E-Paper
Advertisement

Axar Patel : ఫైనల్ మ్యాచ్ లో మూడు పార్శ్వాలను చూశాను: అక్షర్ పటేల్

Axar Patel : ఫైనల్ మ్యాచ్ లో మూడు పార్శ్వాలను చూశాను: అక్షర్ పటేల్

Axar Patel : టీ 20 ప్రపంచకప్ పై ఇప్పుడిప్పుడే, ఆటగాళ్లందరూ నోరు విప్పుతున్నారు. ఇంతకుముందే అర్షదీప్ తన మనసులో మాట బయటపెట్టాడు. ఇప్పుడు అక్షర్ పటేల్ మాట్లాడుతూ టీ 20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో తను అవుట్ అయిన తీరు, ఆ క్షణం పడిన మానసిక వేదన వివరించాడు. మేం బ్యాటింగ్ చేసేటప్పుడు మ్యాచ్ 4 ఓవర్లలోనే 3 వికెట్లు పడిపోయాయి. ఆ సమయంలో నేనొచ్చాను.

ఒకవైపున విరాట్ కొహ్లీ వికెట్లను కాసుకుంటాడు. మరో ఎండ్ లో హిట్టింగ్ చేయమని నన్ను పంపించారు. మంచి రిథమ్ లో ఆడుతుండగా రన్ అవుట్ అయిపోవడం చాలా నిరాశ కలిగించింది. అవుట్ అయినందుకు కాదు, అప్పుడు మ్యాచ్ మంచి స్థితికి వచ్చింది. ఆ సమయంలో అవుట్ కావడం కరెక్ట్ కాదు, కానీ అటు వైపు కొహ్లీ ఉండటంతో మ్యాచ్ ని తన భుజాలపై వేసుకుని నడిపించాడు. అప్పుడు హిట్టింగ్ బాధ్యతను తను తీసుకుని స్కోరు పెంచాడని అన్నాడు. నిజానికి అక్షర్ పటేల్ 31 బంతుల్లో 4 సిక్స్ లు, ఒక ఫోరు సాయంతో 47 పరుగులు చేశాడు.

తర్వాత అక్షర్ మాట్లాడుతూ సౌతాఫ్రికా బ్యాటింగ్ చేస్తుండగా మ్యాచ్ 15 ఓవర్ ని కెప్టెన్ రోహిత్ నాకు ఇచ్చాడు. ఆ ఓవర్ లో 24 పరుగులు వచ్చాయి. క్లాసెన్ విధ్వంసంతో ఒక్కసారి మ్యాచ్ వారివైపు వెళ్లిపోయింది. ఓవర్ పూర్తయిన తర్వాత ఐదు సెకన్లు నాకు మైండ్ బ్లాక్ అయ్యింది. ఏం జరిగిందో అర్థం కాలేదు. చాలా నిరుత్సాహపడ్డాను.

Also Read : కొహ్లీలో చాలా మార్పు వచ్చింది: రాబిన్ ఉతప్ప

ఆ సమయంలో రోహిత్ భయ్ వచ్చి భుజం తట్టి ధైర్యం చెప్పాడు. నువ్వు బౌలింగ్ బాగానే వేశావ్.. బ్యాటర్ తనదైన రోజున ఏ బౌలర్ ఏమీ చేయలేడు. అయినా మ్యాచ్ అయిపోలేదు, ఫీల్డింగ్ జాగ్రత్త అని అన్నాడు. అన్ని పరుగులిచ్చినప్పటికి రోహిత్ ఏమీ అనకపోవడం చూసి ఆశ్చర్యం వేసింది. అయితే మనసులో మాత్రం గెలుస్తామనే భావన కలిగింది.

మ్యాచ్ ని చివరి బంతి వరకు తీసుకువెళ్లాలని మనసులో ధృడంగా అనుకున్నాం. అనుకున్నట్టుగా బుమ్రా, అర్షదీప్, పాండ్యా వీరు ముగ్గురు అద్భుతంగా బౌలింగు వేసి ప్రపంచకప్ తీసుకొచ్చారు. ముఖ్యంగా నా మనసులో పేరుకున్న కొండంత బాధను తొలగించారు. ఆ క్షణం వేసిన ఆనందాన్ని జీవితంలో మరిచిపోలేను. ఒక పావుగంట ముందు తీవ్ర నిరాశను, పావు గంట తర్వాత ఎంతో ఆనందాన్ని పొందాను. ఆ మధ్యలో జరిగిన పావుగంట మాత్రం తీవ్ర భావోద్వేగం మధ్య జరిగిందని అన్నాడు. దుఖం, ఆనందం, టెన్షను.. ఆ మూడు పార్శ్వాలను మ్యాచ్ లో చూశానని అన్నాడు.

Related News

Shreyas Iyer: వివాదంలో శ్రేయస్ అయ్య‌ర్‌…అంపైర్ పై దాడికి య‌త్నం !

బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి !

Pakistan : పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

Big Stories

×