E-Paper
Advertisement

ICC Worldcup 2023 : టీమిండియాకు మరో షాక్.. తొలి మ్యాచ్ కు హార్థిక్ కూడా దూరం?

ICC Worldcup 2023 : టీమిండియాకు మరో షాక్.. తొలి మ్యాచ్ కు హార్థిక్ కూడా దూరం?
Advertisement

ICC Worldcup 2023 : వన్డే వరల్డ్ కప్‌లో తొలిమ్యాచ్ ఆరంభానికి ముందు టీమిండియాకు షాక్‌ల మీద షాకులు తగులుతున్నాయి. ఓపెనింగ్ బ్యాట‌ర్ శుభ‌మ‌న్ గిల్‌ డెంగ్యూ జ్వ‌రంతో ఆస్ట్రేలియాతో మ్యాచ్ కు దూరం అవుతాడనే వార్త.. క్రికెట్ అభిమానులు జీర్ణంచుకోకముందే..హార్థిక్ పాండ్యా కూడా గాయాలపాలయ్యాడు. మ్యాచ్ ప్రాక్టీస్ చేస్తుండగా.. పాండ్యా చేతి వేలికి గాయమైనట్లు బీసీసీఐ ప్రకటించింది.

ఊహించని ఘటనతో అటు బోర్డు.. ఇటు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఆస్ట్రేలియాతో జ‌ర‌గ‌నున్న వ‌ర‌ల్డ్‌క‌ప్ మ్యాచ్‌లో గిల్‌.. దాదాపు దూరమనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవ‌ల కాలంలో గిల్ వ‌న్డేల్లో అద్భుత‌మైన బ్యాటింగ్‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నాడు. జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్న గిల్‌కు ప‌రీక్ష‌లు చేప‌ట్టార‌ని, టెస్టుల్లో డెంగ్యూ ఉన్న‌ట్లు తేలింద‌ని కొన్ని మీడియా క‌థ‌నాల సమాచారం. గిల్ ఆడతాడా లేదా అనే దానిపై రేపు నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.

Advertisement

తాజాగా.. హార్థిక్‌ పాండ్యా కూడా గాయాలబారిన పడినట్లు తెలుస్తోంది. జట్టు ప్రాక్టీస్‌ చేస్తుండగా.. పాండ్యా చేతికి గాయం అయ్యింది. ఆ నొప్పితో పాండ్యా బాధపడుతున్నాడని సమాచారం. ఒకేసారి ఇద్దరు స్టార్‌ ఆటగాళ్లు అనారోగ్యానికి గురి కావటంతో బీసీసీఐ ప్రత్యామ్నాయ ఆటగాళ్లపై దృష్టి సారించినట్లు సమాచారం. ఆ ఇద్దరూ మ్యాచ్ లు ఆడకపోతే.. వారి స్థానంలో ఏయే ఆటగాళ్లను తీసుకుంటారో చూడాలి.

Related News

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

స్మృతి మందాన‌ బ్యాట్ లో AI చిప్స్…అందుకే సెంచ‌రీ చేసింది

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్న పాకిస్తాన్ క్రికెట‌ర్లు..!

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

Big Stories

Advertisement
×