Ashwin: సెప్టెంబర్ 9 నుండి ప్రారంభం కానున్న ఆసియా కప్ 2025 కోసం మంగళవారం రోజు బీసీసీఐ 15 మంది ఆటగాళ్లు, 5 మంది స్టాండ్ బై ప్లేయర్ల పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ లిస్ట్ చూసిన తర్వాత అందరికీ వచ్చిన అనుమానం.. శ్రేయస్ అయ్యర్, యశస్వి జైష్వాల్ లను జట్టు నుండి తొలగించడం. వీరిద్దరిని ఆసియా కప్ కోసం ఎందుకు ఎంపిక చేయలేదని బిసిసిఐ సెలక్షన్ కమిటీ తో పాటు టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై విమర్శలు వస్తున్నాయి.
Also Read: Hardik Pandya: SRH కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా…? లక్ష్మణ్ చేసిన ఆ ఒక్క తప్పిదంతో
స్టార్ బ్యాటర్లు, టి-20 స్పెషలిస్టులు ఐన శ్రేయస్ అయ్యర్, యశస్వి జైష్వాల్ ని ఆసియా కప్ జట్టు నుండి ఎందుకు తొలగించారని పలువురు సీనియర్ ప్లేయర్లు సైతం ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయంపై టీమిండియా మాజీ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తన యూట్యూబ్ ఛానల్ “ఐష్ కి బాత్” లో తాజాగా అశ్విన్ మాట్లాడుతూ.. ” శ్రేయస్ అయ్యర్ కి అద్భుతమైన రికార్డు ఉంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించిన అతడు.. కనీసం జట్టులో కూడా లేడు. గిల్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడని వాదిస్తే.. శ్రేయస్ అయ్యర్ కూడా అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు కదా..! ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎవరు ఇస్తారు.
అసలు శ్రేయస్ అయ్యర్ ఏం తప్పు చేశాడని ఇలా పక్కన పెట్టారు. శ్రేయస్ అయ్యర్, యశస్వి జైష్వాల్ వంటి ఆటగాళ్లకు న్యాయం జరగలేదు. కనీసం ఇప్పటివరకు వారిద్దరితో ఎవరైనా మాట్లాడి ఉండొచ్చు. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా కలకత్తా నైట్ రైడర్స్ కి ఐపీఎల్ 2024 టైటిల్ అందించాడు. 2014 తర్వాత పంజాబ్ కింగ్స్ జట్టును మొదటిసారి ఫైనల్ కీ చేర్చాడు. 2025 లో పంజాబ్ కింగ్స్ ని ఫైనల్ చేర్చడంలో ఓ బ్యాటర్ గానే కాకుండా కెప్టెన్ గా మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు. రబడా వంటి బౌలర్ల పై పరుగులు చేశాడు. అతడిని ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కి సెలెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఏకంగా ఆసియా కప్ 2025 జట్టులోను శ్రేయస్ అయ్యర్ కి అవకాశం ఇవ్వకపోవడం సరికాదు.
శ్రేయస్ అయ్యర్, యశస్వి జైష్వాల్ విషయంలో నేను చాలా బాధపడుతున్నాను. ఇది అన్యాయం. వాళ్లు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అందుకే ముంబైలో వరదలు వస్తున్నాయి.” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు రవిచంద్రన్ అశ్విన్. ఇక గిల్ ని బిసిసిఐ ఆసియా కప్ 2025 జట్టులో చేర్చింది. వాస్తవానికి 2024 జూలై తరువాత గిల్ టీ-20 మ్యాచ్ లు ఆడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కీలక టోర్నీకి గిల్ ఎంపికపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. శ్రేయస్ అయ్యర్ ఐపిఎల్ 2025లో అద్భుత ప్రదర్శన చేశాడు.
Also Read: Watch Video: ఆ గుండె బతకాలి రా.. రనౌట్ కు ఛాన్స్ ఉన్న కొట్టలేదు… వీడియో చూస్తే దిమ్మతిరగాల్సిందే
అతడు ఈ సీజన్ లో 17 మ్యాచ్లలో 50.33 సగటు 604 పరుగులు చేయడం సెలెక్టర్లకు కనిపించలేదా అని ప్రశ్నించాడు. శ్రేయస్ అయ్యర్ ఇప్పటివరకు 51 టీ-20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. ఇందులో 30.66 యావరేజ్ తో 1104 పరుగులు చేశాడు. డిసెంబర్ లో ఆస్ట్రేలియాతో చివరి టీ-20 మ్యాచ్ ఆడాడు అయ్యర్. ఆ తర్వాత ఇప్పటివరకు టి-20 ఇంటర్నేషనల్స్ లో రీ ఎంట్రీ ఇవ్వలేకపోయాడు. ఇక గిల్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ పర్యటనలో 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ని భారత్ 2-2 తో సమం చేసిన విషయం తెలిసిందే. దీంతో గిల్ కి వైస్ కెప్టెన్ గా ప్రమోషన్ ఇవ్వడంతో పాటు ఏడాది తరువాత భారత జట్టులోకి వచ్చాడు.