Imam-ul-Haq smashes his bat in anger after losing his wicket in Champions One-Day Cup 2024 in Pakistan: పాకిస్తాన్ క్రికెట్ టీం పేరు ఎవరైనా చెప్పగానే అందరికీ వివాదాలే గుర్తుకు వస్తాయి. ఎందుకు ఈ మధ్య కాలంలో.. పాకిస్తాన్ క్రికెట్ టీం చాలా వివాదాల్లో చిక్కుకుంటోంది. చాంపీయన్స్ ట్రోఫీ 2025 నుంచి మొదలు కొని.. గ్రౌండ్ల పేర్లు అమ్ముకుంటూ.. హాట్ టాపిక్ అయింది. మొన్న పాకిస్తాన్ క్రికెట్ టీం డ్రెస్సింగ్ రూంలో కూడా ప్లేయర్లు కొట్టుకున్నారు. ఇక తాజాగా మరో అంశంపై తెరపైకి వచ్చింది.
పాకిస్తాన్ ప్లేయర్ ఇమామ్ ఉల్ హాక్ డ్రెస్సింగ్ రూమ్ లో బ్యాట్ ను బలంగా నేలకేసి కొట్టినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. దీంతో పాకిస్తాన్ ప్లేయర్లు మారరు అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. పాకిస్తాన్ ఛాంపియన్స్ వన్డే డే కప్ 2024 జరుగుతుంది. సెప్టెంబర్ 16న జరిగిన ఈ మ్యాచ్లో లయన్స్ వర్సెస్ పాంథర్స్ టీమ్ లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో తోలుతా బ్యాటింగ్ చేసిన పాంథర్స్ జట్టు 283 పరుగులు చేసింది. ఆ టీం తరపున ముబాశిర్ ఖాన్ 90 పరుగులతో, హైదర్ ఆలీ 84 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు.
లయన్స్ తరఫున ఇమామ్ ఉల్ హక్, సజ్జాద్ అలీ ఇన్నింగ్స్ ఆరంభించారు. అయితే 23వ ఓవర్లో శాదాబ్ ఖాన్ బౌలింగ్ లో ఇమామ్ కట్ షార్ట్ ఆడే ప్రయత్నంలో వికెట్ కీపర్ చేతికి చిక్కి అవుట్ అయ్యాడు. ఇమామ్ అవుట్ అవగానే వెంటనే డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లాడు. డ్రెస్సింగ్ రూమ్ లో సహనం కోల్పోయిన ఇమామ్ బ్యాటును బలంగా నేలకేసి కొట్టి తీవ్ర అసహనాన్ని వ్యక్తపరిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అటు బంగ్లాదేశ్ పై పాకిస్తాన్ ఘోర ఓటమిని మూట తట్టుకుంది. రెండు టెస్టు మ్యాచుల సిరీస్ ను బంగ్లా జట్టు క్లీన్ స్వీప్ చేసింది.
Also Read: SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..
ఈ సిరీస్ కు ముందు పాకిస్తాన్ పై టెస్టుల్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవని బంగ్లా ఇప్పుడు ఏకంగా పాకిస్తాన్ ను దాని సొంత గడ్డపై 2-0తో సమం చేసింది. తొలిసారి పాకిస్తాన్ లో టెస్ట్ సిరీస్ ను కైవసం చేసుకున్న బంగ్లా ఆనందానికి అవధులే లేవు. ఘోర ఓటమి పాలైన పాకిస్తాన్ జట్టుపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. గత మూడేళ్లలో పాకిస్తాన్ స్వదేశంలో ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా గెలవలేదు. చివరిసారిగా 2021లో బంగ్లాదేశ్ పైనే పాకిస్తాన్ విజయం సాధించింది. గత మూడేళ్లలో పాకిస్తాన్ స్వదేశంలో 10 టెస్ట్ మ్యాచ్లు ఆడగా అన్నింటిలోనూ ఓటమిపాలైంది. స్వదేశంలో టెస్ట్ మ్యాచ్ గెలిచి 1303 రోజులు అయ్యాయి. వరుసగా ఓటముల కారణంగా బాబర్ అజామ్ ను టెస్ట్ జట్టు కెప్టెన్సీ నుంచి…. షాన్ మసూద్ కు పగ్గాలు పిసిబి ఇచ్చింది. ఇప్పుడు అతని సారధ్యంలో బంగ్లాదేశ్ తో సిరీస్ కోల్పోయింది.