Mega157 Teaser: ప్రస్తుతం చాలామంది క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్న సినిమా Mega157. అనిల్ రావిపూడి మొదటిసారి మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమా చేస్తున్నారు. ఇప్పటివరకు అనిల్ రావిపూడి కి సంబంధించి ఒక్క డిజాస్టర్ సినిమా కూడా లేదు. ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. అనిల్ రావిపూడి ని మినీ రాజమౌళి అని కూడా చెప్పొచ్చు.
చాలామంది స్టార్ హీరోస్ తో అనిల్ రావిపూడి ఇప్పటికే సినిమాలు చేసేసాడు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ జోనర్ లో రానుంది. మెగాస్టార్ చిరంజీవి ఎంటర్టైన్మెంట్ సినిమా చేసి చాలా రోజులైంది. అలానే అనిల్ రావిపూడి స్ట్రెంత్ కూడా కామెడీ. ఇప్పుడు వీరి కాంబినేషన్లో సినిమా వస్తుంది అంటే ఖచ్చితంగా అంచనాలు ఉంటాయి.
రెండు కళ్ళు సరిపోవు
ఆగస్టు 22న మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా Mega 157 నుంచి ఒక టీజర్ రానుంది. అయితే ఇప్పటికే ఈ టీజర్ మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఇక తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ ఈ టీజర్ మీద ఇంకాస్త హైప్ క్రియేట్ చేశాడు. ట్విట్టర్ వేదికగా హరీష్ భారీ ఎలివేషన్ ఇచ్చాడు.
బిగ్గెస్ట్ మెగా సెలబ్రేషన్ ఆగస్టు 22న జరగబోతుంది. మై బ్రదర్ అనిల్ రావిపూడి అందరి ఫ్యాన్స్ కి గుర్తుండిపోయే ట్రీట్ ఇవ్వనున్నాడు. అసలు మ్యూజిక్ మొదలైన వెంటనే మీ హార్ట్ బీట్ వేగం మారిపోతుంది. మెగాస్టార్ చిరంజీవిని చూడడానికి మీ రెండు కళ్ళు సరిపోవు. అని టీజర్ గురించి చెబుతూ లవ్ యు అనిల్ అంటూ ఫినిష్ చేశాడు.
BIGGEST MEGA CELEBRATION on AUG 22nd! 🎉🔥
My brother @AnilRavipudi is making it a
day to remember forever for all the fans.
🎶 అసలు music మొదలైన వెంటనే…
మీ heart beat వేగం మారిపోతుంది! ❤️🔥
Boss @KChiruTweets ను చూడ్డానికి
రెండు కళ్లు సరిపోవు… 👑✨
Love you Anil…🤗
— Harish Shankar .S (@harish2you) August 20, 2025
బాక్స్ బద్దలైపొద్ది
అనిల్ రావిపూడి నిన్న జరిగిన లిటిల్ హార్ట్స్(Little Hearts) సినిమా టీజర్ ఈవెంట్ కు హాజరయ్యాడు. ఈ ఈవెంట్ లో అనిల్ Mega 157 అప్డేట్ కూడా ఇచ్చాడు. కేవలం రెండు రోజులే బాక్స్ బద్దలై పోతుంది అంటూ చెప్పాడు. నిన్న అనిల్ చెప్పిన మాటలు, ఈరోజు హరీష్ చెప్పిన మాటలు బట్టి టీజర్ ఏ రేంజ్ లో ఉండబోతుందో అని అందరికీ అంచనాలు పెరుగుతున్నాయి.
విపరీతంగా అంచనాలు పెరిగిన కూడా ఒక ప్రాబ్లం ఉంది. ఆ అంచనాలను టీజర్ అందుకో లేకపోతే ట్రోల్ చేయడం మొదలుపెడతారు. ఇక అనిల్ రావిపూడి (Anil Ravipudi) కి సంబంధించి ట్రోలింగ్ కొత్తేమీ కాదు. ఎన్నో సినిమాలు ట్రోలింగ్ దాటిన తర్వాత అనిల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టాడు. ఏది ఏమైనా కూడా మెగాస్టార్ చిరంజీవితో కూడా అద్భుతమైన సక్సెస్ కొట్టడం ఖాయం.
Also Read: Megastar Chiranjeevi: చిరంజీవి సినిమాకు ఏంటి ఈ పరిస్థితి? మినిమం రెస్పాన్స్ లేదు.!