BigTV English

Asia Cup 2025 : ఆసియా కప్ లో మొత్తం ముంబై, KKR ప్లేయర్లే

Asia Cup 2025 : ఆసియా కప్ లో మొత్తం ముంబై, KKR ప్లేయర్లే

Asia Cup 2025 : ఆసియా కప్ టీ-20 టోర్నీకి భారత జట్టును నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. అజిత్ అగార్కర్ నాయకత్వంలో సెలక్షన్ కమిటీ ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో 15 మంది సభ్యుల జట్టుకు శుబ్ మన్ గిల్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. మరో ఐదుగురు ఆటగాళ్లను రిజర్వ్ లుగా ఎంపిక చేశారు. సెప్టెంబర్ 09 నుంచి 28 వరకు యూనైటేడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఆసియా కప్ టోర్నీ జరుగుతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో భారత్ లో జరిగే టీ-20 వరల్డ్ కప్ కి ముందు టీమిండియా దాదాపు 20 మ్యాచ్ లు ఆడనుంది. దీనిని దృష్టిలో ఉంచుకుంటూ జట్టును ఎంపిక చేశారు. ఆసియా కప్ 2025 కి ఎంపిక చేసిన జట్టులో ఎక్కువగా ముంబై ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లే ఉండటం గమనార్హం. 


Also Read : Ms Dhoni: ధోని వాచ్ ల కలెక్షన్ చూస్తే.. షాక్ అవ్వాల్సిందే…ఎన్ని కోట్లు అంటే

ముంబై నుంచి నలుగురు.. కోల్ కతా నుంచి ముగ్గురు 


అయితే ముంబై ఇండియన్స్ నుంచి సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జస్ప్రిత్ బుమ్రా ఆసియా కప్ కి ఎంపికయ్యారు. కోల్ కతా నైట్ రైడర్స్ నుంచి వరుణ్ చక్రవర్తి, రింకూసింగ్, హర్షిత్ రాణాలను ఎంపిక చేశారు. . ఇక పేసర్ హర్షిత్ రాణా ఎంపిక మాత్రం అనూహ్యం అనే చెప్పవచ్చు. ఏకైన టీ-20 ఆడిన అతను ఐపీఎల్ లో కూడా రాణించలేదు. అయితే ప్రసిద్ధ్ కృష్ణ తో పోల్చితే కాస్త బ్యాటింగ్ చేయగలగడం అతనికి సానుకూలంగా మారింది.  ముఖ్యంగా ఐపీఎల్ లో 604 పరుగులు సాధించడంతో పాటు పంజాబ్ కింగ్స్ ను ఫైనల్ కి చేర్చిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కి మరోసారి నిరాశే ఎదురైంది. ఈ ఫార్మాట్ లో అతని పై సెలక్టర్లు నమ్మకం ఉంచడం లేదు. అభిషేక్ మెరుపు బ్యాటింగ్ కారణంగా యశస్వి జైస్వాల్ ను కూడా పక్కన పెట్టాల్సి వచ్చింది. ఇప్పటికే ముగ్గురు స్పిన్నర్లు ఉండటంతో వాషింగ్టన్ సుందర్ ను కూడా ఎంపిక చేయకుండా స్పెషలిస్ట్ బ్యాటర్ గా రింకూసింగ్ ను తీసుకున్నారు.

రిజర్వ్ కింద వారే.. 

ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఎంపిక కాగా.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నుంచి శివమ్ దూబే, గుజరాత్ టైటాన్స్ నుంచి శుబ్ మన్ గిల్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నుంచి అభిషేక్ శర్మ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి జితేష్ శర్మను ఎంపిక చేశారు. సీనియర్ ఆటగాడు కే.ఎల్. రాహుల్ ని వికెట్ కీపర్ గా ఎంపిక చేస్తారనుకుంటే చేయలేదు. రాహుల్ 2025 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడాడు. ఇక పంజాబ్ కింగ్స్  నుంచి అర్ష్ దీప్ సింగ్, రాజస్థాన్ రాయల్స్ జట్టు నుంచి సంజు శాంసన్ లను ఎంపిక చేశారు. అయితే అత్యధికంగా ముంబై ఇండియన్స్ నుంచి నలుగురిని ఎంపిక చేయగా.. కోల్ కతా నుంచి ముగ్గురిని ఎంపిక చేయడం విశేషం. రిజర్వ్ కింద  ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, జురేల్, యశస్వి జైస్వాల్ ను ఎంపిక చేశారు. 

Related News

Pakistan: ఇండియా పౌర‌స‌త్వం తీసుకోనున్న పాక్ క్రికెట‌ర్‌.. RSSను మ‌ధ్య‌లోకి లాగి మ‌రీ !

AUS VS NZ: 50 బంతుల్లోనే సెంచ‌రీ చేసిన‌ మిచెల్ మార్ష్‌…న్యూజిలాండ్ పై టీ20 సిరీస్ కైవ‌సం

India ODI Captain: రోహిత్ శ‌ర్మ‌కు ఎదురుదెబ్బ‌..ఇక‌పై వ‌న్డేల‌కు కొత్త కెప్టెన్‌, ఎవ‌రంటే ?

IND VS WI: మూడు రోజుల్లోనే తొలి టెస్ట్ ఫినీష్‌..వెస్టిండీస్ పై టీమిండియా గ్రాండ్ విక్ట‌రీ

Dhruv Jurel: 5 ఏళ్లకే ప్లాస్టిక్ స‌ర్జ‌రీ, గోల్డ్ చైన్ తాక‌ట్టు పెట్టిన త‌ల్లి..జురెల్ జీవితాన్ని మార్చేసిన బ‌స్సు ప్ర‌మాదం !

Nitish Kumar Reddy Catch: కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన నితీశ్ కుమార్..గాల్లోకి ఎగిరి మ‌రీ

Sanju Samson: కేర‌ళ‌లో సంజు శాంసన్ రేంజ్ చూడండి..ఏకంగా హెలికాప్ట‌ర్ లోనే మాస్ ఎంట్రీ

Pakistan Girls: పాకిస్థాన్ జ‌ట్టులో కిరాక్ పోరీ…ఈ ఫోటోలు చూస్తే మ‌తిపోవాల్సిందే

Big Stories

×