Man Fires Gun During Cricket Match: క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో కాల్పులు కలకలం రేపాయి. సాధారణంగా క్రికెట్ మ్యాచ్ చాలా ప్రశాంతంగా జరుగుతుంది. ఇరు జట్ల ప్లేయర్ల మధ్య గొడవలు తప్ప… కాల్పుల సంఘటనలు.. ఎప్పుడు జరగవు. కానీ… తాజాగా క్రికెట్ గ్రౌండ్ లో కాల్పులు కలకలం రేపాయి. దీంతో మ్యాచ్ చూసేందుకు వచ్చిన జనాలు భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటన ఎక్కడో జరగలేదు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే జరిగింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ జిల్లాలో ఈ సంఘటన.. ఆదివారం రాత్రివేళ జరగకగా తాజాగా వెలుగులోకి వచ్చింది.
క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా కాల్పులు
క్రికెట్ ఎక్కడ ఆడిన జనాలు వచ్చేస్తారు. ఎందుకంటే క్రికెట్కు అంత పాపులారిటీ ఉంది. అయితే ఇదే అదునుగా చూసుకొని ఓ అజ్ఞాత వ్యక్తి… క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వచ్చి కాల్పులు జరిపాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ జిల్లాలో క్రికెట్ పోటీలు విపరీతంగా జరుగుతాయి. ఇందులో భాగం గానే నిన్న ఆదివారం కావడంతో… ఇండోర్ జిల్లా మాల్పూర్ గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ కూడా ప్రారంభమైంది.
ఈ టోర్నమెంట్ ప్రారంభమైన రోజే పెను విషాదం నెలకొంది. ఈ టోర్నమెంట్లో భాగంగా రాత్రివేళ కూడా మ్యాచులు నిర్వహిస్తున్నారు. అయితే నిన్న అంటే ఆదివారం రోజున రాత్రివేళ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ఓ యువకుడు రైఫిల్ తో కలకలం రేపాడు. గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపి రచ్చ చేశాడు. నవ్వుతూ తన తోటి వారితో కూడా కాల్పులు జరుపుతూ… అందరికీ చుక్కలు చూపించాడు ఆ కుర్రాడు. అయితే ఎంతో తీక్షణంగా మ్యాచ్ చూస్తున్నా అభిమానులకు… కాల్పుల సౌండ్ రావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
దీంతో మ్యాచ్ మధ్యలోనే పరుగులు పెట్టారు. అటు ప్లేయర్లు కూడా పరుగో పరుగు అన్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ సంఘటన పోలీసుల దృష్టికి కూడా వెళ్లడం జరిగింది. దీంతో.. ఆ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులు జరిపిన ఆ కుర్రాడు పారిపోయినట్లు తెలుస్తోంది. అతని కోసం పోలీసులు విచారణ చేపట్టారు.
జిల్లా మొత్తం గాలిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు పోలీసులు. అయితే క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా… కాల్పులు జరగడం మనం పాకిస్తాన్ లో చూస్తాం. కానీ అచ్చం అలాంటి సంఘటనే మన ఇండియాలో జరగడం దురదృష్టకరం అని కొంతమంది క్రీడా విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.