Kuldeep Yadav: టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియాలో స్టార్ స్పిన్నర్ గా ఎదిగిన కుల్దీప్ యాదవ్… ప్రతి ఐసీసీ టోర్నమెంట్ లో కూడా చోటు సంపాదించుకుంటున్నాడు. చైనా మ్యాన్ గా పేరు తెచ్చుకున్న కుల్దీప్ యాదవ్… మిగిలిన బౌలర్ల కంటే మెరుగైన ప్రదర్శన కనిపిస్తున్నాడు. అయితే అలాంటి బ్యాచిలర్… త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఇప్పటికే వంశిక అని తన చిన్ననాటి స్నేహితురాలితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు కుల్దీప్ యాదవ్. ఇక తాజాగా తన కాబోయే భార్యతో ఓ రొమాంటిక్ ఫోటో కూడా దిగాడు. దీనికి సంబంధించిన ఫోటోను ఇంస్టాగ్రామ్ లో స్టేటస్ గా పెట్టుకున్నాడు టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ( Team India Kuldeep Yadav ). ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇటీవల ఎంగేజ్మెంట్ చేసుకున్న టీమిండియా బౌలర్ కుల్దీప్ యాదవ్
గత రెండు నెలల కిందట టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. తన చిన్ననాటి స్నేహితురాలు వంశిక ( vamshika ) అనే అమ్మాయిని.. ప్రేమించి మరీ పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు కుల్దీప్ యాదవ్. ఇందులో భాగంగానే పెద్దల సమక్షంలోనే ఇటీవల ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు. ఈ ఎంగేజ్మెంట్ తర్వాత ఏడాది పొడుగునా టీమిండియా షెడ్యూల్ ఉంది. అందుకే పెళ్లిని ఏడాది పాటు కుల్దీప్ యాదవ్ వాయిదా వేశాడు. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ పూర్తయిన తర్వాత… పెళ్లికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం డిసెంబర్ మాసంలో కుల్దీప్ యాదవ్ పెళ్లి జరిగే ఛాన్సులు ఉన్నాయి. అప్పుడే రింకు సింగ్ యాదవ్ పెళ్లి కూడా జరగనుంది.
కుల్దీప్ యాదవ్ ( Kuldeep Yadav) ఇంస్టాగ్రామ్ స్టేటస్ వైరల్
ఆసియా కప్ (Asia Cup 2025) కోసం టీమిండియా ప్రిపేర్ అవుతున్న నేపథ్యంలో కుల్దీప్ యాదవ్ ( Kuldeep Yadav) మాత్రం తన కాబోయే భార్య వంశికతో ఎంజాయ్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరూ ప్రస్తుతం లివింగ్ రిలేషన్ లో ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ… తనకు కాబోయే భార్యతో కుల్దీప్ యాదవ్ ఫోటో దిగినట్లు చెబుతున్నారు. ఆ రొమాంటిక్ ఫోటోను ఇంస్టాగ్రామ్ లో ( Instagramme Status) స్టేటస్ గా పెట్టుకున్నాడు కుల్దీప్ యాదవ్. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, ఆసియా కప్ 2025 టోర్నమెంట్ కు ( Asia Cup 2025 tournament ) టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సెలెక్ట్ ఐన సంగతి తెలిసిందే. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ 2025 సెప్టెంబర్ 9 నుంచి 28వ తేదీ వరకు కొనసాగనుంది.
Kuldeep Yadav's Instagram story ❤️. pic.twitter.com/99zxKhTBcJ
— Jay Cricket. (@Jay_Cricket12) August 25, 2025