Okra Water Benefits: బెండకాయను సాధారణంగా వంటల్లో ఉపయోగిస్తారు. దీనిని వేపుడు, పులుసు, సాంబార్ అనేక ఇతర వంటకాల్లో కూడా వాడతారు. అయితే, బెండకాయను వంటల్లో మాత్రమే కాకుండా, ఆరోగ్య ప్రయోజనాల కోసం దాని నీరును కూడా ఉపయోగించవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. దీనిని మనకు కావలసిన విధంగా వాడుకుంటే, ఆరోగ్యానికి ఎన్నో లాభాలని మీకు తెలుసా? ప్రత్యేకంగా రాత్రి బెండకాయ ముక్కలు నీటిలో నానబెట్టి ఉదయం ఆ నీళ్లు తాగితే కళ్లకు మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ అలవాటు నిజంగానే ఎంతవరకు ఉపయోగపడుతుందో, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో చూద్దాం.
బెండకాయలో సహజంగానే ఉండే జిగురు పదార్థం శరీరానికి ఒక పూతలా పనిచేస్తుంది. దాంతో జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది, కడుపులో ఎసిడిటీ తగ్గుతుంది. ఈ జిగురు నీటిలో కలిసిపోవడంతో, పొద్దున్నే తాగితే కడుపు తేలికగా అనిపిస్తుందని దీనిని ఉపయోగించిన కొందరు తెలిపారు. కళ్ల ఆరోగ్యానికి వస్తే, బెండకాయలో విటమిన్ ఏ, బి వర్గాలు, సి, అలాగే కొన్ని ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరానికి, ముఖ్యంగా కంటి కణజాలానికి అవసరమైన పదార్థాలు. అయితే కాయను తినకుండా కేవలం నీరు తాగితే మొత్తం పోషకాలు శరీరానికి అందవు. కనుక ఇది సహాయకం కాని పూర్తిస్థాయి పరిష్కారం కాదు.
రాత్రి ఇలా చేయండి..
రాత్రి రెండు చిన్న బెండకాయలు శుభ్రంగా కడిగి, ముక్కలు చేసి గాజు నీటిలో నానబెట్టాలి. పొద్దున్నే ఆ నీటిని వడగట్టి, కొంచెం జిగురు కలిసిన ఆ నీటిని అరకప్పు వరకు నెమ్మదిగా తాగాలి. మిగిలిన ముక్కలను మళ్లీ వాడకూడదు. ప్రతిరోజూ తాజాగా ముక్కలను కోసి వాడుకోవాలి. ఒకేసారి ఎక్కువ తాగితే కడుపు నిండిన భావం, అసౌకర్యం కలగవచ్చు. మొదట కొద్దిగా మొదలుపెట్టి రాను రాను సరైన మోతాదులో నీటిని శరీరానికి తగ్గట్టు తాగుతూ ఉండాలి.
Also Read: Blinkit New Feature: సూపర్.. బ్లింకిట్ కొత్త ఆప్షన్.. స్విగ్గీ, జెప్టోలో లేని ఫీచర్..
ఇది ఎవరికి ఉపయోగం..
ఎసిడిటీ, గుండ్రని మంటలతో ఇబ్బంది పడే వారికి ఇది మంచి ఉపశనాన్ని ఇస్తుంది. నీరు తక్కువ తాగే అలవాటు ఉన్నవారు ఈ విధానం ద్వారా కనీసం ఉదయం అరకప్పు నీటిని తాగే అలవాటు ఉంటే శరీరానికి మేలుచేస్తుంది. ఎక్కువ సేపు ఎండలో తిరిగే వారికి ఇది మంచి పానీయం లాంటిది. మలబద్ధకం బాధపడే వారికి కూడా బెండకాయ నీరు కాస్త ఉపశమనం లభించవచ్చు.
ఇలా ఉంటే ఈ నీరు అస్సలు తాగొద్దు..
చక్కెర వ్యాధి ఉన్నవారు, మూత్రపిండ సమస్యలతో బాధపడేవారు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు తప్పనిసరిగా వైద్యుని సలహాతోనే ఈ అలవాటు మొదలుపెట్టాలి. శరీరానికి అలెర్జీ వచ్చే అవకాశం ఉంటే ఈ నీటిని కొద్దిగా మాత్రమే ప్రయత్నించి, మార్పులు గమనించాలి. కడుపు ఇబ్బందులు, అతిసారం ఉన్న రోజుల్లో ఈ పద్ధతిని వదిలేయడం మంచిది.
బెండకాయ నీళ్లు తాగితే చూపు ఒక్కసారిగా పెరుగుతుంది అనునుకోవడం సరైంది కాదు. ఇది పరోక్షంగా సహాయపడే ఒక చిన్న చిట్కా మాత్రమే. కాయను వండుకుని తింటేనే పూర్తి పోషకాలు లభిస్తాయి. అందువల్ల వంటల్లో వారానికి ఒకటి రెండు సార్లు బెండకాయ వాడుకోవడం ఉత్తమం.
ముఖ్యంగా గుర్తుంచుకోవలసినది ఏమిటంటే–బెండకాయ నీళ్లు ఒక సహాయక మార్గం, కానీ వైద్యానికి ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా ప్రత్యేక కంటి సమస్య, మసక చూపు, వెలుతురు అసహనం, నొప్పి ఉంటే ఆలస్యం చేయకుండా నిపుణుడిని సంప్రదించాలి. సరైన పరిమితిలో, శరీరానికి సూటయ్యే విధంగా ఉపయోగిస్తే ఈ పద్ధతి కొంత మేలు చేయగలదు.