Dhanashree Verma: స్టార్ క్రికెటర్ చాహల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇతడు టీమిండియా స్టార్ స్పిన్నర్. చాహల్ టీమిండియా జట్టుకు దూరమై దాదాపు రెండేళ్లు పూర్తవుతుంది. ఇతనికి అవకాశాలు అసలే రావడం లేదు. ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ జట్టు తరఫున తన ఆట తీరును అద్భుతంగా కొనసాగించాడు. అయినప్పటికీ కూడా చాహల్ కు టీమిండియాలో అవకాశాలు రావడం లేదు. నిన్న ప్రకటించిన ఆసియా కప్ – 2025 టోర్నమెంట్ లో భాగంగా టీమిండియా జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో చాహల్ పేరు లేకపోవడం నిజంగా బాధాకరం. ఇదిలా ఉండగా… చాహల్ వ్యక్తిగత విషయానికి వచ్చినట్లయితే ఇతడు 2020లో కొరియోగ్రాఫర్, కంటెంట్ క్రియేటర్ అయిన ధనశ్రీ వర్మను ప్రేమించి వివాహం చేసుకున్నాడు.
వివాహం తర్వాత ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట మనస్పర్ధల కారణంగా 2022 నుంచే దూరంగా ఉంటున్నారు. ఇక ముంబై కోర్టు వీరికి 2025లో విడాకులు ఇచ్చింది. విడాకుల తర్వాత చాహల్ ఎన్నో రకాల విమర్శలకు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో తాను సూసైడ్ చేసుకోవాలని కూడా అనుకున్నారట. ఈ విషయాన్ని స్వయంగా చాహాల్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చారు. ధన శ్రీ వర్మ మాత్రం విడాకుల అనంతరం ఎంతో సంతోషంగా తన లైఫ్ కొనసాగిస్తోంది. సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.
కేకలు పెట్టి ఏడ్చినా చాహల్ మాజీ భార్య
ఇదిలా ఉండగా…. ధనశ్రీ వర్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. ముఖ్యంగా తన విడాకుల గురించి మాట్లాడారు. విడాకులు ఇస్తున్న సమయంలో కోర్టులో తాను కేకలు పెడుతూ ఏడ్చినట్టుగా పేర్కొన్నారు. కానీ చాహల్ మాత్రం వాటిని ఏమి పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడని ధనశ్రీ వర్మ అన్నారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇక విడాకుల రోజు చాహల్ “BE Your Own Sugar Daddy” అని రాసి ఉన్న టీ షర్ట్ ధరించడం అనేక రకాల చర్చలకు దారి తీసింది. ఆ టీ షర్ట్ ధరించడంతో అనేక రకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఆ టీషర్ట్ ధరించడానికి గల కారణం ఏంటని చాలా మంది చర్చలు కూడా జరిపారు. ఇక ప్రస్తుతం చాహల్ నటి ఆర్ జె మహ వాష్ తో ప్రేమలో ఉన్నట్లుగా అనేక రకాల వార్తలు వైరల్ అయ్యాయి. దీనికి సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి ఇక వాటిపై చాలు స్పందిస్తూ మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని అన్నారు మా మధ్య ఎలాంటి ప్రేమ లేదని స్పష్టం చేశారు. చాహల్ చెప్పిన ఈ విషయాలతో వీరిద్దరి మధ్య ఎలాంటి ప్రేమ లేదని అందరికీ అర్థమైంది. ఆ తర్వాత నుంచి వీరిపై స్కూల్స్ చేయడం మానేశారు.
Also Read: India Asia Cup 2025 Squad: ఆసియా కప్ 2025 ఆడే టీమిండియా జట్టు ఇదే..శ్రేయాస్ అయ్యర్ కు నిరాశే !
Dhanashree Verma on Ex Husband Yuzi Chahal.!! #dhanashreeverma
— MANU. (@IMManu_18) August 20, 2025