BigTV English

Ms Dhoni: ధోని వాచ్ ల కలెక్షన్ చూస్తే.. షాక్ అవ్వాల్సిందే…ఎన్ని కోట్లు అంటే

Ms Dhoni: ధోని వాచ్ ల కలెక్షన్ చూస్తే.. షాక్ అవ్వాల్సిందే…ఎన్ని కోట్లు అంటే

Ms Dhoni: ఎమ్మెస్ ధోని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. క్రికెట్ చరిత్రలో ఎంఎస్ ధోని ఎన్నో అద్భుతాలు విజయాలు సృష్టించాడు. 2007 టీ20 వరల్డ్ కప్ ను మొట్టమొదటిసారిగా గెలిపించిన వీరుడు. 2011 సంవత్సరంలో వన్డే వరల్డ్ కప్ ను తీసుకువచ్చాడు. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియాకు అందించాడు. ఐపీఎల్ మ్యాచ్ లలో సీఎస్కే కెప్టెన్ గా తన బాధ్యతలను వహించి ఆ జట్టును విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లాడు. అంతేకాకుండా సీఎస్కే జట్టుకు ఏకంగా ఐదుసార్లు ట్రోఫీలను అందించాడు. ఒక్కసారి గెలవడానికి ఇతర జట్లు ఎన్నో ఇబ్బందులను పడితే సీఎస్కే మాత్రం ఏకంగా ఐదుసార్లు టైటిల్ లను కైవసం చేసుకుంది. అలా సక్సెస్ఫుల్ కెప్టెన్ గా ధోని ముందుకు వెళ్తున్నారు.


Also Read: Billy Bowden : అంపైర్ బిల్లీ బౌడెన్ వేళ్లు ఎప్పుడు ఎందుకు అలా వంకరగా ఉంటాయి.. అంత ప్రమాదకరమైన వ్యాధితో బాధపడుతున్నాడా?

ఇక ధోని టీమిండియాకు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ఐపీఎల్ మ్యాచ్లు మాత్రం ఆడుతున్నాడు. ఇప్పటికీ సీఎస్కే జట్టుకు కెప్టెన్ గా తన బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. ధోని క్రికెట్ ద్వారా భారీగా డబ్బులను సంపాదించాడు. అంతేకాకుండా వ్యాపారాలు కూడా నిర్వహిస్తాడు. వ్యవసాయం, పౌల్ట్రీ పరిశ్రమలు, మరోవైపు ఇండియన్ ఆర్మీలో కూడా ధోని పనిచేశారు. ఇక ధోనికి భారీగా ఆస్తులు, భవనాలు, కార్లు, బైకులు, వాచ్లు ఉన్నాయి. వీటన్నింటి విలువ కొన్ని కోట్లలో ఉంటుంది. ఇక ధోనీకి వాచ్ లు అంటే విపరీతంగా ఇష్టం. తన వద్ద కనీసం 15కు పైనే కాస్ట్లీ వాచ్ లు ఉన్నాయి.


అందులో కాస్మోగ్రాఫ్ డేటోనా ప్లాటినం డైమండ్ పావెడ్ బెజిల్ వాచ్ ఖరీదు 2.14 కోట్లు, రోలెక్స్ డెటోనా వైట్ అండ్ బ్లాక్ మదర్ ఆఫ్ పేర్ల్ డయల్ వాచ్ ఖరీదు 87,26,349 రూపాయలు, రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా ప్లాటినం ఐస్ బ్లూ డైమండ్ సెట్ వాచ్ ఖరీదు 1.53 కోట్లు, రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటా ఎల్లో గోల్డ్ జాన్ మేయర్ గ్రీన్ డయల్ వాచ్ ఖరీదు 70,38,278 రూపాయలు, రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా ఒస్టర్ ఫ్లెక్స్ యెల్లో గోల్డ్ వాచ్ 1. 32 కోట్లు, కాస్మోగ్రాఫ్ డెటోనా బ్లూ డయల్ వైట్ గోల్డ్ బ్రేస్లెట్ వాచ్ 70,16,312 రూపాయలు, రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డెటోనా బ్లాక్ అండ్ ఎల్లో గోల్డ్ వాచ్ 1. 23 కోట్లు, రోలెక్స్ స్కై రోజ్ గోల్డ్ బెజెల్ బ్లూ గ్రీన్ వాచ్ 69,73,080 రూపాయలు ఉంటుంది.

రోలెక్స్ డే అండ్ డేట్ 40 ఆలివ్ గ్రీన్ డయల్ ప్లాటినం డైమండ్ వాచ్ 1.09 కోట్లు, పనేరయ్ లుమినర్ రిగట్ట ట్రాన్స్లేట్ క్లాసిక్ బ్లూ డయల్ ట్రాక్స్ వాచ్ ఖరీదు 19,66,715 రూపాయలు, పనేరయ్ లుమినర్ క్రోనోగ్రాఫ్ గ్రీన్ డయల్ ఫ్లైబ్యాక్ వాచ్ 28,38,300 రూపాయలు, ఒమేగా స్పీడ్ మాస్టర్ ప్రొఫెషనల్ సిల్వర్ స్నూపీ అవార్డు వాచ్ ఖరీదు 17,53,726 రూపాయలు, తుడార్ బ్లాక్ బే క్రోనోగ్రాఫ్ పింక్ ఇంటర్ మియామి డయల్ బ్లాక్ బెజెల్ వాచ్ ఖరీదు 8,72,668 రూపాయలు. వీటన్నింటి విలువ కొన్ని కోట్లలో ఉంటుంది. ఇంకా ఎన్నో రకాల వాచ్ లు ధోని వద్ద ఉండడం విశేషం.

Also Read: India Asia Cup 2025 Squad: ఆసియా కప్ 2025 ఆడే టీమిండియా జట్టు ఇదే..శ్రేయాస్ అయ్యర్ కు నిరాశే !

Related News

Mumbai Indians : ఎంగేజ్మెంట్ ఎఫెక్ట్.. అర్జున్ టెండూల్కర్ పై ముంబై ఇండియన్స్ వేటు?

Rohit Sharma : ముంబైలో భారీ వర్షాలు.. రోహిత్ శర్మ సంచలన ప్రకటన.. జాగ్రత్త అంటూ

BCCI Betrays Country : బీసీసీఐ దోశద్రోహి.. జైషాకు డబ్బుల కక్కుర్తి అంటూ?

Ambati Rayudu : మీది ఒక బతుకేనా… ఆ స్థాయికి రావాలంటే 72 ఏళ్లు పడుతుంది..RCB ఇజ్జత్ తీసిన అంబటి రాయుడు

SA vs Aus 1st ODI : ఆస్ట్రేలియాలో చిత్తుచిత్తుగా ఓడించిన సౌత్ ఆఫ్రికా.. ఏకంగా 98 పరుగుల తేడాతో

Big Stories

×