BigTV English

IND VS ENG: మూడో టెస్ట్ టీమిండియా ఆలౌట్..స్కోర్లు సమం.. రాహుల్, జడేజా పోరాటం.. 3వ రోజు హైలైట్స్ ఇవే

IND VS ENG: మూడో టెస్ట్ టీమిండియా ఆలౌట్..స్కోర్లు సమం.. రాహుల్, జడేజా పోరాటం.. 3వ రోజు హైలైట్స్ ఇవే

IND VS ENG:  టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మూడవ టెస్ట్ లార్డ్స్ వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ లార్డ్స్ టెస్ట్ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా ఆల్ అవుట్ అయింది. ఈ నేపథ్యంలోనే… టీమిడియాస్ అలాగే ఇంగ్లాండ్ స్కోర్స్ లెవెల్ అయ్యాయి. మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 387 పరుగులు చేయగా.. ఇప్పుడు టీమిండియా కూడా తొలి ఇన్నింగ్స్ లో 387 పరుగులకు ఆల్ అవుట్ అయింది. దీంతో మొదటి ఇన్నింగ్స్ ఈక్వల్ అయింది. కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్ అద్భుతంగా రాణించడంతో టీమిండియా ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది.


Also Read: Jadeja – Root: జడేజా కోతి చేష్టలు.. రూట్ సెంచరీ కాకుండా ఎలా అడ్డుకున్నాడో చూడండి.. వీడియో చూస్తే పిచ్చెక్కి పోవాల్సిందే

దుమ్ములేపిన కేఎల్ రాహుల్, జడేజా, పంత్


లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మూడవ టెస్ట్ మ్యాచ్ లో కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్ ముగ్గురు అద్భుతంగా రాణించారు. ఇందులో ముఖ్యంగా కె ఎల్ రాహుల్… అదిరిపోయే సెంచరీతో… దుమ్ము లేపాడు. 176 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు కేఎల్ రాహుల్. ఈ సెంచరీలో 13 బౌండరీలు కూడా ఉన్నాయి. అయితే సెంచరీ చేసిన తర్వాత బాల్ కు… దురదృష్టవశాత్తు… కేఎల్ రాహుల్ అవుట్ అయ్యాడు.

గాయం ఉన్నప్పటికీ కూడా టీమిండియా వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ దుమ్ము లేపాడు. 112 బంతుల్లోనే 74 పరుగులు చేసి రఫ్పాడించాడు రిషబ్ పంత్. ఇందులో ఎనిమిది బౌండరీలు అలాగే రెండు సిక్సర్లు కూడా ఉన్నాయి. అయితే దురదృష్టవశాత్తు… రిషబ్ పంత్ రన్ అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత వచ్చిన రవీంద్ర జడేజా… మరోసారి తన ఆల్రౌండర్ ప్రదర్శన కనబరిచాడు. ప్రతి మ్యాచ్ లో ఇంగ్లాండ్ గడ్డపై హాఫ్ సెంచరీ చేసిన జడేజా…. ఇవాల్టి మ్యాచ్ లో కూడా అద్భుతంగా రాణించాడు. నితీష్ కుమార్ రెడ్డి తో మంచి పార్టనర్ షిప్.. డెవలప్ చేశాడు. ఈ మ్యాచ్లో 72 పరుగులు చేసి అవుట్ అయ్యాడు రవీంద్ర జడేజా. అటు నితీష్ కుమార్ రెడ్డి కూడా 91 బంతుల్లో 30 పరుగులు చేసి రాణించే ప్రయత్నం చేశాడు. కానీ 50 పరుగులు కూడా చేయలేకపోయాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ 23 పరుగులతో కాస్త టచ్ లోకి వచ్చాడు. కానీ రవీంద్ర జడేజా కు సపోర్ట్ ఇవ్వలేకపోయాడు వాషింగ్టన్ సుందర్. ఈ తరుణంలోనే టీమిండియా 387 పరుగులకు ఆల్ అవుట్ అయింది.

Also Read: Radhika Murder Case : రాధిక హత్య వెనుక బిగ్ ట్విస్ట్.. ప్రియుడితో రాసలీలలు.. ఆ ఒక్క వీడియోనే కొంప ముంచిందా

ముగిసిన మూడవ రోజు.. ఇంగ్లాండ్ స్కోర్ ఎంత అంటే

మూడవ రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండు రెండో ఇన్నింగ్స్ కూడా ప్రారంభించింది. రెండవ ఇన్నింగ్స్ లో ఒకే ఒక్క ఓవర్ ఆడింది ఇంగ్లాండ్. ఇందులో రెండు పరుగులు చేసి… వికెట్లు ఏమి కోల్పోలేదు ఇంగ్లాండు. ఇక అటు ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఆర్చర్ 2 వికెట్లు తీశాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ రెండు వికెట్లు తీయగా కార్స్ ఒక వికెట్ పడగొట్టాడు.

Related News

Dhoni on Virat : కోహ్లీ పెద్ద జోకర్.. ధోని హాట్ కామెంట్స్ వైరల్!

Night watchman : టెస్ట్ క్రికెట్ లో అసలు నైట్ వాచ్మెన్ అంటే ఎవరు.. వాళ్ల డ్యూటీ ఏంటి

Shreyas Iyer: శ్రేయస్‌కు మరోసారి నిరాశే.. ఆసియా కప్‌ జట్టులో నో ఛాన్స్ ?

BCCI : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు BCCI బిగ్ షాక్…2027 వరల్డ్ కప్ కంటే ముందే కుట్రలు !

Sanju Samson – CSK : సంజూకు ఝలక్.. CSK లోకి అతను వచ్చేస్తున్నాడు!

Digvesh Rathi : దిగ్వేష్ ఒక్కడే పిచ్చోడు అనుకున్నాం.. కానీ వాడిని మించినోడు వచ్చాడు.. ఈ వీడియో చూస్తే పిచ్చెక్కి పోవాల్సిందే

Big Stories

×