Hardik-Ananya : టీమిండియా స్టార్ ఆల్ రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా కి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా పాండ్యా తన భార్య నటాషాకు అధికారికంగా విడాకులు ఇచ్చిన తరువాత సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. హార్దిక్ పాండ్యా.. అనన్య పాండేతో ప్రేమలో పడ్డారనే గతంలో రూమర్స్ వినిపించాయి. తాజాగా వీరిద్దరూ కలిసి దుబాయ్ లో ఎంజాయ్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో ఫొటోలు దర్శనమిచ్చాయి. దీంతో నెటిజన్లు వీరి ఫొటోలపై రకరకాలుగా స్పందించడం గమనార్హం.
Also Read : Thalapathy Vijay : శ్రీలంకలోనూ హీరో విజయ్ హవా… మ్యాచ్ జరుగుతుండగా అదిరిపోయే సాంగ్స్
నెటిజన్లు క్రేజీ పోస్టులు..
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ మూవీతో టాలీవుడ్ కి అడుగుపెట్టింది బ్యూటీ అనన్య పాండే. ఈ సినిమాలో అనన్య.. విజయ్ దేవరకొండ సరసన మెప్పించింది. ఈ చిత్రం డిజాస్టర్ కావడంతో ఆ తరువాత ఆమెకు టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ బాలీవుడ్ లో మాత్రం పలు సినిమాలతో బిజీగానే గడుపుతోంది. ఇటీవల అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహలో కూడా సందడి చేసింది ఈ ముద్దుగుమ్మ. బారాత్ వేడుకల్లో రణ్ వీర్ సింగ్, హార్దిక్ పాండ్యాలతో కలిసి చిందులు కూడా వేసింది. ఇక ఈ పెళ్లిలో ఏర్పడిన పరిచయమో ఏమో కానీ.. అప్పటి నుంచి సోషల్ మీడియాలో హార్దిక్ పాండ్యాను ఫాలో అవుతూ వస్తోంది. హర్దిక్ పాండ్యా సైతం అనన్యను ఫాలో అవుతూనే ఉన్నారు. వీరిద్దిరూ కలిసి బరాత్ లో డ్యాన్స్ చేస్తూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. సోషల్ మీడియాలో ఒకరికొకరూ ఫాలో చేసుకోవడంతో నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారా..? అంటూ క్రేజీ పోస్టులు పెడుతున్నారు.
ఆ ఫొటోలు ఫేక్..
ముఖ్యంగా హార్దిక్ పాండ్యా తన భార్య నటషా స్టాంకోవిచ్ తో పరస్పర అంగీకారంతోనే విడిపోయినట్టు వెల్లడించారు. అదేవిధంగా అనన్య పాండే సైతం తన బాయ్ ఫ్రెండ్ ఆదిత్య రాయ్ కపూర్ తో బ్రేకప్ చెప్పేసింది. ఈ విషయాన్ని అధికారికంగా మాత్రం వెల్లడించలేదు. ఇదిలా ఉంటే.. హార్దిక్ పాండ్యా T-20 2024 వరల్డ్ కప్ కి ముందు నిత్యం వార్తలో నిలిచేవాడు. భార్య నటాషా స్టాంకోవిచ్ కి విడాకులు ఇవ్వడంతో నిత్యం పాండ్యా గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉండేది. ఇక అదే సమయంలో ఐపీఎల్ లో గుజరాత్ నుంచి ముంబై ఇండియన్స్ కి వచ్చేసి ఈ ఆల్ రౌండర్.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంలో MI కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్నాడు. దీంతో రోహిత్ శర్మ అభిమానులతో పాటు కొందరూ ముంబై అభిమానుల నుంచి కూడా ట్రోలింగ్స్ కి గురయ్యాడు. ఇక ఇవన్నీ తట్టుకొని ప్రపంచ కప్ లో అదరగొట్టారు. భారత్ వరల్డ్ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. తాజాగా దుబాయ్ లో అనన్య పాండే తో ఎంజాయ్ చేస్తున్నాడనే ఫొటోలు వైరల్ అయ్యాయి. అయితే అవి వాస్తవానికి AI తో క్రియేట్ చేసిన ఫొటోలుగా తెలుస్తోంది. వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలు కావని.. అవి ఫేక్ ఫొటోలు అని సమాచారం.
https://www.facebook.com/share/168qXNMBfR/