Manoj Tiwary: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన పేరు చెప్పగానే టీమిండియా కు వచ్చిన ట్రోఫీలు మాత్రమే గుర్తుకు వస్తాయి. అంతలా టీమిండియాను. ఒక రేంజ్ కు తీసుకువెళ్లాడు మహేంద్ర సింగ్ ధోని. అయితే అలాంటి మహేంద్ర సింగ్ ధోనీ పై టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియాలో తనకు చోటు దక్కని ఇవ్వకుండా మహేంద్రసింగ్ ధోని కుట్రలు చేశారని ఫైర్ అయ్యారు. మహేంద్ర సింగ్ ధోని పెద్ద దుర్మార్గుడని… గతంలో తాను సెంచరీ చేసిన కూడా టీమిండియాలో చోటు ఇవ్వలేదని మండిపడ్డారు. దీంతో మనోజ్ తివారి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
నాపై ధోని కుట్రలు చేశాడు.. తివారి షాకింగ్ కామెంట్స్
టీమిండియాలో తనకు ఛాన్స్ ఇవ్వకుండా మహేంద్రసింగ్ ధోని ( Ms Dhoni ) కుట్రలు చేశాడని తాజాగా ఓ ఈవెంట్లో టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు జట్టులో ఛాన్స్ ఇవ్వకపోవడం పై ఇప్పటికీ కోపంతో ఉన్నట్లు వెల్లడించాడు. సమీప భవిష్యత్తులో తనకు ధోని ఎప్పుడైనా కలిస్తే ఖచ్చితంగా ఈ విషయంపై నిలదీస్తానని హెచ్చరించాడు మనోజ్ తివారి.
100 పరుగులు చేసిన కూడా తనను ఎందుకు పక్కకు పెట్టావని.. కడిగి పడేస్తానని ఫైర్ అయ్యాడు. తాను ఇంతకుముందే చెప్పాను.. ఏం తప్పు జరిగిందో ఆ సమయంలో… తనకు మాత్రం తెలియదు… ఎందుకు తనను పక్కకు పెట్టారు అనే విషయంపై తెలుసుకునేదాకా ఊరుకునేది లేదని తేల్చి చెప్పాడు. నేనంటే మహేంద్ర సింగ్ ధోని కి నచ్చకపోవచ్చు… కానీ తన ప్రదర్శనను గుర్తించాల్సి ఉంది అని గుర్తు చేశాడు. దీంతో మహేంద్ర సింగ్ ధోనీ పై మనోజ్ తివారిచేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
2011 లో సెంచరీ చేసిన మనోజ్ తివారి
టీమిండియా కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోని ఉన్నప్పుడే మనోజ్ తివారి జట్టులో కొనసాగుతున్నాడు. అడపాదప చాన్సులు వస్తే వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే 2011 సంవత్సరంలో తొలి వన్డే సెంచరీ పూర్తి చేసుకున్నాడు మనోజ్ తివారి. వెస్టిండీస్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరిగిన మ్యాచ్ లో 126 బంతుల్లో 14 పరుగులు చేసి దుమ్ము లేపాడు తివారి. దీంతో తివారికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా వచ్చింది. దీంతో కచ్చితంగా టీమిండియాలో అవకాశం వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ధోని కారణంగానే తివారికి అవకాశం రాలేదని ప్రచారం జరిగింది. అందుకే మహేంద్ర సింగ్ ధోనీ పై మనోజ్ తివారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Also Read: Man Fires Gun During Cricket Match: క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా కాల్పుల కలకలం.. అసలేం జరిగిందంటే
'Whenever I come across MS Dhoni, I’ll definitely ask him the reasons why I was not given an opportunity after scoring 100.”
– Manoj Tiwary in a CricTracker exclusive#TeamIndia #ManojTiwary #Cricket pic.twitter.com/o7MnoSS1l1
— CricTracker (@Cricketracker) August 25, 2025