E-Paper
Advertisement

Thalapathy Vijay : శ్రీలంకలోనూ హీరో విజయ్ హవా… మ్యాచ్ జరుగుతుండగా అదిరిపోయే సాంగ్స్

Thalapathy Vijay :  శ్రీలంకలోనూ హీరో విజయ్ హవా… మ్యాచ్ జరుగుతుండగా అదిరిపోయే సాంగ్స్
Advertisement

Thalapathy Vijay :   సాధారణంగా సినిమాలకు, క్రికెట్ కి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉండే విషయం తెలిసిందే. భారతీయ సినీ స్టార్స్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అవుతున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి కారణంగా ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ పేర్లు ప్రపచంలో మారు మ్రోగిపోయాయి. వీరి సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా విడుదలవ్వడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా విడుదలవ్వడం.. భారీగా కాసులు రావడంతో ఫేమస్ అవుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా క్రీడాకారులు రాణించిన వారు ఎంత ఫేమస్ అవుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. టీమిండియా క్రికెటర్లు ఎంత ఫేమస్ అవుతారో అందరికీ తెలిసిందే.

Also Read : MS Dhoni : ధోని ఏది చేసిన ఇండియా కోసమే… ఆర్మీ కూడా తలవంచాల్సిందే !

Advertisement

శ్రీలంకలో విజయ్ హావా..

శ్రీలంకలో జరుగుతున్న మ్యాచ్ లో తమిళనాడు హీరో విజయ్ హవా కనిపిస్తోంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో విజయ్ దళపతి సినిమాలకు సంబంధించిన పాటలు వేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ప్రస్తుతం శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య తొలి 20 మ్యాచ్ లో ఈ సాంగ్ వినిపించారు. రేపు రెండో టీ-20 మ్యాచ్ జరుగనుంది. తొలి టీ-20 మ్యాచ్ లో శ్రీలంక జట్టు బంగ్లాదేశ్ ని చిత్తు చేసింది. పల్లెకలె వేదికగా జరిగిన తొలి టీ-20లో 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ను ఓడించింది. 155 పరుగుల లక్ష్యాన్ని లంకేయులు కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 19 ఓవర్లలోనే ఛేధించారు. శ్రీలంక ఓపెనర్ కుశాల్ మెండీస్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడటంతో విజయం సునాయసం అయింది. మెండిస్ 51 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్ లతో 73 పరుగులు చేశాడు.

Advertisement

బంగ్లా ను చిత్తు చేసిన లంక

ఇక అతనితో పాటు మరో ఓపెనర్ పాతూమ్ నిస్సాంక 16 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో 42 పరుగులు చేసి మెరిపించాడు. ఇక బంగ్లాదేశ్ బౌలర్లలో మెహదీ మిరాజ్, రిషాద్ హోస్సెస్ తలా వికెట్ సాధించారు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బ్యాటర్లలో పర్వే హుస్సెన్ ఎమోన్ 38 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మహ్మద్ నయిమ్ 32, మిరాజ్ 29 రాణించారు. శ్రీలంక బౌలర్లలో మహేష్ తీక్షణ రెండు, వాండర్సే, షనక, తుషారా తలో వికెట్ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ-20 జులై 13న దంబుల్లా వేదిక గా జరుగనుంది. ఇప్పటికే వన్డే, టెస్ట్ సిరీస్ లను శ్రీలంక సొంతం చేసుకుంది. ఇక టీ-20 మ్యాచ్ లను కూడా సొంతం చేసుకునేలా కనిపిస్తోంది. బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్ లో తమిళనాడు కి చెందిన విజయ్ దళపతి సాంగ్స్ స్టేడియంలో మారు మ్రోగుతున్నాయి. ఐపీఎల్ మ్యాచ్ జరిగిన సమయంలో కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ వేళలో పలు తెలుగు సాంగ్స్ వైరల్ అవుతున్నాయి.

Related News

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

Big Stories

Advertisement
×