Big Stories

Modi Meets Bill Gates: బిల్.. మీ సేవలు అద్భుతం: మోదీ

 

- Advertisement -

Bill Gates meets PM Modi

- Advertisement -

Bill Gates meets PM Modi discusses ‘AI for public good’(Telugu news updates): భారత్‌లో పర్యటిస్తున్న మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ బిల్ గేట్స్‌తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో మహిళాభివృద్ధి, హెల్త్, వ్యవసాయం, వాతావరణ మార్పుల వంటి పలు అంశాలపై వారు చర్చించారు. దేశ రాజధానిలో జరిగిన ఈ సమావేశానికి ముందు బిల్ గేట్స్ మన విదేశాంగ మంత్రి జై శంకర్‌తోనూ సమావేశమయ్యారు. అనంతరం బిల్ గేట్స్.. ప్రధాని మోదీ గురించి ఎక్స్‌లో ట్వీట్ చేశారు. మోదీతో కలిసి పనిచేయటం ఎప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటుందని, ఆ అనుభూతిని తానెన్నడూ మరువలేనని సంతోషం వ్యక్తం చేశారు. అటు.. ప్రధాని కూడా బిల్ గేట్స్ ట్వీట్‌ను రీ ట్వీట్ చేస్తూ.. మానవాళికి ఆయన ఫౌండేషన్ అందించే సేవలు వెలకట్టలేనివని కొనియాడారు.

Read more: రైతులకు శుభవార్త.. ఖరీఫ్ లో రూ. 24,420 కోట్ల రాయితీ..

దీనికి ముందు ఆయన హైదరాబాద్‌లో పాతికేళ్లనాడు (1998లో) ప్రారంభించిన మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్‌ని సందర్శించారు. మైక్రోసాఫ్ట్ సంస్థలో అజూర్, విండోస్, ఆఫీస్, బింగ్, కోపిలాట్ సహా పలు టూల్స్‌ను అభివృద్ధి చేసిన ఈ కేంద్రం ప్రారంభమై పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి హాజరైన బిల్ గేట్స్.. రాబోయే రోజుల్లో ఈ కేంద్రం మరిన్ని గొప్ప ఆవిష్కణలను అందించాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా కృత్రిమ మేథ(ఏఐ) ఆధారిత సేవల దిశగా ముందడుగు వేయాలని తన ప్రసంగంలో కోరారు.

హైదరాబాద్ పర్యటనకు ముందు బిల్ గేట్స్ బుధవారం ఒడిసా రాజధాని భువనేశ్వర్‌లోనూ పర్యటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ అధికారులు, ఎన్జీవోల ప్రతినిధులతో కలిసి అక్కడి మురికి వాడల్లో పర్యటించిన బిల్ గేట్స్.. ప్రభుత్వం మిలిందా గేట్స్ ఫౌండేషన్‌తో కలసి అందిస్తున్న సేవల వివరాలను లబ్దిదారులను అడిగి తెలుసుకున్నారు. బుధవారం ఆయన అక్కడి సీఎం నవీన్ పట్నాయక్‌తోనూ భేటీ అయిన సంగతి తెలిసిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News