆ సమయంలో కెప్టెన్ గా ఉన్న మహేంద్ర సింగ్ ధోని తీవ్ర అసహనానికి గురైనట్లు హర్భజన్ సింగ్ షాకింగ్ నిజాలను ఉప్పంచుకున్నారు. బెంగళూరు చేతిలో ఓడిపోయినందుకు గాను కోపంతో డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న టీవీ స్క్రీన్ ను కూడా మహేంద్రసింగ్ ధోని పగలగొట్టినట్లు షాకింగ్ నిజాలను బయటపెట్టారు.
తన చేతితో బలంగా టీవీని గుద్ది పగలగొట్టాడట. ఆ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ధోని వెళ్లిన విషయాన్ని కూడా హర్భజన్ సింగ్ గుర్తు చేశారు. మిస్టర్ కూల్ గా పేరు తెచ్చుకున్న మహేంద్రసింగ్ ధోని.. తొలిసారిగా అంత కోపంగా ఉండడం చూశానని వ్యాఖ్యానించారు హర్భజన్ సింగ్. అయితే హర్భజన్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం కూడా స్పందించింది. గతంలోనే ఈ వార్తలు బయటకు రాగా… తాజాగా టీవీ పగలగొట్టిన అంశం తెరపైకి వచ్చిన నేపథ్యంలో తీవ్రంగా ఖండించింది చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం. హర్భజన్ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొంది. అది ముమ్మాటికి అబద్ధమని… మహేంద్ర సింగ్ ధోని ఎలాంటి వస్తువులను పగలగొట్టలేదని క్లారిటీ ఇచ్చింది. ఫేక్ న్యూస్ అస్సలు నమ్మకూడదని కోరింది చెన్నై సూపర్ కింగ్స్.
Shocking reveal from Harbhajan Singh
“MS Dhoni Broke the TV in anger after losing to RCB on 18th May in the dressing Room.” 🤯 pic.twitter.com/4eSzVjdHio
— Arun Patil (@Arun_Patil17) May 24, 2026