Mumbai Indians : టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్(Sachin tendulkar) కుమారుడు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) దాదాపు అందరికీ తెలిసే ఉంటాడు. అర్జున్ టెండూల్కర్ 2021 నుండి ముంబై ఇండియన్స్ జట్టులో భాగంగా ఉన్నాడు. 2023 లో IPL లోకి అరంగేట్రం చేశాడు. అతను అంతగా ప్రదర్శన చేయకపోవడంతో కేవలం జట్టులో భాగంగానే ఉంటున్నాడు. 2025 సీజన్ లో 30 లక్షలకు కొనుగోలు చేసిన ముంబై అతన్ని ఒక్క మ్యాచ్ లో కూడా ఆడించలేదు. అయితే ముంబై ఇండియన్స్ 2026 సీజన్ కి సంబంధించి అర్జున్ టెండూల్కర్ 30 లక్షలు, రోబిన్ మింజ్ రూ.6కోట్లు, విల్ జాక్స్ 5.25 కోట్లు, దీపక్ చాహర్ రూ.9.25 కోట్ల విలువ ఆటగాళ్లను రిలీజ్ చేసింది. వీరిలో ముఖ్యంగా సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ని వదులుకోవడం ఇప్పుడు వైరల్ గా మారింది.
Also Read : BCCI Betrays Country : బీసీసీఐ దోశద్రోహి.. జైషాకు డబ్బుల కక్కుర్తి అంటూ?
అర్జున్ పై ముంబై వేటు..?
సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) ఆడినన్ని రోజులు కూడా ముంబై ఇండియన్స్ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు. ముంబై ఇండియన్స్(Mumbai Indians) టైటిల్స్ సాధించిన తరువాత తన రిటైర్మెంట్ ప్రకటించేశాడు సచిన్. ఇవాళ రిలీజ్ ఆటగాళ్లందరి విలువ కలిపి రూ.20.8 కోట్లు అన్నమాట. ముంబై 28 కోట్లను మిగిలించుకుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ యాజమాన్యం 2024లోనే కెప్టెన్సీ నుంచి తొలగించి హార్దిక్ పాండ్యా ని నియమించింది. వాస్తవానికి గుజరాత్ టైటాన్స్ జట్టుకి కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యా ను ముంబై కొనుగోలు చేసింది. మరోవైపు ముంబై ఇండియన్స్ ఆటగాడు అర్జున్ టెండూల్కర్ ఇటీవలే ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. అయితే ఎంగేజ్ మెంట్ కారణంగానే అర్జున్ టెండూల్కర్ పై ముంబై ఇండియన్స్ వేటు వేసిందా.? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
అర్జున్ టెండూల్కర్ రెండో ఇన్నింగ్స్..
అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) ఇటీవలే నిశ్చితార్థం చేసుకొని తన జీవితంలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అర్జున్ కెరీర్ పరంగా పెద్ద షాక్ ఎదుర్కొన్నాడు. ఆగస్టు 28 నుంచి ప్రారంభం అయ్యే దులీప్ ట్రోఫీలో అర్జున్ (Arjun) కి అవకాశం రాలేదు. చాలా మంది స్టార్ ఆటగాళ్లు ఈ టోర్నమెంట్ లో ఆడుతున్నారు. సచిన్ కొడుకును ఈ సారి విస్మరించారు. గోవా తరపున దులీప్ ట్రోపీలో ఆడాలని ఆశించారు. కానీ నార్త్ ఈస్ట్ జోన్ జట్టు అతని ఆశలను వమ్ము చేసింది. దులీప్ రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూపులో నాలుగు మ్యాచ్ ల్లో 16 వికెట్లు తీసిన అర్జున్ టెండూల్కర్, దులీప్ ట్రోఫీ కోసం నార్త్ ఈస్ట్ జోన్ జట్టులో చోటు దక్కించుకోలేదు. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ నుంచి రిలీజ్ అయ్యాడు. 2022-23 సీజన్ నుంచి అర్జున్ గోవా తరపున ఆడుతున్నాడు. డిసెంబర్ 2023లో గోవా తరపున తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడి.. అర్జున్ టెండూల్కర్ (Arjun tendulkar) అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఇప్పటివరకు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో 37 వికెట్లు తీసి.. 532 పరుగులు చేశాడు అర్జున్ టెండూల్కర్. ప్రస్తుతం అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం.. ముంబై ఇండియన్స్ నుంచి ఔట్ అయ్యాడనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడం విశేషం.