Akash Ambani: అపర కుబేరుడు ఆకాశ్ అంబానీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఆకాశ్ అంబానీ ముఖేష్ అంబానీకి సంబంధించిన బిజినెస్ వ్యవహారాలను చూసుకుంటూ ఎప్పుడు బిజీగా ఉంటాడు. ఆకాశ్ అంబానీ నిన్న జరిగిన ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ కు వచ్చారు. ఈ మ్యాచ్ ముంబైలోని డి వై పాటిల్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ కు సినీ సెలెబ్రెటీలు, రాజకీయ నాయకులు, టీమిండియా స్టార్ క్రికెటర్లు కూడా హాజరయ్యారు. అందులో ఆకాశ్ అంబానీ కూడా ఒకరు. నిన్న జరిగిన మ్యాచ్ లో టీం ఇండియా విజయం సాధించింది. దీంతో ఆకాశ్ అంబానీ తన ఫోన్ లో ఫోటోలు తీసుకున్నారు.
Also Read: Kane Williamson Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ మామ..ఇక అతని శకం ముగిసింది
ఆకాశ్ అంబానీపై అనేక రకాల ట్రోల్స్ వస్తున్నాయి. ఆకాశ్ అంబానీ ఐఫోన్ 16 ఇ మొబైల్ ను వాడుతున్నారు. ఈ ఫోన్ ఖరీదు రూ. 47,990 మాత్రమే. ఎంతో డబ్బు సంపాదన ఉన్నప్పటికీ ఆకాష్ అంబానీ ఇంత తక్కువ ఖరీదు ఉన్న ఫోన్ ను ఎందుకు వాడుతున్నారని చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు. ఆకాశ్ అంబానీ వెనక ఉన్న వ్యక్తి ఫోన్ ఐఫోన్ 17 ప్లస్ ప్రో మ్యాక్స్ దీని ఖరీదు 1.50 లక్షలు. ఆకాశ్ అంబానీ వెనుక ఉన్న వ్యక్తి అత్యంత ఖరీదైన ఫోన్ ను వాడుతున్నారు. కానీ ఆకాశ్ అంబానీ మాత్రం చాలా తక్కువ ఖరీదైన ఫోన్ ను ఉపయోగిస్తున్నారు.
టీమిండియా ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో టీమిండియా కప్ కైవసం చేసుకుంది. కప్ కొట్టిన భారత్ కు రూ 39.5 కోట్లు ప్రైస్ మనీని అందుకోనున్నారు. రన్నరప్ SA జట్టు రూ. 19.77 కోట్లు అందుకుంటుంది. ఈ WC లో ప్రైజ్ మనీ బోనస్ లో పార్టిసిపేషన్ కార్యదర్శి ప్రకటించిన రూ. 51 కోట్లతో కలిపి మొత్తం భారత మహిళల జట్టుకు రూ. 93.66 కోట్ల వరకు ప్రైజ్ మనీ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న జరిగిన మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాపై 52 రన్స్ తేడాతో టీమిండియా విజయం సాధించింది. మొదటిసారిగా వరల్డ్ కప్ ను ముద్దాడింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 298/7 పరుగులు చేసింది. షెఫాలీ (87), దీప్తి (58) అద్భుతంగా విజయం సాధించారు. 299 పరుగుల భారీ లక్ష్య చేదనలో సౌత్ ఆఫ్రికా తడబడింది. లారా (101), అన్నేరి (35) మినహా ఎవరు రాణించలేదు. ఇండియా బౌలర్లలో దీప్తి శర్మ 5, షెఫాలీ 2, శ్రీ చరణి ఒక వికెట్ తీశారు. నిన్న జరిగిన ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు రోహిత్ శర్మ, నీతా అంబానీ, సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ ఆకాశ్ అంబానీతో సహా పలువురు రాజకీయ నాయకులు సినీ సెలబ్రిటీలు అందరూ వచ్చి నేరుగా మ్యాచ్ ను వీక్షించారు.
Akash Ambani use Iphone 16E
But Random Ramesh wants Iphone 17 plus pro max max 🥱 pic.twitter.com/tEkziEV7Os
— Pratham khanna (@Portfolio_Bull) November 2, 2025