Jio AirFiber Free For 1 Year| దీపావళి పండుగ కానుకగా రిలయన్స్ జియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఒక సంవత్సరం పాటు జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్ ఉచితమని ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 3 వరకే కస్టమర్లుకు అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ కొత్త జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్ తీసుకునేవారితో పాటు పాత జియోఫైబర్ కనెక్షన్ ఉన్నవారికి కూడా లభిస్తుంది.
ఒక సంవత్సరం ఎయిర్ ఫైబర్ సబ్సిక్రిప్షన్ ఫీగా ఎలా పొందాలంటే?
కొత్తగా ఎయిర్ ఫైబర్ కనెక్షన్ పొందాలనుకునే వారు లేదా పాత జియో ఫైబర్ కనెక్షన్ ఉన్నవారు.. రిలయన్స్ డిజిటల్ లేదా మైజియో స్టోర్ లో కనీసం రూ.20000 షాపింగ్ చేయాలి. రూ.20000 షాపింగ్ అంటే వినడానికి ఎక్కవగా అనిపించినా.. టీవి, లాప్ టాప్, మొబైల్ లేదా ఇతర ఎలెక్ట్రానిక్స్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఉపయోగపడుతుంది. అలా షాపింగ్ చేసినవారిలో లక్కీ డ్రా పద్ధతిలో విన్నర్ అయిన వారికి జియో ఎయిర్ ఫైబర్ సబ్స్‌క్రిప్షన్ ఏడాదిపాటు ఉచితంగా లభిస్తుంది.
ఈ సబ్స్‌క్రిప్షన్ కు అర్హులైనవారికి 12 ఉచిత కూపన్లు లభిస్తాయి. వీటిని జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్ కోసం వినియోగించాలి. ఈ కూపన్లు రిలయన్స్ డిజిటల్, మై జియో, జియో పాయింట్, జియో మార్ట్ డిజిటల్ ఎక్స్ క్లూజివ్ స్టోర్స్ లలో నుంచి వినియోగదారులు పొందగలరు.
Also Read: రిటైర్మెంట్ తరువాత నెలకు రూ.లక్ష సంపాదన.. ఇలా ప్లాన్ చేసుకోండి సరిపోతుంది..
ఈ కూపన్లు.. జియో ఎలెక్ట్రానిక్స్ లో 15000 లేదా అంతకంటే ఎక్కవ ధర గల పరికరాలు కొనుగోలు చేసేందుకు కూడా ఉపయోగపడతాయి. అయితే వీటి గడువు నెల రోజులు మాత్రమే.
ఆఫర్ గడువు: సెప్టెంబర్ 18, 2024 – నవంబర్ 3, 2024
కూపన్ వ్యాలిడిటీ : కూపన్లు నవంబర్ 2024 నుండి అక్టోబర్ 2025 వరకు చెల్లుబాటు అవుతాయి.
పాత జియో ఫైబర్ వినియోగదారులు రూ.2222 ల దీపావళి స్పెషల్ ప్లాన్ రిచార్జ్ చేసుకుంటే.. వారికి ఒక సంవత్సరం ఫ్రీ జియో ఎయిర్ ఫైబర్ సర్వీస్ లభిస్తుంది.
ఈ ఆఫర్ తో పాటు జియో మరో ఆఫర్ ని కూడా ప్రకటించింది. కస్టమర్లకు రూ.3599 ధర గల వార్షిక మొబైల్ రిచార్జ్ ఉచితంగా పొందవచ్చు. కొత్త జియో ఎయిర్ ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ తీసుకుంటే ఈ వార్షిక రిచార్జ్ ఫ్రీగా లభిస్తుంది.
దీనికోసం జియో వెబ్ సైట్ లేదా మైజియో యాప్ లో ఎయిర్ ఫైబర్ కనెక్షన్ బుకింగ్ చేసుకోవాలి. బుకింగ్ చార్జ్ రూ.50 మాత్రమే. ప్రస్తుతం ఎయిర్ ఫైబర్ ఫ్రీడమ్ ఆఫర్ కింద మూడు నెలల సబ్స్‌క్రిప్షన్ తీసుకుంటే 30 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.2121 మాత్రమే అందుబాటులోకి వస్తుంది.
ఈ సబ్స్‌క్రిప్షన్ లో 1000GB డేటా ప్రతినెలా ఉచితం, 800 డిజిటల్ టివి ఛానెల్స్, 13 ఓటిటి యాప్స్ లభిస్తాయి. ఆ తరువాత రూ.3599 వార్షిక సబ్స్‌క్రిప్షన్ లభిస్తుంది.
ఇందులో ప్రతిరోజు 2.5GB హై-స్పీడ్ 5G డేటా, రోజుకు 100 ఉచిత SMS, ఏదైనా నెట్‌వర్క్‌లో ఉచిత జాతీయ రోమింగ్ బెనిఫిట్స్ ఉంటాయి.